‘అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరు’ | YSRCP Leader Ambati Rambabu Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరు’

Jul 20 2025 6:00 PM | Updated on Jul 20 2025 6:26 PM

YSRCP Leader Ambati Rambabu Takes On Chandrababu Naidu

గుంటూరు:   అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అం‍బటి రాంబాబు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుట్రలకు కొందరు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పిచ్చి చేష్టలను చూసి జనం విస్తుపోతున్నారని అంబటి ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, జూలై 20) గుంటూరు నుంచి మాట్లాడిన అంబటి.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మించి క్రిమినల్‌ మైండ్‌సెట్‌ ఉన్న పొలిటీషియన్‌  రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. 

‘తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు అంతటి దివాళాకోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరు. మద్యం కేసులో ఎంతమందిని అరెస్టు చేసినా లెక్క చేయం. అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీని అణచి వేయలేరు. రాష్ట్ర అభివృద్ధి, తమకు సంక్షేమ పథకాలను అందిస్తారని ప్రజలు కూటమిని గెలిపించారు. కానీ రాజకీయ కక్షసాధింపులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వేధించే పని చేస్తున్నారు. చివరికి జగన్ పర్యటనలకు వెళ్తే ఆయనపై కూడా కేసులు పెడుతున్నారు. మద్యం కేసు పేరుతో ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీని తెచ్చింది. ప్రయివేటు వ్యక్తులకు ప్రమేయం లేకుండా చేశాం. 

 దీని వలన ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ పాలసీలో తప్పులేదని కేంద్ర సంస్థ సీసీఐ కూడా చెప్పింది. కానీ ఆ సీసీఐని తీర్పును కూడా కాదని అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే మద్యం అక్రమాలు జరిగాయి. ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. స్కిల్ కేసులో అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు ఎప్పటినుంచో కక్ష ఉంది. అందుకే మిథున్‌రెడ్డి మీద కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేయటమే‌ సిట్ అధికారుల పనిగా ఉంది. ఎవరిని కేసులో పెట్టమని చెబితే వారిని అరెస్టు చేస్తున్నారు. 

ఇలాంటి చర్యల వలన వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు. లేని స్కాంను ఉన్నట్లు చూపుతూ పుస్తకాలు, నవలలు రాస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హోంమంత్రి ఏం చేస్తున్నారు?, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. అవేమీ పట్టించుకోకుండా రాజకీయ వేధింపుల పనిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు మేము భయపడం. అవసరమైతే కొన్నాళ్ళు జైల్లో ఉండానికైనా సిద్ధం

అసలు మద్యం కేసులో మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?, ఎల్లోమీడియా రాసిందే  పోలీసులు ఛార్జిషీట్, రిమాండ్ రిపోర్టుల్లో రాస్తున్నారు. చంద్రబాబు రాజకీయ పుట్టుకే స్కాంలో నుండి పుట్టాడు. డబ్బుతో ఏదైనా చేయగలని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్ చేయటఙ, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ మలినాలను తొలగిస్తానంటూ కబుర్లు చెప్తున్నారు. చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టలరీ నుండే గత ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. చంద్రబాబు పెట్టిస్తున్న ఏ ఒక్క కేసు కూడా నిలపడదు’ అని అంబటి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement