ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నిక

Mar 16 2026 7:48 AM | Updated on Mar 16 2026 7:48 AM

ఉమ్మడి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నిక కరుణించు మంగమ్మ త ల్లీ పెద్దింట్లమ్మా.. కరుణించమ్మా విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి ఉద్యాన వర్సిటీలో ముగిసిన పోటీలు

ఏలూరు రూరల్‌: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించామని రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఎన్నికల అధికారి టి.అప్పారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అధ్యక్షుడిగా గోకరాజు ఆదిత్య, ఉపాధ్యక్షుడిగా ఎం వీరభద్రరావు, కార్యదర్శిగా వీవీఎస్‌ఎం శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా కె.సంజీవరావు, కోశాధికారిగా ఎస్‌వీ సుబ్బారావు, కౌన్సిలర్‌గా కె బాలజ్‌శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు.

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని ఆశీస్సులు మాపై ప్రసరించవమ్మా.. అంటూ భక్తులు పెద్దింట్లమ్మను ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానంగా పది పరీక్షలు ప్రారంభం కావడంతో పిల్లల తరపున తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద శ్రీక్యూశ్రీ లైన్లలో భక్తులు వేచివున్నారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున పత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, విరాళాలు, వాహనపూజల ద్వారా రూ.2,12,840 ఆదాయం వచ్చిందని తెలిపారు.

దెందులూరు: లారీ డ్రైవర్‌కు కరెంట్‌ షాక్‌ కొట్టి మృతి చెందిన వైనమిది. ఈ సంఘటనకు సంబంధించి దెందులూరు ఎస్సై ఆర్‌.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు గ్రామానికి చెందిన ఎం.అన్నవరం లారీ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. గాలాయిగూడెం మొక్కజొన్న ఫ్యాక్టరీకి లోడు లారీ తీసుకొచ్చాడు. శనివారం రాత్రి లారీ పైకెక్కి మోకు సర్దుతుండగా పైన ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి కరెంట్‌ షాక్‌ తగిలింది. తోటి లారీ డ్రైవర్‌ చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తీసుకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్‌ అన్నవరం మృతి చెందాడు. మృతుడికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తాడేపల్లిగూడెం: మూడు రోజులపాటు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీలో జరిగిన 12వ అంతర్‌ కళాశాల పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల త్రోబాల్‌లో అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెం జట్లు విజేతలుగా నిలిచాయి. బాస్కెట్‌బాల్‌ పురుషుల విభాగంలో వీఆర్‌ గూడెం, అనంతరాజు పేట రన్నరప్‌గా నిలిచింది. మహిళల విభాగంలో అనంతరాజుపేట, మార్కాపురం జట్టు జయకేతనం ఎగురవేశాయి. వాలీబాల్‌ పురుషుల విభాగంలో పులివెందుల, అనంతరాజు పేట జట్లు విజయం సాధించాయి. మహిళల విభాగంలో అనంతరాజు పేట, పార్వతీపురం జట్లు విజేతలుగా నిలిచాయి. రిలే పురుషుల విభాగంలో అనంతపురం. మార్కాపురం జట్లు ప్రతిభ కనపర్చాయి. మహిళల విభాగంలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల జట్టు గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement