వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Jan 1 2016 12:34 PM | Updated on Aug 30 2018 3:56 PM
వినుకొండ: వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో శుక్రవారం చోటు చేసుకుంది. వినుకొండ నుంచి బైక్‌పై వెళ్తున్న వాసిరెడ్డి వీర భద్రయ్య గ్రామ శివారులోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


