చెరువులో పడి బాలుడు మృతి | 12 year old boy drowns in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి బాలుడు మృతి

Oct 18 2015 9:40 AM | Updated on Sep 17 2018 8:02 PM

కలువ పూల కోసం చెరువులో దిగిన ఒక బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు.

పాతపట్నం (శ్రీకాకుళం జిల్లా) : కలువ పూల కోసం చెరువులో దిగిన ఒక బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శివశంకరకాలనీలో ఆదివారం ఉదయం జరిగింది.

శివశంకరకాలనీకి చెందిన రామకృష్ణ, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీచరణ్‌కుమార్(12) ఆదివారం ఉదయం కలువపూల కోసం పక్కనే ఉన్న సీతారాంపల్లి చెరువుకు వెళ్లాడు. పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి మృతిచెందాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement