అర్హులకు అందాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
గాజువాక (విశాఖ) : అర్హులకు అందాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో కొందరు టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని 50 వ వార్డుకు చెందిన టీడీపీ నగర కార్యదర్శి దొడ్డి రమణ ఇంట్లో నిరుపేదలకు అందాల్సిన సిలిండర్లు లభ్యమయ్యాయి.
అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచారనే సమాచారంతో.. ఆయన నివాసంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 సిలిండర్లు, 21 రెగ్యులేటర్లు, 24 గ్యాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.