breaking news
-
బాబు, రేవంత్.. ఇలాంటి సినిమాలకు రాయితీలా?: నారాయణ ఫైర్
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విడుదల సందర్భంగా రాయితీలు, టికెట్ రేట్ల పెంపు సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి రాయితీలు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.సీపీఐ నారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్ నారాయణ మూర్తిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలి. నారాయణ మూర్తి యూనివర్సిటీ సినిమాలో పేపర్ లీకేజీల వలన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నది చూపించారు. అలాంటి ఒక సందేశాత్మక చిత్రం తీశారు. నారాయణ మూర్తికి ఏ ప్రభుత్వ సహాయం అవసరం లేదు అన్నారు. సమాజంలో హింసను ప్రేరేపించే సినిమాలకు ఏపీ, తెలంగాణ సీఎంలు రాయితీలు ఇస్తారా?పవన్ కళ్యాణ్ సహా పలువురి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, బ్లాక్‌లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటి?. ఇది దివాళాకోరు రాజకీయం. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలకు రాయితీలు ఇవ్వకుండా హింసను ప్రేరేపించే చిత్రాలకు రాయితీలు ఇవ్వడం దివాళాకోరుతనం అవుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టేందుకు చంద్రబాబు కుట్ర: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పదేపదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..ఎన్నికల్లో హామీలతో ఊదరగొట్టారు:కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుకు నెలకు రూ.3 వేల కోట్లు చొప్పున ఏడాదికి రూ.37వేల కోట్లు అవసరం. ఇప్పటికే గతేడాది ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.ఈ రెండేళ్లకు కలిపి రూ.75 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆడ బిడ్డలు కష్టాల్లో ఉన్నారు వారి కష్టాన్ని తీర్చడానికి ఈ పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. కూటమి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఇంటింటికీ బాండు పేపర్లు కూడా ఇచ్చారు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు. ఇప్పటి మంత్రి రామానాయుడు అయితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అన్న విషయం ఆ రోజు మీకు ఎందుకు గుర్తులేదు.అచ్చెన్నాయుడు మాటలు మోసానికి పరాకాష్ట:మంత్రి లోకేష్ కూడా తన యువగళం పాదయాత్రలో కూడా ఈ హామీలిచ్చారు. ఇక చంద్రబాబు అయితే పదే పదే ప్రతి సభలోనూ.. ప్రతి ఆడబిడ్డకు రూ.1500 ఇస్తాను దాన్ని రూ.15వేలు చేసే మార్గం చెబుతానని ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రానే అమ్మాలన్న ఆలోచన చేస్తున్నారని సాక్షాత్తూ మంత్రి అచ్చన్నాయుడు చెబుతున్నాడు. ఈ వ్యాఖ్యలు మోసానికి పరాకాష్ట.గతేడాది, ఈ ఏడాది రెండూ కలిపి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు ఇస్తారని ఎదురుచూస్తున్న మహిళలకు.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి. ఇది కేవలం అచ్చన్నాయుడు వ్యాఖ్యలు మాత్రమే కాదు.. చంద్రబాబు మాట కూడా ఇదే. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేసేశాం. ఎవరైనా కాదు అంటే వాళ్ల నాలుక మందం అని మాట్లాడుతున్నారు.ఒక్క పథకమైనా అమలు చేశారా?అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న చంద్రబాబుకి ఆయన కేబినెట్ మంత్రులని సూటిగా అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి అయినా మీరు నిరుద్యోగభృతి ఇచ్చారా.? ఒక్క నిరుద్యోగికి అయినా ఒక్క ఉద్యోగం ఇచ్చారా.? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇచ్చారా.? ఒక్క మహిళకైనా గత ఏడాది కాలంలో 3 సిలిండర్లు ఫుల్ గా ఇచ్చారా.?ఒక్క మహిళకైనా ఇళ్లు ఇచ్చారా ఇళ్ల స్థలం ఇచ్చారా, సున్నా వడ్డీ ఇచ్చారా.? ఒక్క ఉద్యోగికైనా సున్నా వడ్డీ ఇచ్చారా ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా.? ఒక్క రైతుకైనా రైతుభరోసా ఇచ్చారా.? ఇవేవీ ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నిట్టనిలువునా మోసపోయారు.ఏడాదిలో చేసిన రూ.1.86 లక్షల కోట్ల అప్పు ఏమైంది.?వైఎస్ జగన్ హయాంలో అన్ని పథకాలను చక్కగా అమలు చేశారు. నవరత్నాలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం వంటి పథకాలు ఇస్తే... ఇదే కూటమి నేతలు ఆ రోజు ఈ పథకాలన్నీ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు. మరలా ఎన్నికల టైం వచ్చేసరికి ప్రజలను మభ్యపెట్టడానికి అవే పథకాలకు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు.ఈ రోజు మీరు చెప్పిన పథకాలేవీ అమలు చేయకుండా.. వాటిని అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పడం ఎంతవరకు సమంజసం.? ఆడబిడ్డ నిధి పథకానికి ఏడాదికి రూ.37వేలు కోట్లు కావాలి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు రూ.1.86 లక్షల కోట్లు. అందులో రూ.37 వేల కోట్లు ఆడబిడ్డ నిధి పథకానికి ఎందుకు ఖర్చు చేయలేదు. మీరు అప్పు చేసిన డబ్బులు ఎటువైపు వెళ్తున్నాయి.గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.3.30 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అందులో సగం కంటే ఎక్కువ అప్పు చేశారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన అప్పులో రూ.2.75 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లలోకి నేరుగా డీబీటీ చేస్తే... మీరు ఏ హామీని అమలు చేయకుండా ప్రజలు మోసం చేసి.. ఈ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలని చెబుతున్నారు. మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు.హామీల అమలులో చిత్తశుద్ధి లేదు:కూటమి పార్టీలకు ప్రజలకిచ్చిన హామీల అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలిచ్చారే తప్ప వాటిని అమలు చేయాలన్న ఆలోచన లేదు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ద్వారా చంద్రబాబు విజనరీ కాదు విశ్వాస ఘాతకుడు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేంతవరకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు ఊదరగొట్టి ప్రచారం చేసిన హామీ. గతంలో వైఎస్ జగన్ హయాంలో చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 మహిళల అకౌంట్లలో జమ చేసి.. మొత్తం రూ.19 వేల కోట్లు జమ చేసారు. అంతేకాకుండా వారి స్వయం ఉపాధికి తోడ్పాడును అందిస్తూ.. ప్రముఖ సంస్థలతో టైఅఫ్ చేసుకుని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు నందించారు.2014లో చంద్రబాబు రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మహిళలను మోసం చేశారు. అదే విధంగా 2016 అక్టోబరు నుంచి సున్నావడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. దాంతో ఏ, బీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు సీ,డీ గ్రేడ్లుగా మారిపోయాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.25వేల కోట్లును ఆసరా పథకం ద్వారా.. మహిళా సంఘాలకు 2019 ఏఫ్రిల్ వరకు ఉన్న అప్పు తీర్చి ఆదుకున్నారు.తద్వారా గతంలో చంద్రబాబు హయాంలో సీ, డీ గ్రూపులుగా ఉన్న డ్వాక్రా సంఘాలు తిరిగి ఏ, బీ గ్రూపులుగా మారాయి. అంతగా మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయిలో కూర్చొబెట్టిన ఘనత వైఎస్ జగన్‌ది. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని సూపర్ సిక్స్‌తో సహా 143 హామీలిచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమేనని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. -
తణుకులో జనసేన రౌడీ మూకల వీరంగం
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకులో జనసేన రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్‌లోని ప్రచార రథంపై దాడి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు.ప్రచార రథంపై ఎక్కి.. జనసేన జెండాలు ఊపుతూ.. ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రచార రథం వెనుక.. కారులో కారుమూరి ఉన్నారు. జనసేన రౌడీ మూకలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
‘లిక్కర్ కేసులో ఈనాడు అసత్య ప్రచారం బట్టబయలు’
సాక్షి, తాడేపల్లి: అసలు లేని, జరగని లిక్కర్ స్కామ్‌పై రోజుకో కథనాన్ని వండి వారుస్తున్న ఈనాడు.. వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడానికి అత్యంత హేయంగా వ్యవహరించిందని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.ఏపీ బీసీఎల్ (రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, 2019–24 మధ్య లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3.58 లక్షల జీబీ డేటాను డిలీట్ చేశారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు. ప్రెస్మీట్లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..ఏపీ బీసీఎల్ ఏం చెప్పిందంటే..:రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీ బీసీఎల్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి 371 కోట్ల పేజీలకు సంబంధించిన 3.58 లక్షల జీబీ డేటా డిలీట్ చేశారంటూ, ఈనాడు రాసిన వార్త నిజమేనా అని సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆ సంస్థ సమాధానం చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తమ వద్ద ఎలాంటి డేటా డిలీట్ కాలేదని, అసలు అలాంటిదేమీ జరగలేదని ఏపీ బీసీఎల్ వెల్లడించింది.వాస్తవం ఇలా ఉంటే.. ‘వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి’ అంటూ ఈనాడు నిస్సిగ్గుగా కథనాన్ని వండి వార్చింది. దాని ఆధారంగా ఈటీవీలో కూడా ఏకంగా 8 నిమిషాల కథనాన్ని ప్రసారం చేశారు. అంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడం, వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేయడమే లక్ష్యంగా ఈనాడు ఏ స్థాయికి దిగజారి వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.వైఎస్సార్సీపీకి క్షమాపణ చెప్పాలి:ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం, ఆ పత్రిక చేస్తున్న కుట్ర, కుతంత్రాలపై పూర్తి సమాచారం, వివరాలతో ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తాం. ఏ మాత్రం విచక్షణ ఉన్నా.. ఇప్పటికైనా ఈనాడు, ఈటీవీ యాజమాన్యం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, జర్నలిస్టు విలువలను పాటించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.అంతా ఒక వ్యూహం:‘సిట్’ దర్యాప్తు తీరు, ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన అంశాలు చూస్తే.. ఎల్లో మీడియాలో గాలి వార్తలన్నీ పోగేసి రాస్తున్న కథనాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతులేని ప్రజాభిమానం కలిగిన జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో, తనకు సన్నిహితంగా ఉండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాసి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.ఇక ప్రభుత్వం తాము టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేసేందుకు.. తొలుత వారిపై తమ అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం, ఆ తర్వాత ఎవరితోనో ఫిర్యాదు చేయించడం, వాటి ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని వేధించి, భయపెట్టి తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారి పేర్లు చెప్పించి, స్టేట్మెంట్ రికార్డు చేయడం, దాని తర్వాత తప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్టు చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే.. ఈ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వివరించారు. -
కమిటీల్లో వారికే ప్రాధాన్యత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్గా ముందుకెళ్లాలని.. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాలన్నారు. కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలని.. ఎక్కడా పొరపాట్లకు తావు ఇవ్వకూడదని ఆయన సూచించారు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.కొన్ని విభాగాలు మరింత ఫోకస్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకెళ్ళగలుగుతామన్న సజ్జల.. ఫైనల్‌గా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలన్నారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని.. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.‘‘అనుబంధ విభాగాలు కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తిచేయాలి. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాల పరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగేవారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్‌ని సీఎం చేసుకుందాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.ప్రజల తరుపున నిలబడదాం: ఆలూరు సాంబశివారెడ్డివైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘‘అనుబంధ విభాగాలకు సంబంధించి అందరం కలిసి పనిచేద్దాం. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెడదాం. నేను అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళతాను. మన అనుబంధ విభాగాలు 30 ఉన్నాయి. ఇవి అన్నీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఫోకస్ చేసి ప్రజల తరుపున నిలబడదాం. మన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళదాం...నెలకు ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏ విధంగా చేయాలనే దానిపై అందరం సమన్వయంతో ముందుకెళదాం. కమిటీల నియామకంపై ప్రధానంగా దృష్టిపెడదాం. వీలైనంత త్వరగా కమిటీల నియామకం పూర్తి అవ్వాలి. ఈ నెలాఖరికి ఎట్టి పరిస్ధితుల్లో అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు నియమించుకోవాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్థాయి కమిటీలు కూడా పూర్తవ్వాలి. జగనన్నను మరోసారి సీఎం చేసుకునేందుకు మనమంతా గట్టిగా పనిచేద్దాం. ప్రజల తలరాతలు మారాలంటే, వారికి మంచి భవిష్యత్ అందాలంటే జగనన్న మరోసారి సీఎం అవ్వాలి’’ అని సాంబశివారెడ్డి పేర్కొన్నారు. -
నువ్వు ఒక్కడివే.. నీకు ఛాన్స్ లేదు.. బయటికి పోండి
సాక్షి, నెల్లూరు: జిల్లా సమీక్ష మండలి సమావేశం(డీఆర్సీ) సమావేశం రాజకీయ రగడకు దారి తీసింది. కరేడు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడే ప్రయత్నం చేయగా.. మంత్రులు ఆనం, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆయన్ని అడ్డుకుని అవమానకర రీతిలో మాట్లాడారు. కరేడు రైతుల సమస్యపై బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో భూ సేకరణపై వివరణ ఇవ్వాలని, ఎంత భూములు సేకరిస్తున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్నించారు. అయితే మాధవరావును మాట్లాడనీయకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మీడియాపై చిందులేస్తూ బయటకు వెళ్లిపొమ్మంటూ ఊగిపోయారు.ఆ సమయంలో మంత్రి ఆనం కలుగజేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా.. ఎమ్మెల్సీకి అవకాశం లేదని, అవసరమైతే బయటకు వెళ్లిపోవాలని కటువుగా సూచించారు. ఆ సమయంలో మరో మంత్రి నారాయణ కూడా వేదిక మీదే ఉన్నారు. దీంతో మాధవరావు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.‘‘సమస్యలపై గళమెత్తడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు. శాసనమండలి సభ్యుడుగా సమస్యలపై గళమెత్తడానికి నాకు హక్కు ఉంది. మంత్రి రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇండో సోల్ కంపెనీకి గతంలో మేము 5,000 ఎకరాల కేటాయించాము. ఈ ప్రభుత్వం 8,000 ఎకరాలు కావాలంటుంది. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలిఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గ్రామాలకు గ్రామాలను పరిశ్రమల పేరుతో ఖాళీ చేయించడం ఘోరం. 3000 కుటుంబాలను పరిశ్రమల పేరుతో రోడ్డుకి ఈడ్చడం సబబు కాదు. ‘కరేడు రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది’’ అని అన్నారాయన. -
చంద్రబాబు సృష్టించిన బేతాళకథలే లిక్కర్ స్కాం: గోరంట్ల మాధవ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై ఉన్న కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాళ కథలే లిక్కర్ స్కాం కేసులని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడానికి బదులు రాజకీయ ప్రాపకం కోసం అంగలారుస్తున్న కొందరు పోలీస్ అధికారులే ఇటుంటి దిగజారుడు కుట్రలకు వంతపాడుతూ అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ అక్రమ అరెస్టేనని అందరికీ తెలుసునని అన్నారు. గీతదాటిన కొందరు పోలీస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టి, మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను గమనిస్తే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, రిమాండ్లకు పంపడం, అరెస్టులు చేయడం, కండిషన్ బెయిళ్లు, వారెంట్లు, సమన్లతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు.‘‘ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని బయటకు రాకుండా చేయడానికి చేయని ప్రయత్నం లేదు. నిబంధనల ప్రకారం జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాల్సి ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రక్షణ కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ కారణంగానే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదం జరిగి సింగయ్య మరణించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాన్ని సీరియస్ నేరం కింద కేసు నమోదు చేయడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఎంత దారుణంగా దిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. కొంతమంది పోలీసులు కూటమి ప్రభుత్వానికి సాగిల పడుతున్నారు.వైఎస్ జగన్ లక్ష్యంగా మిథున్‌రెడ్డి అరెస్ట్:వైఎస్ జగన్‌ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ హయాంలో జరగని లిక్కర్ స్కాంను జరిగినట్టు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉండేవారిని అక్రమంగా అరెస్టులు చేశారు. మా నాయకులు వైయస్ జగన్‌ని ఇబ్బంది పెడితే వైయస్సార్సీపీని లేకుండా చేయొచ్చన్న లక్ష్యంతో ముఖ్య నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నారు. ఇందులో భాగంగానే మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు పంపారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక, వారు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కాంను ఆధారాలతో సహా బయటకు తీసి ఆయన మీద కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. అందుకే వైఎస్సార్సీపీ మీద కక్ష కట్టి వైఎస్సార్సీపీ హయాంలో జరగని లిక్కర్ కుంభకోణాన్ని జరిగినట్టు తప్పుడు కథనాలు రాసి, భయపెట్టి తీసుకున్న వాంగ్మూలాలతో అక్రమ అరెస్టులు చేస్తున్నారు. బెయిల్‌పై ఉండి సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు:చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయక భక్తులు చనిపోయారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు టీడీపీ కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి మరో 10 మంది చనిపోయారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచ్చి తిరుపతిలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు చనిపోయారు. తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన కేసులో చంద్రబాబు మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.ఇవి కాకుండా లిక్కర్ స్కాం, రింగ్‌రోడ్ అలైన్ మెంట్ స్కాం, అసైన్డ్ ల్యాండ్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కాబడి 50 రోజులకు పైగా జైలు జీవితం గడిపి అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయటకొచ్చారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే అయిన తొలినాళ్లలో చంద్రబాబు మీద ఏలేరు భూ కుంభకోణం కేసు నమోదైంది.రైతుల నుంచి, భూ నిర్వాసితుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు ఆయన మీద కేసు నమోదైంది. ఉమ్మడి ఏపీలో ఆపద్ధర్మ సీఎంగా ఉండి హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను ఐఎంజీ అనే సంస్థకు అప్పనంగా కట్టబెట్టేశాడు. తద్వారా ఆ కంపెనీ నుంచి భారీగా కమీషన్లు తీసుకున్నట్టు కేసు నమోదైంది. అవినీతి అనేది చంద్రబాబు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. -
‘చంద్రబాబు కుట్ర.. ఆడబిడ్డ నిధి పథకానికి మంగళం’
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి, నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్దమైందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది మహిళలను నమ్మించి వంచించడానికి చంద్రబాబు మరోసారి సిద్దమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోగా ఒక్కో పథకాన్ని ఎత్తేసే కుట్రలకు ప్రభుత్వం తెరదీస్తోంది. మోసపు హామీలిచ్చి మహిళల ఓట్లతో గెలిచిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వంచనకు గురిచేస్తున్నాయి. ఓట్ల కోసం మహిళలను నమ్మించేందుకు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకొచ్చి ఫేక్ బాండ్లతో ప్రచారం చేసుకున్నారు...వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలను ఇస్తూనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ నమ్మబలికారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్పించి, వాటిని అమలు చేసే ఆలోచన లేదని తమ చర్యల ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పథకం అమలు మీద దృష్టిసారించలేదు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 13 నెలలకు గాను దాదాపు రూ.36 వేల కోట్లకుపైగా మహిళలకు కూటమి ప్రభుత్వం బకాయి పడింది’’ అంటూ రాయన భాగ్యలక్ష్మి దుయ్యబట్టారు.మళ్లీ మళ్లీ అదే వంచన:'ఆడబిడ్డ నిధి' పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం పథకానికే మంగళం పాడేసే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలో ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ4తో అనుసంధానం చేస్తామని చెప్పి పథకాన్ని ఎత్తేయబోతున్నానని ఆ రోజే సంకేతాలు పంపారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి చేత ఇవ్వడం లేదని మరోసారి స్పష్టం చేశారు. పథకాలు అమలు చేయబోవడం లేదని మహిళలను మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు.గతంలోనూ 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో రూ.14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా మోసగించారు. దీంతో ఆ రుణాలు వడ్డీతో సహా రూ. 25,424 వేల కోట్లకు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో 2,10,58,615 మంది మహిళలకి ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ. 25,500 కోట్లు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 కోట్ల మంది మహిళలు కూటమి ప్రభుత్వంలో వంచనకు గురయ్యారు. ఉచిత బస్సు కూడా మోసమే:అధికారంలోకి రాకముందు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, గెలిచిన క్షణం నుంచి పథకలు ఇవ్వాలనే ఉంది కానీ గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పుకుంటూ ఏడాదిగా మోసం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం అప్పులంటూ మా వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మా ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.36 లక్షల కోట్లేనని ప్రజలకు నిజాలు తెలియడంతో వారి పప్పులు ఉండకడం లేదు.ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పి, ఆగస్టు 15 నుంచి జిల్లాకే పరిమితం చేస్తామని చెప్పి మహిళలకు వెన్నుపోటు పొడిచారు. కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ పార్టీలకు ఎందుకు ఓటేశామా అని తలలు పట్టుకుంటున్నారు’’ అని రాయన భాగ్యలక్ష్మి చెప్పుకొచ్చారు. -
ఏపీ తాలిబన్ల ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
సాక్షి, రాజమండ్రి: కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అయిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తోంది. ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయింది. కూటమి సర్కార్ అప్రజాస్వామిక్యంగా వెళ్తోంది. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. అయినా మిథున్‌రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపులను దీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే న్యాయపరంగా అందాల్సిన చర్యలను కూడా కూటమి అడ్డుకోవాలని చూస్తోంది. ఈ అన్యాయాలపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం అని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి కుట్రేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డిస్టలరీలతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు జరిపింది. మా పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కానీ, కూటమి పాలనలో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారు అని మండిపడ్డారాయన.కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మిథున్‌రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆయనపై పెట్టింది అక్రమ కేసు. వైఎస్సార్సీపీకి ఆయనకు అండగా ఉంటుంది మాజీ హోం మంత్రి అనిత అన్నారు.ప్రతిపక్షం నోరు నొక్కాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు భయపడి వెనక్కి తగ్గం అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. -
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‘వైఎస్సార్సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఇది ముమ్మూటికీ కల్పిత స్కామే.. ప్రభుత్వ కుట్రను బయటపెట్టిన భూమన
సాక్షి,తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అల్లిన కథ తప్ప మరొక్కటి కాదని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసారు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఆయన తేల్చి చెప్పారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 3760 లిక్కర్ షాపుల్లో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులకే చెందేలా కథ నడిపించారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో అక్రమాల మీద కేసు నమోదైన నేపధ్యంలో.. కేవలం కక్ష సాధింపుతోనే లేని స్కామ్‌లో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..లిక్కర్ స్కాం పేరుతో జరుగుతున్న అరెస్టులు కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం మాఫియా యధేచ్చగా దోపిడీ చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యాన్ని దశలవారీగా నిషేధించుకుంటూ వెళ్లాలన్న సామాజిక స్పృహతో పరిపాలన చేస్తే... చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మందు ఇస్తానని ఎన్నికలకు మందు ప్రచారం చేశాడు. నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో ఇవాళ 3760 బ్రాందీ షాపులును ఆయన తన పార్టీకి, జనసేనపార్టీకి చెందిన ప్రయివేటు వ్యక్తులకే దాదాపు 95 శాతానికి వచ్చేటట్టుగా చేశారు. ఇతరులు ఎవరైనా ఆ షాపులకు పోటీపడితే వాళ్లను బెదిరించి, టెండర్లలో పాల్గొనకుండా చేసి.. తమ పార్టీ వాళ్లకే వచ్చేటట్టు చేయడమే కాకుండా ప్రతినెలా ఒక్కో షాపు నుంచి రూ.1లక్ష వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు రూ.370 కోట్లు ప్రభుత్వ ముఖ్యులకు ఈ డబ్బులు ముడుతున్నాయి. ఇంతకంటే పెద్ద స్కామ్ మరొక్కటి లేదు. దానికి పరిహారంగా రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంటకు వెళ్లినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం నిబంధన మాత్రం ఉదయం 10 గంటల తర్వాతే బ్రాందీ షాపు తెరవాలని ఉన్నా... 24 గంటలు షాపులు అందుబాటులో ఉంటున్నాయి. అలా అనుమతి ఇచ్చినందుకే ప్రతి షాపు నుంచి నెలకు రూ.1లక్ష కమిషన్ బిగ్ బాస్ లకు ముట్టుతుంది. రాష్ట్రమంతటా ఇదే పద్దతి కొనసాగుతుంది. టెండర్లు వేసిన తర్వాత నిన్న మొన్నటి వరకు బ్రాందీ షాపు యజమానులకు 9 శాతం కమిషన్ ఇవ్వగా.. ఈ మధ్యనే దాన్ని 14.5 శాతం కమిషన్ పెంచారు. 24 గంటల షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు కమిషన్ కూడా పెంచారు. ఇలా కమిషన్ 5.5 శాతం పెంచడం వల్ల వీరి ఆదాయం రూ.1680 కోట్ల ఆదాయం పెరుగుతుంది. తద్వారా దాదాపు మరో రూ.800 కోట్లు బిగ్ బాస్ జేబులోకి వెళ్తున్నాయని మద్యం షాపులు యజమానులే చెబుతున్నారు.దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3760 బ్రాందీ షాపుల వెనుక ఒక మినీబార్ను ప్రారంభించారు. ఈ బార్లలో 24 గంటలు పాటు అమ్మకాలకు తెరతీసి... తాగే ఏర్పాటుచేస్తున్నారు. ఇదే విషయాన్ని తిరుపతిలో టైమింగ్స్ తో సహా నిరూపించాం. తిరుపతిని రోల్ మోడల్ గా చూపించి.. రాష్ట్రవ్యాప్తంగా చూపించారు. ఇదే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి బాటిల్ పైన రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇప్పుడు అమ్మడం ప్రారంభించారు. దీని ద్వారా మరలా కొన్ని వందల కోట్ల రూపాయలు టీడీపీ అధినేతకు, మద్యం షాపుల యజమానులకు అందుతుంది. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా మరలా 60 వేల మద్యం బెల్టు షాపులను తెరిచారు. ఈ బెల్టుషాపుల యజమానుల నుంచి కూడా నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. దీనిద్వారా కూడా వందలాది కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయి. ఇక ఈ బెల్టుషాపులు యజమానులైతే రూ.30 నుంచి రూ.40 ఎక్కువ ధరకు మద్యం బాటిల్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలన్నీ వైఎస్ జగన్ హయాంలో మద్యం విక్రయాల్లో దారుణం జరిగిందని అబద్దాలు చెబుతున్నారే తప్ప.. చంద్రబాబు హయాంలో జరుగుతున్నఅతి పెద్ద మద్యం స్కామ్ దారుణం గురించి ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదు. వైఎస్సార్ హాయంలో కొత్త డిస్టలరీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యం అమ్మకాలు చేశామని..చంద్రబాబు ఆయన్ను మోసే పత్రికలు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవానికి చంద్రబాబు హయాంలో గతంలో ఆయన అనుమతులు ఇచ్చిన 14 డిస్టలరీలే జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా చేశాయి. ఒక్క డిస్టలరీకి జగన్ హయాంలో అనుమతి ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలోనూ కనీసం 2-3 బెల్టుషాపులను చంద్రబాబు ప్రభుత్వం తెరిచింది.వైద్యనిపుణులు చెప్పిన మాట ప్రకారం ఏ రకమైన మద్యపానం అయినా ఆరోగ్యానికి హానికరమని చెపుతున్నారు. చంద్రబాబు మాత్రం నేను నాణ్యమైన మందు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.కానీ వాస్తవంగా ఇవాళ ఆయన పాలనలో రూ.99లకు అత్యంత నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారు. తద్వారా విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు నాణ్యమైన మద్యం అందిస్తానని చెబితే.. జగన్ మాత్రం మద్యపానం సామాజిక దురాచారం కాబట్టి దాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తాపత్రయపడ్డారు. అందుకే చంద్రబాబు హయాంలో ఉన్న 4800 పైగా ఉన్నమద్యం షాపులను 2,900 కే కుదించడంతో పాటు మద్యం ధరలు పెంచి ప్రజలను మద్యపానం నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. పెంచిన ధరల ద్వారా ఖజానా ఆదాయం పెరిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం- పారదర్శక లిక్కర్ పాలసీ.చంద్రబాబు హయాంలో ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విస్కీ, బ్రాందీ బాటిల్స్ గత ప్రభుత్వ హయాం కంటే 25 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీరు బాటిల్స్ 16 లక్షల కేసులు అత్యధికంగా అమ్ముడైనా.. ప్రభుత్వ ఆదాయం పడిపోగా.. చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన ప్రయివేటు మద్యం షాపుల యజమానుల ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయాలు వీరి జేబుల్లోకి పోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ఓట్లు వేయకపోయినా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పిన థీశాలిగా నిలబడ్డారు. చంద్రబాబు హాయంలో వారు చెప్పిన కొన్ని బ్రాండ్లకు అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చే సంస్కృతి ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవ్వరికీ అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వలేదు. వాస్తవానికి చంద్రబాబుకి కావాల్సిన 5 మంది డిస్టలరీ యజమానులు 2014-19 మధ్యలో ఏకంగా 69శాతం మద్యం విక్రయించారు. తిరిగి జగన్ హయాంలో వాళ్లకి అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వకపోవడం, మద్యం ధరలు పెంచడంతో ఆ 5 డిస్టలరీల యాజమాన్యం ఇండెంట్ వేయడం ఆపేశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 14 డిస్టలరీలే తిరిగి జగన్ హయాంలోనూ మద్యం అమ్మకాలు చేశారే తప్ప కొత్తవాటికి జగన్ అనుమతి ఇవ్వలేదన్నది పచ్చి నిజం. ఈ విషయాన్ని మరుగున పెట్టి... వైస్ జగన్ హయాంలో దోపిడి జరిగినట్టుగా ప్రచారం చేశారు.వాస్తవానికి జగన్ హాయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బ్యాటిల్ మద్యాన్ని వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలకు మందు సరఫరా అయ్యింది తప్పే.. చంద్రబాబు హాయంలో కాదు. జగన్ ప్రభుత్వంలో డిస్టలరీల నుంచి నేరుగా 30శాతం మద్యం ప్రభుత్వ సీళ్లు లేకుండా ప్రభుత్వ షాపుల్లోకి వెళ్లిందని మందు చంద్రబాబు ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాల ముఠా అతిపెద్ద ప్రచారం చేసింది. ఐదేళ్ల పాటు మా ప్రభుత్వంపై అంత దాడి చేసిన ఈ ప్రచార మాధ్యమాలు... ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీలు లేకుండా బయటకు వస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు. అదే ఇప్పుడు మీ ప్రభుత్వంలో 24 గంటలు మద్యం షాపులు తెరుస్తున్నారు... ప్రతి మద్యం షాపు వెనుక బార్ ఉందని... మీ షాపుల్లో ఇంత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మేం స్వయంగా వెళ్లి పరిశీలించి రాష్ట్రానికంతటికీ తెలియజెప్పాం. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఆ రోజు ఎందుకు మీరు నిరూపించలేకపోయారు. కారణం మీరు చెప్పింది పచ్చి అబద్దం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్, వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదన్నది పచ్చి నిజం. కానీ మేం ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో మీరు జగన్ మీద విషప్రచారం చేశారు.అడుగడుగునా ఎల్లో మీడియా విషప్రచారం.వైఎస్ జగన్ రైతుల కోసం వస్తే ఏకంగా దండుపాళ్యం బ్యాచ్ దాడిచేసిందన్నారు. ఇవాళ అదే ఎల్లో మీడియా మహిళల మీద ఇష్టం వచ్చినట్లు రాశారు. జగన్ మందు తాగి అది కూడా ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం పురుషులు 8810 అయితే మహిళలు 3833 మందికి నరాలు దెబ్బతిన్నాయి అని రాశారు. అంటే మహిళలు తాగుబోతులని చెప్పడం కాదా మీ అవసరాల కోసం, జగన్ మోహన్ రెడ్డిని హననం చేయడం కోసం మహిళల నరాలు పాడయ్యాయని రాశారు. 2,500 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టే.. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణాలకు, ఘోరాలకు అనారోగ్యం పాలైన వాళ్లే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పొంది తమ అనారోగ్యాన్ని నయం చేసుకున్నారన్నది ముమ్మూటికీ నిజం.జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా ఒక్క తాగుబోతు రోడ్లమీద కనబడలేదు... మీ పత్రికల్లో కూడా రాయలేదు. కానీ ఇవాళ నడిరోడ్లలో రాష్ట్రమంతా తాగుబోతులు విపరీతంగా దౌర్జన్యాలు, అల్లర్లు చేస్తూ చివరికి తిరుమలలోనే వేంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఎంత మందు కావాలి అని తాగుబోతు సవాల్ చేస్తే.. మరో నలుగురు తాగుబోతులు అక్కడే నృత్యం కూడా చేశారు. అంటే చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎంత పచ్చిగా తాగుడు ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.మద్యం కేసులో మీడియా ట్రయిల్స్..మద్యం పాలసీ దర్యాప్తు వ్యవహారంలో ఈ అవినీతి పత్రికలు వంటే ఎక్కువగా ఉంది. దాన్నే మరుసటి రోజు సిట్ అందుకుని కథ నడిపిస్తోంది. ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా.. ఒక్క రూపాయి పట్టుబడకపోయినా.. పట్టుబడి రూ.63 కోట్లు సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించింది కాకపోయినా .. దాన్ని మద్యం కుంభకోణానికి సిట్ జోడించ తప్పుడు కేసులు బనాయించింది. గతంలో చంద్రబాబు హాయంలో మద్యం కుంభకోణంలో ఆయన మీద కేసులు నమోదైతే.. గౌరవ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తో బాబు బయటపడ్డాడు. దీంతో తన మీద కేసులు పెట్టారన్న కక్షతో ఇవాళ వైఎస్సార్ సీపీ నేతలు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎక్సైజ్ సీల్ లేకుండా మా హయాంలో ఒక్క బ్యాటిల్ కూడా పట్టుబడలేదు.మా నాయకుడు వైఎస్ జగన్ ఎల్లప్పుడూ మనిషికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయం,మహిళా సాధికారత వంటి మహోన్నతంశాలే ప్రాధాన్యంగా పనిచేస్తే... చంద్రబాబుకి విస్కీ, బ్రాందీ అమృత తుల్యమైనవి. ప్రజలతో ఎంత మందు తాగిస్తే.. చంద్రబాబు ఆదాయం అంతలా పెరుగుతుంది కాబట్టే దేశంలోనే లేని విధంగా మద్యం కుంభకోణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. జగన్ హాయంలో అప్పటి మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి ఒక్క నయాపైసా కూడా ఆదాయం తగ్గలేదు. అదే చంద్రబాబు ఇంతపెత్త ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నా.. ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చడానికి ఉద్యమ రూపంలో పోరాటం చేస్తున్నా మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప.. ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గుతున్నాయి కారణమేమిటంటే.. చంద్రబాబు ఆయన పార్టీ పెద్దలు, టీడీపీకి చెందిన మద్యం షాపులు యజమానుల జేబుల్లోకి రూ.1000 కోట్ల పైగా ఆదాయం పోతుంది.మా హయాంలో మద్యం పాలసీ వల్ల రూ.50 వేల కోట్ల స్కాం అని, దాన్ని రూ.30 వేల కోట్లకు మార్చి.. చివరకు రూ.5 వేల కోట్లు అని చెపితే అది కాస్తా ఇప్పుడు రూ.2,500 కోట్లకు జారింది. అదే చంద్రబాబు హాయంలో వేలాది కోట్ల రూపాయాలు స్కామ్ జరుగుతున్నా దాని గురించి మాత్రం ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాలు ఎక్కడా మాట్లాడవు. ఎదుట వారి మీద ఆరోపణలు చేయడం కాదు.. మీ వాళ్లు చేస్తున్న తప్పులను ఎండగడితేనే పత్రికావిలువలు. కానీ మీరు ఇష్టమొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి పాలన మీద చేస్తున్న దాడి, మీ రాతల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలకు అర్ధం అయింది. మీరే ముందు ఫలానా స్కామ్ అని రాస్తారు. కొద్ది రోజుల తర్వాత ఫలానా వ్యక్తి మాస్టర్ మైండ్ అని రాస్తారు. ఆ తర్వాత మరో ఇద్దరు కలిసారు అని రాస్తారు. దానిపై కేసు నమోదు చేస్తారు. అందులో భాగంగానే మిధున్ రెడ్డి లాంటి సౌమ్యడును, తమ జీవిత కాలమంతా నిజాయితీ పరులై అధికారులుగా పేరు తెచ్చుకున్న కృష్ణమోహనరెడ్డి, ధనంజయ్ రెడ్డి లాంటి అధికారులను, జీవితకాలంలో లిక్కర్ వాసన చూడని చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వాళ్లను అరెస్టు చేస్తారు. ఇదంతా రాజకీయ పూరితమైన కుట్ర. ఇది రాజకీయ ట్రయిల్ తప్ప మరొక్కటి కానే కాదు.బాబు లిక్కర్ స్కామ్‌పై మరింత ఉద్యమం...చంద్రబాబునాయుడు ఇవాళ మద్యం పాలసీ ద్వారా చేస్తున్న దోపిడీ మీద వైఎస్సార్సీపీ మరింత ఉద్యమిస్తుంది. మీ పాలనలో జరుగుతున్నవంచనను ప్రజలకు తెలియజేస్తాం. మిమ్నలని మోసే పత్రికలు.. మద్యం ప్రియలకు వెసులుబాటు,ఊరట అని రాసే రాతలు వార్తలు ప్రపంచానికి అవసరం లేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు.. సూపర్ సిక్స్ సహా కూటమి పార్టీలు ఇచ్చిన 143 హామీల అమలు ఇవీ ప్రజలకు అవసరమైనవి. ఇవాళ మంత్రి అచ్చన్నాయుడు ఓ సభలో మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలో ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు. మరి ఆ రోజు మీ పార్టీ ఎందుకు ఈ హామీ ఇచ్చింది. కేవలం ఓట్లు దండుకోవడానికి అబద్దాలు చెప్పి... ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నాడు.మామిడి కొనుగోళ్లు- చేతకాని పాలన జూలై 21న కేంద్ర ప్రభుత్వ వ్యవసాయమంత్రిత్వ డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర వ్యవశాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీకి లేఖ రాస్తూ... 1.62 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కిలోకు రూ.3.85 కు మద్ధతు ధర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తుందని చెప్పారు. తోతాపురి కాగడా పెట్టి వెదకని రోజులలో ఈ లేఖ రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వస్తున్నాడంటే.. తోతాపురి మామిడి ఎక్కడుంది, అంతా కొనుగోలు చేశారని ఊదరగొట్టి రాసిన తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఛానెళ్లు ఇప్పుడు ఏం చెబుతాయి. ఈ స్ధాయిలో కొనుగోళు చేయాలంటే వచ్చే ఏడాది కావాలే తప్ప.. ఈ ఏడాది లేవు. ఇప్పుడు మద్ధతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం. గతంలో కేజీకి రూ.4 ఇస్తానన్న చంద్రబాబు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.3.85 కు చెరిసగం భరిస్తూ కొనుగోలు చేస్తామని రాశారు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామికి సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లేఖ రాస్తే... పదవీ విరమణ చేసిన ఎక్స్ అఫిషియో సెక్రటరీకి కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఏ స్థాయి గౌరవం ఉందో ఈ లేఖను బట్టి తెలుస్తోందని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన్ను రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం బలంగా ప్రతిఘటిస్తుంది కాబట్టి వారిని కావాలనే ఇరికించారని చెప్పారు. ఈ లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు ప్రభుత్వం అల్లిన ప్యాబ్రికేటెడ్ స్కామ్ అని ఇప్పడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నదే అసలైన అతిపెద్ద మద్యం స్కామ్ అని భూమన స్పష్టం చేశారు. -
మద్యం కేసు ఛార్జీషీట్లో అన్ని కట్టుకథలే: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు ఛార్జిషీట్లో అన్నీ కట్టు కథలేనని.. వేధింపులు, అబద్దపు వాంగ్మూలాలు తప్ప మరేమీ లేవని వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్సారసీపీ నేతలను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే కుట్రతోనే సిట్ పని చేస్తోందని.. అనేక కుంభకోణాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మనోహర్‌రెడ్డి అన్నారు.మద్యం కేసులో అక్రమ అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి కోర్టుకు తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎల్లో మీడియా వలన తన కుటుంబం పడుతున్న ఆవేదనను కోర్టు ముందు పెట్టారు. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ఎల్లోమీడియా రాసే వార్తలే ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో కనిపిస్తోంది. మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాసే రాతల వలన మానసిక ఆవేదన చెందుతున్నట్టు కోర్టుకు చెప్పారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘జైలు పక్కన ఉన్న బిల్డింగుల మీద నుండి కొందరు మా ఫోటోలు తీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోటోలు తీస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. అవినీతి మచ్చలేని ధనుంజయరెడ్డి సిట్ అధికారుల వేధింపులకు గురవుతున్నారు. ఛార్జిషీట్ టీడీపీ ఆఫీసులో రూపొందుతోంది. దానికి ఢిల్లీలో తుది మెరుగులు దిద్దుతున్నారు. లిక్కర్ స్కాం ఛార్జిషీట్లో మోకాలికి బోడిగుండుకు ముడి వేశారు...అబద్దపు వాంగ్మూలాలు, గాలి పోగేసిన వార్తలు, కాల్ డేటా తప్ప ఈ ఛార్జిషీట్లో మరేమీ లేదు. సిట్ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు చూపలేదు. డిస్ట్రలరీ యజమానులను బెదిరించి, అబద్దపు వాంగ్మూలం తీసుకున్నారు. బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని మీద వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. చెవిరెడ్డి గన్మెన్లు గిరి, మదన్‌రెడ్డిలను సిట్ విపరీతంగా హింసించింది. మిథున్‌రెడ్డిది బలమైన రాజకీయ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని వేధిస్తున్నారు...ఛార్జిషీట్లో ఉన్నదంతా కట్టుకథలే. వైఎస్సార్సీపీ నేతల మీటింగులను కూడా మద్యం స్కాం కోసమే అంటూ కట్టుకథ అల్లారు. టార్గెట్ చేసుకున్న వ్యక్తులను అరెస్టు చేయటమే లక్ష్యంగా మద్యం కేసును నడుపుతున్నారు. తమకు కావాల్సినట్టు చెబితే సాక్ష్యులుగా, లేకపోతే దోషిలుగా చిత్రీకరిస్తున్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అనేక కుంభకోణాల్లో నిందితుడు. అన్ని అక్రమాలజు ఆయనే బిగ్ బాస్. ఐఎంజీ కేసులో బిగ్ బాస్ చంద్రబాబు. రాజధాని భూములు, ఫైబర్ నెట్, రింగురోడ్డు అలైన్మెంట్.. ఇలా అనేక అవినీతి, అక్రమాల్లో బిగ్ బాస్ చంద్రబాబే’’ అని మనోహర్‌రెడ్డి దుయ్యబట్టారు. -
టీవీ-5 తప్పుడు ఛానల్: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఎల్లో మీడియాపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ-5 తప్పుడు ఛానల్ అని.. అందుకే వైఎస్సార్సీపీ నిషేధించిందన్నారు. టీడీపీ ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టని ఛానల్ అది అంటూ దుయ్యబట్టారు.ఇవాళ మా ఇంటికి టీవీ-5 రిపోర్టర్ వచ్చారు. ఇంటికి వచ్చాడు కదా అని గౌరవించి కూర్చోబెట్టాను. అక్రమ లిక్కర్ కేసు గురించి అడిగితే కొన్ని విషయాలు మాట్లాడాను. కాని, నేను చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆ ఛానల్ బ్రేకింగ్స్ వేసి నడిపించింది. నేను వెంటనే ఆ రిపోర్టర్‌కు ఫోన్ చేసి ఇది సరికాదని, అనని మాటలు అన్నట్టుగా చూపించడం భావ్యం కాదని వారిని హెచ్చరించాను. సరిచేయమని కోరాను...ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి మీద కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని నారాయణ స్వామి తెలిపారు. -
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి’’ అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడూ?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా?. అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా?’’ అంటూ ఆర్కే రోజా ఎక్స్ వేదికగా నిలదీశారు.`సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకిచ్చారు?: విడదల రజినిఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుపరిపాలనకు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టిస్తా, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు.ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు `తొలి అడుగు` అంటూ @JaiTDP వాళ్లు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. @ncbn ఏమో సంపద సృష్టిస్తా, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పారు. ఇప్పుడేమో @katchannaidu `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటూ… pic.twitter.com/hLaNmjTiqB— Rajini Vidadala (@VidadalaRajini) July 22, 2025అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరం: వరుదు కల్యాణి‘‘ఆడ బిడ్డల కష్టాలు తాను కళ్లారా చూశానని.. వారిని ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డనిధి పథకం తీసుకువచ్చామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతి సభలోనూ ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ప్రతి నెలా రూ.1,500లు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది ఇవ్వనే లేదు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు.ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ?: పుష్పశ్రీవాణిఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత సంక్షేమపథకాలు అమలు చేయలేమంటున్నారు. ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలంటూ వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడూ?. ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ?’’ అంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎక్స్ వేదికగా నిలదీశారు. -
వీడియో: 2 కోట్ల మందిని ఎంత పబ్లిక్‌గా మోసం చేశారో చూడండి
రెండు కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందిస్తే.. ‘‘ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ హాజరైన మహిళలు ఒక్కసారిగా కంగుతిన్నారు.అయితే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తే రోజా ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో..బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారంటీ..!. 2 కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారు అంటూ వీడియోలతో పోస్టులు చేశారామె. View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) `సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025 -
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు. అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోపు ఈ పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో.. జులై 19వ తేదీ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఆదివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగష్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఆయన ఉంటున్న స్నేహా బ్లాక్‌లో సరైన సదుపాయాలు లేవని మిథున్‌రెడ్డి లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం తాము సదుపాయాలు కేటాయించామని చెబుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత
నెల్లూరు: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( సోమవారం, జూలై 21) అరెస్టైన వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆయన్ని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ అధీనంలో ఉన్న సమయంలో శ్రీకాంత్‌రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉండగా శ్రీకాంత్‌రెడ్డిని ఆస్పత్రిలో చేర్చడంతో వైఎస్సార్సీపీలో ఆందోళన నెలకొంది. రుస్తుం మైన్స్ అక్రమ కేసులో బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై శ్రీకాంత్‌రెడ్డి భార్య ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం గం. 12.30 ని.లకు ఏ సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని, సాయంత్రం గం. 4.15 ని.లకు అరెస్ట్ చేశామని మెసేజ్ పెట్టారని విమర్శించారు. పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంది. -
ఆంధ్రప్రదేశ్ పోలీసుల రివర్స్ ట్రెండ్!
పోలీసు వ్యవస్థ ఎక్కడైనా నిజాలు రాబట్టేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తాము సృష్టించిన అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు తంటాలు పడుతోంది. కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పేరుతో బహిరంగంగానే ప్రైవేట్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు వారి అరాచకాలకు తలూపుతూండటం చూస్తూంటే.. ‘‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. అబద్ధాల రాజ్యం’’ అనే భావన బలపడుతోంది. ఏడాది కాలంగా విపక్ష వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై సాగుతున్న హింసాకాండ, దౌర్జన్యాలు, కేసుల వేధింపులు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. దేశం మొత్తం అత్యవసర పరిస్థితి విధించినా పోలీసులు ఈ స్థాయి అరాచకాలకు పాల్పడలేదు. అందుకే కాబోలు ఎమర్జెన్సీ తరువాత 1977లో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ఘోర పరాజయం చవిచూసినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా, ఎన్నికలపై మాత్రం వాటి ప్రభావం పడలేదు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెడుతున్న కేసుల తీరు చూస్తే పోలీసులు ఇంత ఘోరంగా కూడా పనిచేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. తాజాగా మద్యం స్కామ్ అంటూ ఒక కట్టుకథ సృష్టించి, దాని చుట్టూ రకరకాల పిట్టకథలు చేర్చి తమకు మద్దతిచ్చే మురికి మీడియాలో ప్రముఖంగా రాయిస్తూ వస్తున్నారు. ఆ మురికి మీడియా పత్రికలు, టీవీలు నిస్సిగ్గుగా అసత్యాలను జనంపై రుద్దే యత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆ మురికిని ఆ మీడియా తనకే అంటించుకుంటోంది. మద్యం స్కామ్‌లో ఆరు నెలలుగా ఈ మురికి మీడియా ఇచ్చిన వార్తలు పరిశీలిస్తే ఒకదానికి మరోదానికి పొంతన కనిపించదు. సిట్ అధికారులతో ఎవరిని అరెస్టు చేయాలని భావిస్తే వారిపై తోచిన పిచ్చి కథనాలు రాస్తారు. ఇదంతా ప్రభుత్వం, మురికి మీడియా కలిసి చేస్తున్న విష ప్రచారమే అని అర్థం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎవరు ఈ కేసులో అరెస్టు అయితే అతనే కీలక వ్యక్తి అని పబ్లిసిటీ ఇస్తారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతే సూత్రధారి ఈయనే అంటూ వార్తలు ఇచ్చారు. పోలీసుల స్పష్టమైన ఆధారాలు ఉంటే, ఆ వివరాలను బయటపెట్టవచ్చు కానీ అలాకాకుండా మద్యం ముడుపుల డబ్బుతో బంగారం కొనుగోలు చేశారని ఒకసారి రియల్ ఎస్టేట్‌లో వెచ్చించారని ఇంకోసారి, సినిమాలు తీశారనో, ఎలక్ట్రికల్ వెహికిల్ కర్మాగారం నెలకొల్పాలని భావించారనో, టాంజానియాలో ఇంకేదో పెట్టాలని ప్లాన్ చేశారని, దుబాయిలో ఇంకేదో చేశారని, ఓటర్లకు పంచడానికి ఈ డబ్బు వాడారని.. రకరకాల కథనాలు ఇచ్చారు. ఇంకోపక్క.. లిక్కర్ కేసులో ఎంత విచారిస్తున్నా సాక్ష్యాధారాలు దొరకలేదని, కోట్ల పేజీల డేటా ధ్వంసం చేశారని, అయినా దానిని తిరిగి తీస్తున్నారని.. ఏవేవో మతిమాలిన స్టోరీలన్నింటిని జనం మీద వదిలారు. చివరికి పోలీసులు ఏదో తప్పనిసరి తంతుగా చార్జీషీట్ వేశామని అనిపించుకున్నారు. నిందితులను అరెస్టు చేసి తొంభై రోజులు దాటితే ఆటోమాటిక్‌గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది కాబట్టి ,దానిని చెడగొట్టే లక్ష్యంతో ఇలా చేశారన్నది న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. తొలుత అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి మద్యం స్కామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ధ్వంసం చేయడానికి తీసుకువెళ్లారని, ఆఫీస్ వద్ద ఎవరో దీనిని చూశారని ఒక తప్పుడు కేసు పెట్టారు. తదుపరి ఈ స్కామ్ లో ఆయనను నిందితుడిని చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. కాని తదుపరి ఏమి జరిగిందో కాని, ఆయన నుంచి బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకుని కేసును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. వాసుదెవ రెడ్డితో పాటు సత్యప్రసాద్ అనే మరో ఉద్యోగిని కూడా ఇందుకు వాడుకున్నారు. వాసుదేవ రెడ్డి చివరికి వీరి వేధింపులు తట్టుకోలేక పోలీసులు అడిగిన వాంగ్మూలం ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌కు వెళ్లిపోయారట. ఇప్పుడు మళ్లీ ఆయనను పట్టుకువచ్చి అప్రూవర్‌గా మార్చాలని యత్నించిన వైనం బయటపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? అసలు ఏదైనా స్కామ్ జరిగితే దానికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలు మెటీరియల్ రూపంలో కనిపిస్తాయి. ఈ కేసులో అవేమీ ఉన్నట్లు అనిపించవు. ఉదాహరణకు చంద్రబాబుపై గత ప్రభుత్వంలో వచ్చిన స్కిల్ స్కామ్‌లో కొన్ని ఆధారాలు కనిపించాయి. కేబినెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబే నిధులు మంజూరు చేయడం, ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినా, సీఎం కోరుతున్నారు. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి సీఎస్ కోరడం వంటివి జరిగాయి. అలాగే స్కిల్ స్కామ్ నిధులు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయింది ఈడీ విచారణలో వెల్లడైంది. చివరికి డబ్బు పార్టీ బ్యాంక్ ఖాతాలోకి చేరిందని కూడా ఆ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఆధారసహితంగా తెలిపింది. దానిని ఇంతవరకు నేరుగా ఖండించలేకపోయారు. ఈడీనే తొలుత కొందరిని అరెస్టు చేసింది. తదుపరి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అలాగే 2019లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, సుమారు రూ.రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రకటించింది. కానీ ఆ తరువాతి కాలంలో చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ వల్ల ఆ కేసు ముందుకు సాగలేదని అంటారు. అలాగే చంద్రబాబు పై గత ప్రభుత్వం పెట్టిన మద్యం ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో తెలిపింది. జగన్ ప్రభుత్వ టైమ్‌లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే కేసులు పెడితే, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కక్షపూరితంగా ఏదో ఒక కేసు పెట్టి, తమకు విధేయులుగా పనిచేసే కొందరు అధికారుల ద్వారా అరెస్టుల పర్వం ఆరంభించిందన్నది వైఎస్సార్సీపీ విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలలో ఏర్పడిన తీవ్ర అసంతృప్తిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు. అందువల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు లొసుగుల మయంగా కనిపిస్తాయి. తాము చెప్పినట్లు వింటే సరి. లేకుంటే అరెస్టు తప్పదని భయపెట్టి కొందరిని లొంగదీసుకుంటున్నారన్న భావన ఉంది. ఉదాహరణకు విజయసాయి రెడ్డి వైఎస్సార్సీపీ సభ్యత్వాన్ని, తన రాజ్యసభ పదవి వదలుకునేలా చేయడం. ఆ తర్వాత మద్యం కేసుకు సంబంధించి ఆయన నుంచి ఒక ప్రకటన తీసుకోవడం, దాని ఆధారంగా కేసు డీల్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని కీలకమైన నిందితులలో ఒకరిగా తొలుత ప్రచారం చేసినా, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయలేదు. తనపై కేసు ఉండదని అనుకున్నా, పూర్తిగా కేసు పెట్టకపోతే, కథ సజావుగా సాగదని భావించారేమో తెలియదు కాని, ఆయనను కూడా నిందితుడిగానే చూపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంతో సంబంధం లేని వారిని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక అధికారులుగా ఉన్నవారిని కూడా వదలకుండా వారనుకున్న జాబితా ప్రకారం అరెస్టుల పర్వం సాగించారు. సిట్ అధికారులు రూ.3500 కోట్లు అని కాకి లెక్క తయారు చేశారు. దానికి అయినా ఆధారాలు ఉన్నాయా అంటే అవి లేవు. అసలు డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుంటే వారు కదా ఫిర్యాదు చేయవలసింది. వారెవరూ మాట్లాడకపోతే దారినపోయే దానయ్య ఎవరో కంప్లెయింట్ చేస్తే దానిని రెవెన్యూ సెక్రటరీ ముఖేష్ మీనా ఎంటర్టైన్ చేయడం ఏమిటి? ఆ వెంటనే బెవరేజన్ కార్పొరేషన్లో సమచారం సేకరించినట్లు, దర్యాప్తు చేయడానికి సిట్ వేసినట్లు.. ఇలా ఎంతో కథ నడిపించారు. చంద్రబాబు టైమ్‌లో ప్రైవేటు రంగంలో మద్యం వ్యాపారం జరిగితే జగన్ హయాంలో ప్రభుత్వమే షాపులను నిర్వహించింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో మద్యం వినియోగం తగ్గింది. అయినా స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును జగన్ మెడకు చుట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ అంటూ మురికి పత్రికలు విష ప్రచారం ఆరంభించాయి. 1999-2004 మధ్య ఒక స్కామ్ లో బిగ్‌బాస్‌కు మూడు కోట్లు చెల్లించామంటూ రాసిన లేఖ కలకలం రేపింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు 1985 ప్రాంతంలో చంద్రబాబుకు, ఒక సారాయి బాట్లింగ్ కంపెనీ యజమానికి ఉన్న సంబంధంపై ఆయన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన యత్నంలో దొరికిపోయిన సంగతి తెలిసిందే అని వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తుంటారు. ఆ చార్జీషీట్లో చంద్రబాబు ప్రస్తావన ముప్పై సార్లకు పైగా ఉంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. అప్పుడు చంద్రబాబు బిగ్ బాస్ అని మురికి మీడియా ఒప్పుకుంటుందా? అసలు ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చింది, ఓట్లకు ఎలా డబ్బు ఇవ్వవచ్చన్నది నేర్పింది చంద్రబాబు అని ఆయన ప్రత్యర్థులు ఏకగ్రీవంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌లో తేలేది ఏమీ ఉండదని, కాని కేసు పేరుతో వైసీపీ నేతలను, కొందరు రిటైర్డ్ అధికారులను వేధించి వికృతానందం పొందడం తప్ప అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థూలంగా చూస్తే ప్రజల దృష్టిలో ఇదంతా ఒక రాజకీయ కక్ష కేసుగా మాత్రమే నమోదు అవుతుంది. చంద్రబాబు, లోకేశ్‌లు ఇలాగే రెడ్ బుక్ పాలన కొనసాగిస్తే, భవిష్యత్తులో వారితోసహా టీడీపీ నేతలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వెన్నుపోటు, స్కాంలకు సూత్రధారి చంద్రబాబే
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నీంటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిగ్‌బాస్ అయితే.. వెన్నుపోటు పొడవడం, స్కాంలు చేయడంలో చంద్రబాబు బిగ్‌బాస్ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోవడం, ప్రచారం కోసం ప్రాణాలను తీయడం, ఓటుకు కోట్లు కేసులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడం వరకూ చంద్రబాబును మించిన బిగ్‌బాస్ ఎవరూ లేరన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామస్థాయి నేతల నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రాజకీయ కుట్రతోనే అరెస్టుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఆయనకు అండగా ఉంటారు. చంద్రబాబు తన అనుకూల పచ్చపత్రికల్లో లేనిది ఉన్నట్లుగా రాయించేస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం అవివేకం.అసలు ఈ కేసును సిట్ విచారణ చేస్తోందా లేక ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విచారణ చేస్తున్నాయా? పథకం ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో అవాస్తవాలను రాయించడం.. వాటి ఆధారంగా సిట్ అధికారులు కేసుల నమోదు, అరెస్టులు జరుగుతున్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబుతున్నాయంటే చంద్రబాబు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. జగన్‌పై పదేపదే తప్పుడు కథనాలు.. మద్యం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పదేపదే తప్పుడు కథనాలు రాస్తున్నాయి. మద్యం కుంభకోణంలో మొదట రూ.లక్ష కోట్లు అని, ఇప్పుడు రూ.3,500 కోట్లు అంటున్నారు. అలాగే, ఒకసారి మద్యం డబ్బుతో ఆఫ్రికాలో పెట్టుబడులు.. మరోమారు ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చుచేశారంటున్నారు. అసలు ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. వారిని ఎదుర్కోలేకే తప్పుడు కేసులు.. ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూ.వేలకోట్ల విలువైన 59 ఎకరాల భూమిని అత్యంత తక్కువ రేటుకే కట్టబెట్టడం అసలుసిసలైన కుంభకోణం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్‌రెడ్డిని ఎదుర్కోలేకే వారిపై తప్పుడు కేసులు నమోదుచేశారు. -
లేని మద్యం స్కామ్‌పై సిట్ కట్టుకథలు
చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు.. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌కు గతి లేదు! ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి..వైఎస్సార్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు..వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోంది..బెదిరింపులు, వేధింపులు, అక్రమ అరెస్టులు తప్ప ఈ దర్యాప్తు సాధించినది ఏమీ లేదన్నది సిట్ చార్జ్జషీటే వెల్లడిస్తోంది. ఇదిగో పెళ్లిలో వీరిద్దరూ కలిశారు కాబట్టి కుంభకోణానికి పాల్పడ్డారు.. అప్పుడెప్పుడో ఫోన్లో మాట్లాడుకున్నందున అవినీతికి పాల్పడ్డారు వారిద్దరు ఒకరికి ఒకరు కనిపించగానే నవ్వుతూ పలకరించుకున్నారు కాబట్టి ఏదో గూడుపుఠాణి చేసి ఉంటారు... ఇదీ సిట్ తన చార్జ్‌షీట్ సాక్షిగా వెల్లడించిన నివేదిక.. ప్రపంచంలో ఇంత హాస్యాస్పదంగా నివేదిక ఇచ్చిన ఘనత చంద్రబాబు సిట్కే దక్కుతుంది. కూటమి పెద్దల కుట్రకు తలాడించడం తప్ప ఏమీ చేయలేని సిట్... కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లు అంటూ వక్రభాష్యం చెబుతూ కనికట్టు చేసేందుకు ప్రయత్నించడం విస్మయపరుస్తోంది. రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ తాడూ, బొంగరం లేని కట్టు కథతో దుష్ప్రచారం చేయాలన్న కుతంత్రమే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ రాజ్ కేసిరెడ్డి ద్వారా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా డబ్బులు చేతులు మారాయని నమ్మించేందుకు సృష్టించిన కల్పిత కథ బెడిసికొట్టింది.⇒ సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బినామీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి అన్న వాస్తవం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో డిస్టిలరీల ముసుగులో మద్యం దోపిడీ చంద్రబాబు బాగోతేమనని సీఐడీ నిగ్గు తేల్చిన సంగతిని అందరికీ గుర్తు చేసింది. ఆ కేసులో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ప్రస్తుతం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతి కథలు చెబుతుండటం విస్మయపరుస్తోంది. బాబు కనికట్టు కథను ముందుగానే ఎల్లో మీడియా చిలక జోస్యం చెప్పడంతో రెడ్‌బుక్ కుతంత్రం బట్టబయలవుతోంది.కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ అంటూ బురిడీ కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టు చూపించేందుకు టీడీపీ వీర విధేయ సిట్ నానా తంటాలు పడుతోంది. నెలల తరబడి దర్యాప్తు పేరుతో వేధించినా, బెదిరించినా సాధించిందేమీలేదు. చివరికి చార్జ్జషీట్లో ఏం చెప్పిందంటే... 13 వేల ఫోన్ కాల్స్, వందలాది వాట్సాప్ చాటింగ్‌ల డేటా అంటూ వక్రీకరణలతో కనికట్టుకు యత్నించింది. అంటే దర్యాప్తు పేరుతో తాము సాధించిందీ ఏమీ లేదని ఒప్పుకొంది. ఓ ఇరవై ముప్పై మంది ఫోన్లతో పాటు వారి పీఏలు, సిబ్బంది ఫోన్ల నుంచి రెండేళ్ల సుదీర్ఘ కాలంలో 13 వేలకుపైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి అన్నది ఏదో అసహజ విషయం అన్నట్టు నమ్మించేందుకు సిట్ యత్నించింది. పోనీ ఆ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లో మద్యం కొనుగోళ్లు, సరఫరా, డబ్బుల చెల్లింపు వంటి వ్యవహారాల గురించి ఏమైనా ఉన్నట్టు సిట్ నిరూపించిందా? అంటే అదీ లేదు. కేవలం మీటింగులు, ప్రయాణాలు, సాధారణ విషయాలే ఉన్నట్టు సిట్ చార్జ్జషీట్లోనే పేర్కొంది. ఆ సాధారణ ఫోన్‌కాల్స్, చాటింగ్లకు వక్రభాష్యం చెబుతూ తమ రెడ్కుట్ర కథను ఆపాదిస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రజలను తప్పుదారి పట్టించడమే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం అన్నది స్పష్టమవుతోంది.బాబు కుతంత్రం... ఎల్లో మీడియా చిలక జోస్యంవైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించే రెడ్‌బుక్ కుట్ర కోసం చంద్రబాబు తన భజన ఎల్లో మీడియానే నమ్ముకున్నారు. అసలు సిట్ ఏమేం చేయాలో కూడా తన రాజగురువు రామోజీ కుటుంబానికి చెందిన ఈనాడు పత్రిక ద్వారా చెప్పిస్తున్నారు. ఎవరెవరి మీద అక్రమ కేసు పెట్టాలి... ఎవరెవర్ని విచారణకు పిలవాలి... వారిని ఏఏ ప్రశ్నలు అడగాలి... ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలి అన్నవి ముందుగా ఈనాడు పత్రికలో ప్రచురితమవుతాయి. సిట్ అదే పనిని తు.చ. తప్పకుండా చేస్తోంది. న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై సిట్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు. అది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఆ చార్జ్‌షీట్‌ను స్వీకరించినట్టు ప్రకటించిన తరువాతే ఎవరైనా న్యాయస్థానం ద్వారా అధికారికంగా కాపీని తీసుకోవచ్చు. కానీ, న్యాయస్థానం స్వీకరించినట్టు ప్రకటించకముందే చార్జ్‌జషీట్ ఎల్లో మీడియాకు చేరిపోతోంది. అంటే కోర్టు కంటే ఎల్లో మీడియాకే తమ ప్రాధాన్యం అని చంద్రబాబు ప్రభుత్వం, సిట్ బరితెగించి ప్రకటిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి.. లోకేశ్ బినామీ కేశినేని చిన్ని భాగస్వామి ఈ మొత్తం భేతాళ కుట్ర కథకు చంద్రబాబు ప్రధాన ఆధారంగా చేసుకున్నది రాజ్ కేసిరెడ్డినే. ఇంతకీ ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరో తెలుసా...? నారా లోకేశ్‌కు బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు వ్యాపార భాగస్వామి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి కేశినేని చిన్నితో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీహిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండడం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్ తరలించి పెట్టుబడులు పెట్టారు. ⇒ కేశినేని చిన్ని మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాక బినామీ కావడంతో పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. అలాంటి రాజ్ కేసిరెడ్డి..వైఎస్ జగన్ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని సిట్ నమోదు చేసిన అభియోగం పూర్తిగా అవాస్తవమే అన్నది నిగ్గు తేలుతోంది. దీనిపై అటు చంద్రబాబుగానీ ఇటు సిట్‌గానీ స్పందించకుండా మౌనం వహించడం అంటే ఆ వాస్తవాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టే.బాబు కుట్ర కథే... సిట్‌తో ఆడిస్తున్న తోలుబొమ్మలాటేచంద్రబాబు సిట్ ద్వారా రెడ్‌బుక్ తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. రెడ్‌బుక్ కుట్ర అమలుకు సిట్ ఆయుధంగా మారిందని తాజాగా సమర్పించిన చార్జ్‌జషీట్ స్పష్టం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపాలన్న టీడీపీ కూటమి కుట్రను సిట్ తు.చ. తప్పక అమలు చేస్తోంది. కొత్త కొత్త భేతాళ కథలను తమ రిమాండ్ రిపోర్టులు, చార్జ్‌జషీట్ ద్వారా ప్రచారంలోకి తెస్తోంది. ఎంతగా అంటే అసలు జరగని కుంభకోణంలో ఏకంగా రూ.3,500 కోట్లు చేతులు మారాయని నిస్సిగ్గుగా కట్టుకథను వినిపించడం సిట్కే సాధ్యపడింది. రాజ్ కేసిరెడ్డి, విజయ సాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ సంస్థ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఇలా ఒకరినుంచి ఒకరికి రూ.3,500 కోట్లు చేతులు మారాయని ఓ పకడ్బందీ కుట్రకథను అల్లడం బాబు మార్కు కుతంత్రానికి తార్కాణం. అసలు రూ.3,500 కోట్లు ఎక్కడ ఉన్నాయంటే సిట్ చెప్పదు... చెప్పలేదు. ఎందుకంటే రూ.3,500 కోట్ల అవినీతి అన్నది చంద్రబాబు సృష్టించిన కల్పిత కథ.⇒ ఓవైపు రూ.3,500 కోట్లు అక్రమంగా తరలించారని సిట్ అవాస్తవ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు ఆ నిధులతో నిందితులు దుబాయ్ తదితర విదేశాల్లో జల్సాలు చేశారని అంటోంది. అంటే రెడ్‌బుక్ కుట్రను అమలు చేసే ఆత్రుతలో సిట్ పరస్పర విరుద్ధంగా అవాస్తవ అభియోగాలు ప్రచారంలోకి తెస్తోందని వెల్లడైంది. ఇదంతా సిట్ ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటేనన్నది అసలు వాస్తవం. ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదన్నది సుస్పష్టం.డీబీటీ పథకాలు రూ.2.70 లక్షల కోట్లు ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. నేరుగా నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా ఐదేళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించింది. అంతటి పేదల సంక్షేమ ప్రభుత్వంపై ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోంది.డిస్టిలరీల ద్వారా భారీ దోపిడీ చంద్రబాబు బాగోతమేడిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కట్టుకథలు వినిపిస్తుండడం దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉంది. ఎందుకంటే డిస్టిలరీల ద్వారా మద్యం దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇక బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. తన సన్నిహితులు, బినామీలు అయ్యన్నపాత్రుడు, పుట్టా సుధాకర్‌యాదవ్, డీకే ఆదికేశవులు, ఎస్పీవైరెడ్డి కుటుంబాలకు చంద్రబాబు డిస్టిలరీల ఏర్పాటుకు లైసెన్సులు జారీ చేశారు. తన బినావీులకు చెందిన 4 డిస్టిలరీలకే ఏకంగా 60 శాతానికి పైగా మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారు. అందుకోసం ముందుగానే మద్యం నిల్వలను తెప్పించి సరఫరా చేశారు. అంటే మద్యం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించినట్టేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, అప్పటివరకు ఊరూపేరు లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు డిస్టిలరీల ముఠానే. రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం సిండికేట్‌కు టీడీపీ నేతలే నేతృత్వం వహించారు. అందుకే... డిస్టిలరీలు, బార్లకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించేలా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు మంత్రి మండలిని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. టీడీపీ సిండికేట్‌కు చెందిన 4,380 మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లతో పాటు ఊరూవాడా బడి దగ్గర గుడి దగ్గర కూడా ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక విక్రయాలతో ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా దోపిడీని 2023లోనే సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతో పాటు టీడీపీ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1),(డి), రెడ్‌విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారన్నది అసలు నిజం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగానే మద్యం విధానంనాడే తేల్చిచెప్పిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగానే మద్యం విధానాన్ని అమలు చేశారని కేంద్రానికి చెందిన ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆనాడే ప్రకటించింది. టీడీపీ నేతలు 2021లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై సీసీఐకి ఫిర్యాదు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ఫిర్యాదుపై విచారించిన సీసీఐ 2022 సెప్టెంబర్19న విస్పష్ట తీర్పు ప్రకటించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. నాడు సీసీఐ తీర్పునకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సిట్ అక్రమ కేసు నమోదు చేసి నిరాధార అభియోగాలు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే.సమర్థంగా దశలవారీ మద్య నియంత్రణవైఎస్ జగన్ ప్రభుత్వ ఘనతమద్యం అమ్మకాలు, లాభాలు తగ్గితే డిస్టిలరీలు ఎందుకు లంచాలు ఇస్తాయి బాబూ?డిస్టిలరీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ కమీషన్లు ఇచ్చాయని చంద్రబాబు తన పచ్చ పోలీసు ముఠా సిట్‌తో దుష్ప్రచారం చేయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అటు చంద్రబాబు ఇటు సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న వాస్తవం ఏమిటంటే... డిస్టిలరీలు సాధారణంగా కమీషన్లు ఎప్పుడు ఇస్తాయి...? తమ మద్యం అమ్మకాలు పెరిగితే... తద్వారా తమకు అధిక లాభాలు వస్తే కమీషన్లు ఇస్తాయి. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన సత్యం. మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయా...? పెరిగాయా అన్నది పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది కదా...? ఆ చిన్న లాజిక్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...? ఎందుకంటే 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్ దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ పాలనలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలను ప్రవేశపెట్టి, వాటి వేళలను కుదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్‌కు క్యూఆర్ కోడ్ పెట్టి పకడ్బందీగా పర్యవేక్షించారు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే వెల్లడిస్తున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. అయినా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిస్టిలరీలకు అడ్డదారిలో ప్రయోజనం కలిగించిందని సిట్ అవాస్తవ అభియోగాలు నమోదు చేసింది.అటు సిండికేటు.. ఇటు కల్తీ కేటుగాళ్లు...ఇక నిరుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతంలోని తన రికార్డులను తానే తిరగరాస్తూ మద్యం దోపిడీకి తెగబడుతోంది. టీడీపీ సిండికేట్‌కు 3,396 మద్యం దుకాణాలను కట్టబెట్టి 75 వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అత్యంత ప్రమాదకర స్పిరిట్‌ను అక్రమంగా దిగుమతి చేస్తూ కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లు కొన్నింటిని ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసులు పెట్టడమే దీనికి నిదర్శనం. అసలు సూత్రధారులైన టీడీపీ పెద్దల జోలికి వెళ్లకుండా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వ పెద్దలు కట్టడి చేసింది. అలాంటి బాబు డిస్టిలరీల పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది.రామోజీ, రాధాకృష్ణ కుటుంబాల ఆస్తులన్నీ బాబువేనా?చంద్రబాబు కుట్ర ఎంత హాస్యాస్పదంగా ఉందంటే... కంటికి కనిపించే వారి ఆస్తులన్నీ వైఎస్ జగన్‌వేనని సిట్‌తో కట్టుకథలు చెప్పిస్తున్నారు. మరి ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 తదతర ఎల్లో మీడియాతో చంద్రబాబు అక్రమ సంబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం కావడానికి 1995లో వైస్రాయ్ హోటల్ జరిగిన కుట్రలో ఆయన రాజ గురువు రామోజీరావు భాగస్వామి. ఆ తర్వాత వారి అవినీతి బంధం ఊడలు వేసింది. బాబు అండతోనే రామోజీ కుటుంబం ఫిలింసిటీ పేరుతో వేలాది ఎకరాలు గుప్పిట పట్టింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో నల్లధనం దందా సాగిస్తోంది. అంటే, రామోజీ కుటుంబం ఆస్తులన్నీ చంద్రబాబు ఆస్తులే అవుతాయి కదా..? అంతేకాదు రామోజీ దగ్గర బంధువులకు, రామోజీ కుటుంబంతో వియ్యమందిన వారికి పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం, బందరు పోర్టు కాంట్రాక్టులు కట్టబెట్టింది. అంటే, వారి ఆస్తులన్నీ చంద్రబాబువేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకొంటుందా...! ఇక టీడీపీ భజన బ్యాచ్ ఆంధ్రజ్యోతి– ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీవీఆర్ నాయుడులకు చెందిన ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయి కదా..? రాధాకృష్ణ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి చేతికి అంటిన గ్రీజును తన చాంబర్‌కు వచ్చి కడుక్కున్నారని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అసెంబ్లీలోనే చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అటువంటి రాధాకృష్ణ ఏకంగా పేపర్, టీవీ చానల్ పెట్టడంతో పాటు విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం వెనుక ఉన్నది చంద్రబాబే కదా...? ఆ వాస్తవాన్ని చంద్రబాబు అధికారికంగా అంగీకరించి వారందరి ఆస్తులను తన ఆస్తుల జాబితాలో ప్రకటించాలి. మరి అందుకు సిద్ధమా చంద్రబాబూ..!? -
‘తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు’
అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డి హెచ్చరించారు. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబుని, రాంప్రసాద్‌రెడ్డిని విమర్శించానని తనను తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తారా? అని నిలదీశారు. ‘మీరు ఏదన్నా చేస్తే బయపడి పారిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. నీ తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడి వాడు ఇక్కడ ఎవరూ లేరు. నా లైఫ్‌లో మీలాంటి వాళ్లను వందమందిని చూశా. నోటికొచ్చినట్లు తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు..మీరు వాడే పదాలు నాకూ వచ్చు. మా తండ్రి గురించి విమర్శలు చేశారు..నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ల తండ్రి గురించి నేను మాట్లాడను. చంద్రబాబూ...ఇలాంటి సంస్కారం మీరే నేర్పించారా..?, చంద్రబాబు ఇవ్వలేదు కాబట్టే సూపర్ సిక్స్ గురించి మాట్లాడాం.. ప్రతిపక్షం విమర్శలు చేస్తే మీకేమి ఇబ్బంది..?, మీ పదవులు, అధికారాలు ఎక్కువ రోజులు ఉండవు. వచ్చేసారి మేము అధికారంలోకి వస్తాం... అప్పుడు వడ్డీతో సహా లెక్క కట్టి ఇస్తాం’ అని రమేష్‌రెడ్డి హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావని, వైఎస్సార్సీపీ నూటికి నూరు శాతం గెలవడం ఖాయమని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ -
ఏయ్..ఏఎస్పీ.. నీతో తాడో పేడో తేల్చుకుంటా
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి పవర్ గ్రిడ్ సంస్థలో దౌర్జన్యం చేసిన జేసీ అనుచరులపై తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. దీంతో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏఎస్పీ రోహిత్ ఓ అవినీతి అధికారి. నీపై ఫిర్యాదు చేస్తా.. కేసు పెడతా. నేను, నా కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా పీఎస్ వద్ద ధర్నా చేస్తాం. వచ్చే బుధవారం రోజున నీతో తాడోపేడో తేల్చుకుంటా’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
‘అవినీతి, అక్రమాలకు బిగ్‌బాస్ చంద్రబాబే’
తాడేపల్లి : చంద్రబాబు రాజకీయ ప్రస్థానం నుంచి చూస్తే ఇప్పటివరకూ ఆయన చేయని అవినీతి లేదని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. ఏలేరు స్కాం నుండి నిన్నటి రాజధాని భూముల వరకూ అన్నింటిలోనూచంద్రబాబు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలకు బిగ్‌బాస్ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, జూలై 21) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. జగన్‌ని బిగ్‌బాస్ అని వార్తలు రాస్తున్న ఈనాడే సంస్థే అతిపెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడించన్నారు. వారి ఆర్థిక సామ్రాజ్యానికి భంగం కలుగుతోందని జగన్‌పై అడ్డగోలు వార్తలు రాస్తోందని పోతిన్ మహేష్ విమర్శించారు. ‘ 2014-19 కాలంలో మద్యం మాఫియా మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. 4,380 మద్యం షాపులు, మరో 4,380 పర్మిట్ రూములు, 45 వేల బెల్లుషాపులు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. విచ్చలవిడిగా బ్రాండ్లు తేవటం, కమీషన్లు లాక్కోవటం అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మద్యం మాఫియాని వ్యవస్థీకృతం చేసిందే చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించారు. ఇది తట్టుకోలేక జగన్‌పై ఇష్టానుసారం విష ప్రచారం చేశారు. మద్యం పాలసీ అంతా జగన్ హయాంలో పారదర్శకంగా జరిగింది. జగన్ నిర్ణయాలు చంద్రబాబు మాఫియాకి కంటకింపుగా మారాయి. అందుకే మద్యం పాలసీ మీద విష ప్రచారం చేశారు. లిక్కర్ లో విషం ఉందని కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారం తప్పని చెన్నై లోని ఎన్జీఎస్ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. అయినా సరే ఈ పచ్చమూక ఆగకుండా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలోనే రకరకాల బ్రాండ్లు వచ్చాయి. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్ ఇలా అనేక బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే. 14 డిస్టలరీలకు చంద్రబాబే అనుమతులు ఇచ్చారు. జగన్ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతులు ఇవ్వలేదు. కమీషన్ల తీసుకుని ఆర్డర్లు ఇచ్చింది కూడా చంద్రబాబు. దీనిపై ఎక్కడైనా చర్చించటానికి మేము సిద్దం. ఐదు డిస్టలరీలకు యాభై శాతం ఆర్డర్లు ఇవ్వటం వెనుక కచ్చితంగా స్కాం ఉంది. జగన్ హయాంలోని మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీసీఐలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీసిఐ విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా సరే చంద్రబాబు అండ్ కోకి బుద్ది రాలేదు. ప్రతిసారీ ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు. కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా విక్రయాలు జరపలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. నిజానికి ఆ సంస్థలు అడ్వాన్స్ గా నిధులు ఇస్తేనే సరఫరా చేస్తామన్నాయి. ప్రభుత్వం ఏ కంపెనీకైనా అలా అడ్వాన్సులు ఇస్తుందా?, చంద్రబాబు, ఆయన పార్టీ నేతల డిస్టలరీలకు ఆర్డర్లు రాలేదని విష ప్రచారం చేశారు. ప్రివలేజ్ ఫీజుని తన హయాంలో చంద్రబాబు ఎందుకు రద్దు చేశారు?, క్యాబినెట్ కి కూడా తెలియకుండా ఎందుకు చేశారు?, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి?, అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టి అక్రమాలు చేసింది చంద్రబాబు. ఏలేరు స్కాం నుండి రాజధానిలో భూముల కొనుగోలు వరకు అన్ని అక్రమాల్లోనూ చంద్రబాబే బిగ్ బాస్’ అని పోతిన మహేష్ ఆరోపించారు. -
మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే కారణంతో పోలీసులు నమోదు చేసిన ఆక్రమ కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్. రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం. ఫోన్లో పరామర్శించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల వివరాలు, ఆరెస్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. పోలీసుల అక్రమ కేసులు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిం చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉండి అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని రమేష్ కుమార్ రెడ్డికి భరోసా ఇచ్చారు.చిన్నమండెం: అక్రమ కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి సోమవారం విడుదలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి చిన్నమండెం పోలీస్ స్టేషన్ కు ఆయనను పోలీసులు తీసుకువచ్చారు. రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐఐ సుధాకర్ 41 నోటీసు ఇచ్చి ఆయనను సోమవారం విడుదల చేశారు. అనంతరం రమేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని
సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్ఆర్ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె.