breaking news
-
CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్‌ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్‌విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్‌కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్‌తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్‌ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మిథున్‌రెడ్డి అరెస్ట్.. వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకే లిక్కర్ కేసు
వైయస్ఆర్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో ఢిల్లీలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. సాక్షి, ఢిల్లీ: ఏపీలో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతోందని, లేని లిక్కర్ కేసును బనాయించి వైయస్ఆర్సీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభ నేపథ్యంలో సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఏపీలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల ఉన్నప్పటికీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణం. మద్యం విధానం పై చర్చకు మేము సిద్ధం. అలాగే.. 2014-2024 వరకు మద్యం విధానంపై కూడా చర్చించాలి. టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్స్ ఇచ్చి ఊరురా బెల్టు షాపులు పెట్టించారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారింది. కానీ..మా ప్రభుత్వ హాయంలో పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాల నిర్వహించి అమ్మకాలను తగ్గించింది. వైయస్సార్సీపీని దెబ్బతీసి ఉద్దేశంతో లేని లిక్కర్ కేసును బనాయించారు అని అన్నారాయన. ఏపీలో వైఎస్ జగన్‌కు తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటులో లేవనెత్తుతా అని తెలిపారు. ఇక.. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్‌కు కేంద్రం గట్టి బుద్ధి చెప్పిందన్న వైవీ సుబ్బారెడ్డి.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. -
టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్ చేశారుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్ -
అంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు ముద్రగడ
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్‌లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తొలుత ఎయిర్ ఆంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా.. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అదే సమయంలో ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు జగన్ చెప్పారు. అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడి నివాసానికి ఆంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్‌లోనే హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులుతమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్‌కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లు చిత్రీకరిస్తూ.. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో.. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ఆయనతో పాటు ఆయన సన్నిహితులపై దర్యాప్తు నిలిపేయించుకున్న చంద్రబాబు.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జత చేస్తూ ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం ‘వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ధపు వాంగ్మూలాలతో కేసులో అక్రమంగా ఇరికించారు. టీడీపీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. జరగని మద్యం స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు. ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్–డిగ్రీ హింస, లంచాలు, ప్రలోభాలాల ద్వారా సేకరించిన తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించిందే. 2014–19 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమాలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్‌పై ఉన్నాడనే వాస్తవం.. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడనేదానికి తిరుగులేని సాక్ష్యం. 2014–19 మధ్య కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి.. ఇప్పుడు 2024–29 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం. ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం వైఎస్సార్సీపీని అణచి వేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నిచడం, పోరాడటం ద్వారా మేము ఎదిగాము. అన్యాయాలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, వైఎస్సార్సీపీ ప్రజలతో నిలుస్తుందని, వారి గొంతుకగా, కవచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మద్యం అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను మీ పరిశీలన కోసం జత చేస్తున్నాను.’ గత ప్రభుత్వ విజయాలు అపహాస్యం మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే.. ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ రద్దు చేసిన మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తోంది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి. వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసి వేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం నియంత్రణను బలహీన పరుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో మళ్లీ అవినీతి, మాఫియా ప్రవేశించాయి. ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుచంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర సంస్థలను, ఎల్లో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌పై ఉన్న కేసుల్లో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మధ్యం కుంభకోణం కూడా ఉంది. అప్పట్లో మద్యం సిండికేటు మాఫియాను పెంచి పోషించి అవినీతిని వ్యవస్థీకరించారు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబునాయుడు తనపై, తన సన్నిహితులపై ఉన్న ఆ తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపి వేశారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ప్రేరేపితమైన మద్యం కేసును రూపొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు. ప్రజల హృదయాల్లో పాతుకుపోతున్నారని..టీడీపీ నిజమైన ఎజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి చట్టపరమైన ప్రక్రియను లాగడానికి వారు సిట్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు. కానీ.. విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజం బయట పడుతుంది. ఇది పూర్తిగా చట్టపరమైన అర్హత లేని నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నది వారు దోషులు కాబట్టి కాదు.. ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోతున్నారు కాబట్టి. ఇది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది బలమైన ప్రతిపక్షాన్ని అస్థిర పరచడానికి ఉద్దేశించి సాగిస్తున్న రాజకీయ వేట. -
బాబు కుతంత్రం..‘అప్రూవర్’ తంత్రం
భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్(ఏ3)లను బెదిరించి, అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొందరు సిట్ అధికారులతో కలసి న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అప్రూవర్ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధించారు. సిట్ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్ యత్నిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్ లొకేషన్! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నిందితుల సెల్ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్ టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకున్నామని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్ టవర్ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరంలో వేలాది సెల్ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్ అధికారులు రిమాండ్ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్ అధికారులు సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్ ఇన్వాయిస్లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్ ఇన్వాయిస్‌లనీ సిట్ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది. -
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ఆదివారం ( జులై20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరపున పోరాడే వారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు . వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలం ద్వారా తప్పుడు కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వపు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్ని అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2025 లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే. చంద్రబాబు తన హయాంలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారు. చంద్రబాబు తన 2014-19 కాలంలో మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారు. దానికి సంబంధించి ఆధారాలతో సహా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయించేందుకు, ఇప్పటి పాలసీని సమర్ధించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూనే మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారు. ప్రస్తుతం తన గత హయాంలోని అవినీతి పద్ధతులను పునః ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు,పర్మిట్ రూమ్‌లు వెలిశాయి.మా హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేయించాం. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఆ చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. మద్యం మాఫియా రంగంలోకి దిగిందివైన్ షాపులకు లైసెన్స్ మంజూరు విషయంలో మాఫియాదే పైచేయి అయింది. మా హయాంలో పారదర్శకంగా జరిగిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్షసాధింపులకు దిగుతున్నారు.చంద్రబాబు మద్యం స్కాంతో సహా అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన మీద ఉన్న కేసుల దర్యాప్తును నిలిపివేశారు. ఆ విషయాల నుండి దృష్టి మళ్ళించడానికి మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు.వైఎస్సార్సీపీని ఎవరూ ఏమీ చేయలేరు చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది.అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి, జైలుపాలు చేయటానికే సిట్‌ని ఏర్పాటు చేశారు.కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలోనే తేలుతుంది. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు చట్టం ముందు ఇది ఎంతమాత్రం నిలబడదు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్సార్సీపీని ఎవరూ ఏమీ చేయలేరు.ప్రజా గొంతుకగా వైఎస్సార్సీపీప్రజల గుండెల్లో వైఎస్సార్సీపీ బలంగా పాతుకుపోయింది. ప్రతిపక్షంగా వున్న పార్టీని అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలు నిలబడవు. వైఎస్సార్సీపీని అణచివేయాలనుకున్న ప్రతిసారీ మేము ధైర్యంగా నిలబడ్డాం. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుకగా నిలబడతాం. ఈ అన్యాయాన్ని ఎదుర్కుంటూ వైఎస్సార్సీపీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది’ అని స్పష్టం చేశారు. -
‘అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు’
గుంటూరు: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, జూలై 20) గుంటూరు నుంచి మాట్లాడిన అంబటి.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. ‘తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయం. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచి వేయలేరు. రాష్ట్ర అభివృద్ధి, తమకు సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారు. చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ ఆ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వలన వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధంఅసలు మద్యం కేసులో మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?, ఎల్లోమీడియా రాసిందే పోలీసులు ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో రాస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే స్కాంలో నుండి పుట్టాడు. డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటఙ, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ మలినాలను తొలగిస్తానంటూ కబుర్లు చెప్తున్నారు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు’ అని అంబటి స్పష్టం చేశారు. -
‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు, వినాయకపురం ఎస్టీ కాలనీలో రాజయ్య ఆటోకు ఇటీవల దుండగులు నిప్పటించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను రోజా కోరారు. జీవనోపాధి కోసం నడుపుకుంటున్న ఆటోను రాత్రికి రాత్రే దుండగులు నిప్పుపెట్టడం అమానుషమన్నారు.ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు. ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజ్యాంగ్యాన్ని కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సహించేది లేదు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన టి.రాజయ్య కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారు.చంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు.ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది.ఏడాదికి 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు.40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు.4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు.తన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారు. సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు.ఈ మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా లేదు.ఆధారాలు ఇంకా సంపాదిస్తాం అంటారు.ప్రయివేటు మద్యం షాపులు ప్రభుత్వంలోకి మారిస్తే స్కామ్ ఎలా అవుతుంది..?మధ్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఆధీనంలోకి షాపులు తెచ్చాం. చంద్రబాబు పాలన కంటే మా హయాంలో మద్యం వినియోగం తగ్గింది.రూ.50 వేల కోట్లు అని మొదట అన్నారు. ఇప్పుడు రూ.3 వేల కోట్లు అంటున్నారు.రూ3 వేల కోట్లను 30 రకాలుగా చెప్తున్నారు.డబ్బు ఎక్కడుంది అంటే..మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.టివి సీరియల్లా సాగదీస్తున్నారు.ఏమి ఆధారాలు లేక...ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా చేశారని అంటున్నారు.ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి ఈవిధంగా చేస్తున్నాడు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడు. ప్రభుత్వం నిధులు దారిమళ్లించిన ఆధారాలు ఉన్నాయి.కేంద్ర ఏజెన్సీ విచారణలో స్కిల్ స్కామ్ వెలికి తీసింది.ఇక్కడ లిక్కర్ కేసులో ఒక్క ఆధారం లేదుఅన్యాయంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది.ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటాం.పోరాడుతాం. కేసులో ఏమి లేదు..పునాది లేదని..ఈరోజు తేలిపోయిందని’ ధ్వజమెత్తారు. -
సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్‌పై చెలరేగిపోయారు. సమయం సందర్భం లేకుండా గంగవెర్రులెత్తిపోయారు ..ఏయ్ జగన్ అంటూ ఊగిపోయారు.అసలు ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్లు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అంటూ నిలదీశారు... తన సినిమాలకు సంబంధించి అవసరమైతే ప్రజలకి ఫ్రీ షో చూపిస్తానని టికెట్ల ధరల కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లేది లేదని డైలాగులు కొట్టారు.మొత్తానికి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక హరిహర వీరమల్లు సినిమా రిలీజుకు వచ్చింది. దాదాపు ఐదేళ్లు క్రితం షూటింగ్ మొదలైన ఈ చిత్రం అపుడపుడూ షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి ఆమధ్య నిర్మాణం పూర్తి చేసుకుంది. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా పవన్ ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.. మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్‌లోని ఆర్థిక అవకాశవాది బయటకు వచ్చాడు.అవసరం అయితే తాను ఫ్రీగా సినిమా చూపిస్తాను అంటూ గతంలో కొట్టిన డైలాగులు కొండెక్కించిన పవన్ ఇప్పుడు వ్యాపారి రూపంలోకి వచ్చారు. నిర్మాత ఏఎం రత్నం నుంచి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ ఆయనకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ల ధరలు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఈమేరకు టికెట్ ధరలు పెరిగాయి.ఇందులో భాగంగాజూలై 23న వేసే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్,మల్టీఫ్లెక్స్ ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్‌లో రూ.100, అప్పర్ క్లాస్‌లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు. అవతలివాళ్లకు వచ్చేసరికి బోలెడు రూల్స్ మాట్లాడే పవన్ ఇప్పుడు తనవరకు వచ్చేసరికి ఆర్థికలాభం మాత్రమే చూసుకుంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాటలకు. చేతలకు మధ్య చాలా తేడా ఉంటుందని మరోమారు స్పష్టమైంది* సిమ్మాదిరప్పన్న -
జగన్‌కు సన్నిహితుడనే నా తనయుడ్ని అరెస్ట్ చేశారు
చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని.. ఈ ఫలితం చంద్రబాబు రాబోయే రోజుల్లో తప్పక అనుభవిస్తారని అన్నారాయన. సాక్షి, తిరుపతి: చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తారా స్థాయికి చేరాయని, ఈ క్రమంలోనే తన తనయుడు మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతూ వస్తున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తోందో.. చంద్రబాబు, లోకేష్, పవన్ ఏవిధంగా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. మూడుసార్లు ఎంపీగా గెలిచిన నా తనయుడు మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయించింది. గతంలోనూ మిథున్‌రెడ్డిని ఇబ్బంది పెట్టింది చూశాం. గతంలో ఎయిర్ పోర్ట్ మేనేజర్‌ను కొట్టాడని కేసు పెట్టారు. అది తప్పుడు కేసుగా తేలింది. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని మరీ వేధిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ అన్నారు. ఆ కేసులో ఏమీ లేదని తేలిపోయింది. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారని వేధించారు. ఇప్పుడేమో ఏకంగా మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఈ కేసు కూడా తప్పుడు కేసుగానే తేలుతుంది. అసలు లిక్కర్ కేసులో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం తేల్చింది?. ఒక ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?. కేవలం జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. మిథున్‌రెడ్డిపై పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే. మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు. తప్పు చేయలేదు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఈ పర్యవసానం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం మాత్రమే కాదు.. చంద్రబాబు రాజకీయంలో ఒక మచ్చగా మిగులుతుంది. రాబోయే రోజుల్లో అపవాదులు, అపకీర్తి, దుర్మార్గాలతో ప్రజలకు చంద్రబాబు ఎలా జవాబు చెబుతారో చూడాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.వైఎస్సార్సీపీని ఇప్పటికిప్పుడు గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన సందర్భంగా ముగ్గురు ఎస్పీలతో అణచి వేయాలని చూశారు. వేలాది మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోజు తరలి వచ్చారు. చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన 143 హామీలు, ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహిళల్ని, నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు ఈ విధంగా తప్పుడు కేసులు తో ప్రతి పక్షపార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రజలు దృష్టి మరల్చుతున్నారు. పార్టీకి పట్టుకొమ్మలు గా ఉన్న నాయకులను అరెస్ట్ చేయిస్తూ.. దుర్మాపు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారు, ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు చంద్రబాబు ఈ విషయం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’’ అని రామచంద్రారెడ్డి హితవు పలికారు. -
ఏపీలో అధర్మ పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలు గురుమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేశారు.ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ లేవనెత్తనుంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం ఏపీఎండీసీ తాకట్టు పెట్టడం, పోలవరం ఆలస్యం, రైతుల సమస్యలు.. ధాన్యం సేకరించకపోవడం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, అమరావతిలో అవినీతి, సూపర్ సిక్స్ ఫెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, ఏపీలో పెరుగుతున్న నిరుద్యోగం, నత్త నడకన ఇళ్ల నిర్మాణాలు, తిరుమలలో భద్రత లోపాలు తదితర అంశాలను వైఎస్సార్సీపీ ప్రస్తావించనుంది.అఖిలపక్ష సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అధర్మ పాలన సాగుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి హింసిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉనికి లేకుండా చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాం’’ అని బోస్ తెలిపారు.మామిడి, మిర్చి, పొగాకు రైతులకు కనీసం మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 12 రూపాయలు మద్దతు ప్రకటించి నిస్సిగ్గుగా కేవలం ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తాం. రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్కో రైతుకు 20 వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కౌలు రైతులకు సహాయం చేయడం లేదు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ ఇప్పుడు విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది’’ అని బోస్ మండిపడ్డారు. -
లేని లిక్కర్ స్కాం ఉన్నట్టుగా.. వాళ్లే టార్గెట్‌గా సిట్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా.. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా సిట్ అధికారులు పనిచేస్తున్నారు.నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు. రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. రూ.35 వేల కోట్లు అంటూ పవన్ కల్యాణ్ బొంకారు. ప్రభుత్వ పెద్దలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ పేర్కొంటుంది. ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్సీపీ మండిపడింది. కోర్టుల్లోనే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ అంటోంది. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. -
ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపు
మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. లేటెస్ట్ అప్డేట్స్ విజయవాడ: ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్ విధింపుఆగస్టు 1వ తేదీ వరకూ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసు: సజ్జల తప్పుడు కేసు సృష్టించి పరాకాష్టకు తీసుకెళ్తున్నారుచంద్రబాబు సృష్టించిన కట్టు కథ, తప్పుడు కేసుఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారులిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగిందిఏడాదికి రూ. 1300 కోట్లు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు40 వేలకు పైగా బెల్టు షాపులు పెట్టారు4,5 డిస్టీలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారుతన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్ మీద బయట ఉన్నాడు ఈసారి మరింత బరి తెగించి స్కామ్ చేస్తున్నారుమిథున్ రెడ్డి రిమాండ్ పై ముగిసిన వాదనలు మిథున్ రెడ్డి ECG హెల్త్ రిపోర్ట్స్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులువాటిని కోర్టుకు సమర్పించలేదని కోర్టుకు తెలిపిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులువై క్యాటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కనుక సెంట్రల్ జైలుకి అనుమతివ్వాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురాజమండ్రి లేదంటే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించాలని కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులురిమాండ్ పై మరికొద్ది సేపట్లో ఆర్డర్స్ ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తిజైల్లో కూడా వై క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరిన మిథున్ రెడ్డి న్యాయవాదులుస్పెషల్ బ్యారక్ కోరిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుభద్రత ,హెల్త్,ములాఖత్ లకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు చేసిన మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులుకొనసాగుతున్న వాదనలులిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలుమిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించనున్న ఇ.కోటేశ్వరరావుకోర్టుకు వచ్చిన వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,లేళ్ల అప్పిరెడ్డి,భరత్కోర్టు బయట పోలీసుల ఓవరాక్షన్.. న్యాయాధికారికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులుబార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకున్నారని ఫిర్యాదులిక్కర్ కేసులో ఏం తేల్చారు?: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందిఈ క్రమంలోనే నా తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందిఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసుకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారుగతంలోనూ మిథున్‌రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టారుమిథున్రెడ్డిపై పెట్టింది తప్పుడు కేసేలిక్కర్ కేసులో ఇప్పటిదాకా ఏం తేల్చారుమా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారుతప్పు చేయలేదు కాబట్టి మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడురాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాతిరస్కారం తప్పదువిజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్ అధికారులుకోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులుకోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులుకోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులుపోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలులిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్రెడ్డికాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్అక్రమ కేసులకు జడిసేది లేదురాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారుఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమంలిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదులిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదువైఎస్సార్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు:::ఎమ్మెల్యే విరుపాక్షివిజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలుకోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులుఅడ్వకేట్లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులుపోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులుగేట్లు సైతం మూసేసిన పోలీసులుప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపువిజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపుకాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలుఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ శ్రేణుల అడ్డగింతవైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంలిక్కర్ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్‌విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డిప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తుప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులులేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీ కీలక నాయకుల అరెస్టులుఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టుతాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులునిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంఅయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదురూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబురూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలుటీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలుమిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్సీపీజీజీహెచ్కు తరలించే ముందు సిట్ కార్యాలయం వద్ద మిథున్రెడ్డివాట్ నెక్స్ట్‌మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారంఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశంమిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్!రిమాండ్ విధించే అవకాశం?అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్ బరి తెగింపుఆధారాల్లేని లిక్కర్ స్కాంలో.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్ చేసిన సిట్‌రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబునేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశంమిథున్‌రెడ్డిని రిమాండ్ కోరనున్న సిట్‌మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమద్యం స్కామ్.. ఓ కట్టుకథరెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానుమద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథవైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారువైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.:::అరకు ఎంపీ తనుజారాణిఅబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలుఅవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రంలేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగంఅబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్ దాఖలుపెరిగిన నిందితులుమొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి మాఫియా డాన్ చంద్రబాబే2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబురూ.25 వేల కోట్లకు మించి అక్రమాలుసీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబుఅప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండిమిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమం: వైఎస్సార్‌సీపీఇది స్కామ్ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీలేని మద్యం కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఏమాత్రం సంబంధం లేని వారందరినీ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేసిన తీరుని వైయస్ఆర్… pic.twitter.com/CiIR4DyA1U— YSR Congress Party (@YSRCParty) July 19, 2025ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…— Roja Selvamani (@RojaSelvamaniRK) July 19, 2025రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదు, అరాచకపాలన. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదు. మా ఎంపీ @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. @ncbn గారూ అధికారం శాశ్వతం…— Rajini Vidadala (@VidadalaRajini) July 19, 2025మిథున్‌రెడ్డి అన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది #westandwithMidhunReddy pic.twitter.com/Pwr0hKRVnQ— Nandigam Suresh Babu - YSRCP (@NandigamSuresh7) July 19, 2025#SadistChandraBabu@ncbn లో రాజకీయ కక్ష తారా స్థాయికి చేరింది. అందులో భాగంగానే అసలు లేని అవినీతిని ఉందన్నట్లుగా ప్రజలకు భ్రమ కల్పించడమే బాబు లక్ష్యం. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.-మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే pic.twitter.com/2ENNFeGgqj— YSR Congress Party (@YSRCParty) July 19, 2025#SadistChandraBabuప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ pic.twitter.com/Lp44S1Jp67— YSR Congress Party (@YSRCParty) July 19, 2025లిక్కర్ స్కామ్ అంటారు… కానీ:ఆధారం లేదుడబ్బు సీజ్ కాలేదుమద్యం లభించలేదుచార్ట్ షీట్ లో పేరు లేదు ..కానీ అరెస్ట్ ఉంది ఎందుకంటే టార్గెట్ జగన్ అన్న @ysjagan ఈ కుట్రలో మిథున్ అన్నను @MithunReddyYSRC కూడా లాగారు.ఇది స్కామ్ కాదు… ఇది @ncbn చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా.… pic.twitter.com/LJu64TEgqe— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 19, 2025#SadistChandraBabuవైఎస్సార్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక @ncbn… అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయ అరాచకమే.ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను.-అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి గారు pic.twitter.com/cG0dQB2SuY— YSR Congress Party (@YSRCParty) July 19, 2025మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపుపెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంరాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లులేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి అరెస్ట్‌లు చేస్తున్నారు ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులుఇది… pic.twitter.com/3YO54cIp9I— Rachamallu Siva Prasad Reddy (@rachamallu_siva) July 19, 2025 -
కోర్టు కంటే ముందే ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్!
రెడ్‌బుక్ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం, సిట్ అధికారులు ఏకంగా న్యాయ వ్యవస్థకే అగౌరవం కలిగిస్తుండడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానం కంటే ముందుగా అక్రమ కేసులో చార్జ్‌షీట్ వివరాలను ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చానళ్లకు సిట్ అధికారులు తెలియజేయడమే దీనికి నిదర్శనం. అక్రమ కేసులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి సమర్పించారు. శనివారం(జులై 20) ఉదయం మార్కెట్లోకి వచ్చిన ఈనాడు పత్రికలో ఆ చార్జ్‌షీట్ వివరాలు ప్రచురితం కావడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి. ఈ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు కంటే ముందుగానే ఈనాడు, ఇతర ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలను వెల్లడించింది. ఎంత పక్కాగా అంటే చార్జ్‌షీట్ ఎన్నిపేజీలు ఉన్నాయి...? అందులోని వివరాలన్నీ యథాతథంగా ఎల్లో మీడియా ముందే ప్రచురించింది. టీడీపీ అనుకూల ఎల్లో మీడియా టీవీ చానళ్లు చార్జ్‌షీట్‌లోని వివరాలను శనివారం ఉదయం నుంచే ప్రసారం చేశాయి. అంటే.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఎల్లో మీడియాకే పెద్దపీట వేస్తోందనన్నది మరోసారి స్పష్టమైంది. -
మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లు.. 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు. ‘ప్రివిలేజ్’గా ఖజానాకు గండి కొట్టారుమద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.తమవారికి దోచిపెట్టారు2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది. -
మహిళల్ని అసభ్యంగా దూషించటం టీడీపీకి ఆనవాయితీ: వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించటం టీడీపీకి ఆనవాయితీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘మాజీమంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీ లో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక, నా సోదరి, రెండుసార్లు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ లో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండాపోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నోరు మూయించడానికే నిస్సిగ్గుగా వ్యాఖ్యలు ‘వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దు్రష్పచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటినుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీ కి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికే నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది ఆ కోవలోనే ఏడాది కాలంగా అనేకమంది మహిళా నాయకులను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది?, టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరిచి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు. మాజీ మంత్రి విడదల రజిని, కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికతోపాటు మా పార్టీ కి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి.. అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది. సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. ⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ⇒ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది. ⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్‌షీట్ రూపంలో కూడా కొనసాగించింది.మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్శనివారం ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు. ⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు. అవాస్తవాల పుట్ట.. రెడ్‌బుక్ కుట్ర సిట్ చార్జ్షీట్చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు సిట్ చార్జ్‌షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్లో పునరుద్ఘాటించారు. తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్‌ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
‘ఇది సుపరిపాలన కాదు.. అరాచక పాలన’
విజయవాడ: ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు. ఈరోజు(శనివారం, జూలై 19) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణుతో పాటు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ వైలజారెడ్డి తదితరులు పాల్లొన్నారు. దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘టిడిపి కక్షపూరిత పాలన చేస్తోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అరెస్టులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడేది లేదు. వైఎస్ జగన్ ఆదేశాల మేరక టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళతాం. సుపరిపాలన పేరుతో ప్రజల ముందుకు వెళ్లిన టీడీపీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట తప్పింది. ఇదేనా సుపరిపాలనా అంటే?, ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన త్వరలోనే రానుంది’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
ఆ అర్హత చంద్రబాబుకు లేదు: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవాను కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్ట్ స్థాయికి కుదించిన ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ ఆనాడు రాయలసీమ కష్టాలను తీర్చడానికి 3850 క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చే ప్రాజెక్ట్‌గా హంద్రీనీవాకు రూపకల్పన చేశారని వెల్లడించారు. సిగ్గులేకుండా చంద్రబాబు హంద్రీనీవాను తానే పూర్తి చేశానంటూ అబద్దాలు మాట్లాడటాన్ని చూసి రాయలసీమ వాసులు నవ్వకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..తాజాగా నంద్యాల జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా వద్ద జలాలను విడుదల చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గతంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్ట్ వద్దకు మళ్లీ సీఎం స్థాయిలో వెళ్లి జలాలను విడుదల చేయడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాయలసీమ గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడటం, తన ఘనతగా చాటుకోవడం హాస్యాస్పదంగా ఉంది. 1983లో ఇప్పటి సత్యసాయిజిల్లాలో ఆనాటి సీఎంగా ఎన్టీఆర్ హంద్రినీవాకు శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు దానిని పూర్తి చేశానని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారుసీఎంగా చంద్రబాబు 9 ఏళ్ళలో హంద్రీనీవా కోసం చేసిన ఖర్చు ఎంత?1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉరవకొండలో హంద్రీనీవాకు చంద్రబాబు శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారు. 1999లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు సమీపం లోని ఒడ్డుపల్లి వద్ద మరో శంకుస్థాపన రాయి వేశారు. 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన హంద్రీనీవా ప్రతిపాదనలు ఒడ్డుపల్లి వద్దకు వచ్చేలోగా దానిని అయిదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చేశారు. అనంతపురం జిల్లా వారికి వ్యవసాయం చేతకాదని సాగునీటి ప్రాజెక్ట్‌ను, తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చేసిన ఘనుడు చంద్రబాబు.చంద్రబాబు 1995-2004 వరకు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. ఈ సమయంలో హంద్రీనీవా కోసం ఆయన చేసిన ఖర్చు రూ.13.75 కోట్లు మాత్రమే. శ్రీశైలంలో 834 అడుగుల స్థాయి నుంచి నీటిని తీసుకోవచ్చని వైఎస్సార్ ఆలోచించి హంద్రీనీవాను సాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చి 3850 క్యూసెక్కుల నీటిని తెచ్చుకునేలా ప్రణాళికలను మార్పు చేశారు. మొత్తం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, ముప్పై లక్షల మందికి తాగునీటిని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.7000 కోట్ల వరకు ఖర్చు చేసి తొలి దశను పూర్తి చేశారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీడిపల్లికి నీటిని తీసుకువచ్చాం. శ్రీశైలంలో 843 అడుగులకు తగ్గితే ముచ్చుమర్రి వద్ద 790 అడుగులకు తగ్గినా కూడా హంద్రీనీవా కాలువలకు ఎత్తిపోతల ద్వారా నీటిని అందించాలనే ప్రణాళికను కూడా వైఎస్సారే చేశారు.హంద్రీనీవా మట్టిపనుల్లో ఎంత మింగారు చెప్పాలిహంద్రీనీవా ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎంలా మారింది. రాష్ట్ర విభజన తరువాత సీఎంగా చంద్రబాబు రెట్టింపు రేట్లకు టెండర్లు కూడా లేకుండా తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు హంద్రీనీవా పనులను కట్టబెట్టారు. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్ నిబంధనలతో సంబంధం లేకుండా ధరల సర్ధుబాటు కోసం జీఓ 22, పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు ఇచ్చేందుకు జీఓ 63 లను జారీ చేసింది చంద్రబాబే. మా హయాంలో పూర్తి చేసిన హంద్రీనీవా పనులను చంద్రబాబు సీఎంగా ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయ్యారు.సిగ్గు లేకుండా 2014-19 మధ్య పనులను పరుగులు పెట్టించామంటూ చంద్రబాబు చెప్పుకోవడం దారుణం. ఈ ప్రాజెక్ట్‌ను అడ్డం పెట్టకుని ఎలా అవినీతికి పాల్పడ్డారో కాగ్ రిపోర్ట్ల్లోనే తేటతెల్లం అయ్యింది. చంద్రబాబు హయాంలోనే 1.22 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని హంద్రీనీవా నుంచి తరలించారు. ఈ మట్టి ఎక్కడకు వెళ్ళిందో చెప్పాలి. ఇందు కోసం రూ.695 కోట్లు ఖర్చు చేశారు. 6 లక్షల టిప్పర్లను తోలారు. దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. -
లోకేష్ డైరెక్షన్లోనే మిథున్‌రెడ్డి ఎపిసోడ్
కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడారు. సాక్షి, తిరుపతి: కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీలో కీలక నేత మాత్రమే కాదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర దాగుంది. అందుకే ఎలాంటి సంబంధం లేని మిథున్‌రెడ్డి ఈ స్కామ్‌ను అంటగట్టాలని చూస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగింది అనే ఓ అబూతకల్పన మాత్రమే. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అదే తరహాలో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చెయ్యడం.. కొట్టడం చేస్తున్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు మారుతుంటాయి. ఆ ఇంగితజ్ఞానం కూడా లేకపోతే ఎలా?.అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యాలని, ప్రతిదాడులు చెయ్యడానికి కాదు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ చూస్తున్నారు, జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై అతి పెద్దనేరం మోపి తప్పు చేశారు. మీకు ఇది ప్రస్తుతానికి ఆనందాన్ని కలిగొచ్చవచ్చు. కానీ, భవిష్యత్తులో మీకు ఆవేదన మాత్రమే మిగులుస్తుంది. పోలీసు వ్యవస్థ వాడుకొని అక్రమ అరెస్టు చేస్తున్న మీకు ప్రజలు నుండి తిరుగుబాటు తప్పదు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక మీరు నేర్పిన పాఠాలే మీకు అప్పచెప్పాల్సివస్తుంది అని భూమన హెచ్చరికలు జారీ చేశారు. -
మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం
మిథున్‌రెడ్డి అరెస్టును ఖండించిన కాసు మహేష్రెడ్డికూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయితప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదుమిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారువైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం: ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికక్ష సాధింపు లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారుఏపీ లో కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారుమిథున్ రెడ్డి ఖచ్చితంగా న్యాయ పోరాటంలో విజయం సాధిస్తారువైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేసిన సిట్రేపు కోర్టులో హాజరుపర్చనున్న సిట్లేని మద్యం కేసును సృష్టించి.. కుట్రలకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వంమిథున్రెడ్డి అరెస్ట్‌పై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహంవిజయవాడసిట్ కార్యాలయంలో 6 గంటలకు పైన కొనసాగుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి విచారణఏ సమయం వరకు విచారణ సాగిస్తారో చెప్పని అధికారులురాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథ్న్ రెడ్డిని ఉంచనున్నట్లు సమాచారంసిట్ కార్యాలయం బయట ఉదయం నుండి భారీ భద్రతలిక్కర్ కేసుకు సంబంధించి చార్జీ షీట్‌ను జడ్జి ఇంటికి తీసుకెళ్ళిన సిట్ అధికారులుజడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్ షీట్‌ను వెనక్కి తీసుకొచ్చిన సిట్ అధికారులు300 పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు సమాచారంపూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో ఉంచాలని చూస్తున్నారంటున్న వైఎస్సార్సీపీవిజయవాడమద్యం పాలసీ కేసులో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణవిజయవాడ సిట్ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డిఈ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన మిథున్రెడ్డిసిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు తిరుపతి..మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందివైఎస్సార్సీపీలో ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసుకుని ఇలా సిట్ వేధింపులకు గురిచేస్తున్నారు.50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదునీతిగా నిజాయితీగా పాలన చేశాంవైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది.. అవినీతికి అవకాశం లేదుఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు తెరిచారుజగనన్న పాలనలో బెల్ట్ షాపులు లేవు.ప్రభుత్వం పారదర్శకంగా మద్యం దుకాణాలు నిర్వహించాం అంబటి రాంబాబు కామెంట్స్..ఇది పూర్తిగా తప్పుడు కేసు.ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారు.మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా మద్యం అక్రమ కేసు.ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. తాడేపల్లి..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్..ఏపీలో కక్షసాధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందిజగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారుకూటమి నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారుసాక్ష్యాలు ఏం ఉన్నాయో చూపాలని కోర్టు అడిగితే సిట్ చూపించలేక పోయిందిరాష్ట్రంలో వైఎస్సార్సీపీని లేకుండా చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ లక్ష్యం2014-19 మధ్య అసలైన లిక్కర్ స్కాం జరిగిందిదాన్నుంచి తప్పించుకునేందుకే కొత్తగా మా పార్టీ నేతలపై కేసులు పెట్టారుఎంపీ మిథున్ రెడ్డి స్వచ్చందంగా విచారణకు హాజరయ్యారువిచారణ సందర్భంగా ఒక యుద్ద వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసిందిరోడ్డు పొడవునా పోలీసులను పెట్టి హడావుడి చేస్తోందిఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదుచిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఎంపీ గురుమూర్తి కామెంట్స్..మిథున్‌రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు.రాజకీయ కక్షతోనే మిథున్‌రెడ్డిపై కేసు.కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్చంద్రబాబు, నారా లోకేష్ కక్ష్య సాధింపుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.వైఎస్సార్సీపీలో కీలక నేత, జగన్ సన్నిహితుడు అయిన ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్రలు జరుగుతోంది.ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్ర.మద్యం స్కాంలో ఎలాంటి సంబంధం లేని మిథున్ రెడ్డికి అంటగట్టాలని చూస్తున్నారు.ఓ అభూత కల్పనతో దారుణాలకు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతున్నారుఇప్పటి వరకు అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవుఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం, కొట్టడం చేస్తున్నారు.రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు మిథున్ రెడ్డి కామెంట్స్..రాజకీయ కక్షతో కేసు పెట్టారు.ఇది పూర్తిగా తప్పుడు కేసు.మద్యం అక్రమ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.కేసులకు భయపడే ప్రసక్తే లేదు.రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు.సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డి. సిట్ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, కార్యకర్తలు. విజయవాడ..ఎనికేపాడు వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుగన్నవరం విమానాశ్రయం నుండి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు బయల్దేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు.సిట్ కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలుఎవరిని అనుమతించని పోలీసులుసిట్ కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్లాది విష్ణును ఆపేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి.మద్యం కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఏపీలో మద్యం కేసులో విచారణ విషయమై.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ ఎదుట హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి.. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు.నేడు ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో హంగామా చేస్తున్నారు.విమానాశ్రయం ఎంట్రన్స్‌లో భారీగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారుల వివరాలు అడిగి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం నేపథ్యంలో ఆంక్షలు విధించారు. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్‌ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్‌లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్‌లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తప్పుడు కేసులు నాకేమీ కొత్త కాదు.. కూటమి టార్గెట్ అదే: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.. రాజకీయ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. మద్యం కేసులో తన పాత్రపై ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీలో ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్‌గా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సిట్ విచారణకు తాను హాజరు అవుతున్నట్టు మిథున్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. కేసులకు భయపడే ప్రసక్తి లేదు. భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండను. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ కేసుల నుంచి బయటపడతాను. నా పాత్రపై ఆధారాలు ఉంటే చూపించండి. నా ఫోన్లు మీకు ఇస్తా.. దర్యాప్తునకు సహకరిస్తాను. సిట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయ ఒత్తిడితోనే నాపై కేసు పెట్టారు. ముందుగానే ఒక వ్యక్తిని జైల్లో వేయాలని నిర్ణయించుకుని.. ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లుతున్నారు. మద్యం కేసు టార్గెట్ కాదు..తమకు అనుకూలంగా ఉన్న వారిని నయానో.. భయానో ఒప్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎలాంటి సీజర్లు లేవు, సాక్ష్యాలు లేవు. నోటి మాటలతో ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పించి కేసు నడుపుతున్నారు. ముఖ్యమైన నాయకులను జైల్లో పెట్టడమే టార్గెట్ గా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు వారి టార్గెట్ కాదు. తమకు నచ్చని వారిని వేధించేందుకు రకరకాల కథలు అల్లుతున్నారు.. ఇదేమి కొత్తది కాదు. 2014-19 లోను నాపై తప్పుడు కేసులు పెట్టారు. నేనేదో దాడి చేశానని నాడు టీడీపీ హయాంలో కేసు పెట్టారు. నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా జైల్లో పెట్టారు. అప్పుడు తప్పుడు సాక్షాలు చెప్పిన వారంతా.. మళ్లీ కోర్టుకు వచ్చి అదంతా తప్పు అని చెప్పారు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. మళ్లీ అదే తరహాలో ఇప్పుడు అరెస్టు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానుఎవరినైనా అరెస్టు చేయాలనుకుంటే ముందుగా ఎల్లో మీడియాలో.. మాస్టర్ మైండ్ అని కట్టుకథలు అల్లుతున్నారు. గతంలో ఇతరులను మాస్టర్ మైండ్ అన్నారు.. ఇప్పుడు నన్ను మాస్టర్ మైండ్ అంటున్నారు.. రేపు ఇంకొకరిని పట్టుకొచ్చి అతన్ని మాస్టర్ మైండ్ అంటారు. ఏదో రకంగా మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కొద్దిమంది అధికారులను తీసుకొచ్చి భయపెట్టి.. ఒప్పుకోకపోతే జైల్లో పెడతామని స్టేట్మెంట్లు తీసుకున్నారు. మేము ఎక్కడ కలిశామో ఆధారాలు చూపండి. నోటి మాటతో కేసు పెడతారా?. అధికారులను బెదిరించి మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తీసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే అధికారులను బెదిరించి చెప్పించారని కోర్టులో చెబుతారు.. కేసు కొట్టివేస్తారు. గతంలో కూడా ఇలాగే నాపై తప్పుడు కేసు పెడితే కోర్టు కొట్టేసింది. ఈ కేసులో రేపు జరగబోయేది కూడా ఇదే. నోటి మాటలతో కథలు.. మద్యం కేసులో మొదట్లో 50వేల కోట్లు అన్నారు. ఆ తర్వాత 30,000 కోట్లు.. అటు తర్వాత 3000 కోట్లు అని అంటున్నారు. 3000 కోట్లు ఎక్కడ అంటే.. ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెబుతున్నారు. సిట్ చెప్పే కట్టు కథలు నమ్మదగినవి కాదు. ఎక్కడైనా డబ్బును సీజ్ చేశారా?. పెట్టుబడులు పెట్టారా?. ఇవన్నీ లేకుండా కేవలం నోటి మాటతో కథలు చెబుతున్నారు. అరెస్టు చేసి ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతోనే ఈ కేసులు పెట్టారు.. ఈ కేసు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఒక ఎంపీగా నా పాత్ర పార్లమెంటు నియోజకవర్గం వరకే పరిమితం. మద్యం విధానాల్లో నేను జోక్యం చేసుకోలేదు. పార్లమెంటులో చట్టాల రూపకల్పనలో చర్చల్లో పాల్గొనడమే మా పని. మరెక్కడ కూడా నేను జోక్యం చేసుకోలేదు. కేవలం కక్ష సాధింపులో భాగంగానే కేసులు బనాయించారు. ఈ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నింటికీ మేము రెడీగా ఉన్నాం. తప్పు చేయనంతవరకు భయపడాల్సిన పనిలేదు’ అని అన్నారు.