
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకులో జనసేన రౌడీ మూకలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్‌లోని ప్రచార రథంపై దాడి చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా తణుకులో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళుతున్న కారుమూరి కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు.
ప్రచార రథంపై ఎక్కి.. జనసేన జెండాలు ఊపుతూ.. ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. ప్రచార రథం వెనుక.. కారులో కారుమూరి ఉన్నారు. జనసేన రౌడీ మూకలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.