100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం | 100 bags ration rice seized | Sakshi
Sakshi News home page

100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

Aug 15 2015 3:09 PM | Updated on Sep 3 2017 7:30 AM

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వంద బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.

సింగరాయకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వంద బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న లిక్కర్‌ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు.

దీంతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వెలుగుచూసింది. లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement