breaking news
-
‘జగన్ పర్యటనపై ఇన్ని ఆంక్షలా?.. ఎందుకంత భయం?’
సాక్షి, వైఎస్సార్: కూటమి ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను, జనాన్ని వేరు చేయలేరని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైఎస్ జగన్ నెల్లూరు వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు అని గుర్తు చేశారు.మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి, సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైళ్లో పెట్టారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. ఈ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. జిల్లా మొత్తాన్ని అష్టదిగ్భందనం చేస్తున్నారు.. మా జిల్లా అధ్యక్షుడికి నోటీసులిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి చూడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్వేచ్ఛగా తిరగారు. మా ప్రభుత్వంలో వీళ్లెవరికీ మేం నోటీసులు ఇవ్వలేదు.. ఇబ్బంది పెట్టలేదు.పది మందికి అనుమతా?.జగన్ హెలిపాడ్ వద్దకు పది మందికే అనుమతి అంటున్నారు.. మూడు వాహనాలు మాత్రమే అనుమతి అంటున్నారు. కాకాణి పరామర్శకు ముగ్గురు, నల్లపురెడ్డి ఇంటి వద్ద వంద మందికి మాత్రమే అనుమతి అంటూ షరతులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు ఒకటే సూటి ప్రశ్న. ఇదే ఆంక్షలు గత ఐదేళ్లు మేమూ పెట్టుంటే మీరు తిరిగేవారా?. చంద్రబాబూ.. నువ్వు రాష్ట్రమంతా పర్యటన చేసేవాడివా?. లోకేశ్.. నువ్వు యువగళం అంటూ తిరగగలిగేవాడివా?. పవన్ కల్యాణ్.. ఇవే ఆంక్షలు మేం పెట్టి ఉంటే కారు టాప్‌పై కూర్చుని సినిమా యాక్షన్ చేయగలిగేవాడివా?. జగన్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, జగన్ అంటేనే జనం. ఆయన ఎక్కడ పర్యటనకు వచ్చినా ఏ వైఎస్సార్సీపీ నేత జనసమీకరణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ ఎక్కడ ఉంటే జనం అక్కడ ఉంటారు.. జగన్ వెంటే జనం. ఈ విషయం ఈ ప్రభుత్వానికి, అధికారులకు తెలుసు. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు జగన్ పరిపాలనే మేలు అంటూ ఆయన వెంటే నడుస్తున్నారు. ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, ఇబ్బందులు చెప్పుకునేందుకే జనం జగన్ వద్దకు వస్తున్నారు. మీరు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా, అడ్డుకున్నా.. జగన్ నుంచి జనాన్ని వేరు చేయలేరు. ఎవరూ నెల్లూరు నగరంలోకి రాకూడదని ఆంక్షలు పెట్టడం సమంజసమేనా?.జగన్ పేరంటే భయమా?మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడికైనా పర్యటనకు వెళితే మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు?. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కడికి వెళ్లినా.. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు?. ఎందుకు పేరు వింటే భయపడిపోతున్నారు?. వైఎస్సార్సీపీ నుంచి 11మంది గెలిచినా.. 40 శాతం ప్రజాభిమానాన్ని పొందింది. మీరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనే ప్రతిపక్ష నేత. ఆయనకు 40శాతం ఓట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా కల్పించారు. అలాంటి నేత పరామర్శలకు వెళితే ఇలాంటి ఆంక్షలు పెట్టడం సరికాదు.చంద్రబాబు, లోకేష్‌లకు రాని జనం జగన్‌కు వస్తున్నారని ఇలా ఆంక్షలు పెడుతున్నారా?. మీరు డబ్బులు, బిర్యానీ, మందు ఇచ్చినా మీ పర్యటనలకు జనాలు రావడం లేదు. కానీ, జగన్ కాలు బయటపెడితే ఇవేమీ అవసరం లేదు.. స్వచ్ఛందంగా ప్రజలే స్వాగతం పలుకుతారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత పరిపాలనలో ఉన్నామా?. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల అభిమానాన్ని అడ్డుకోలేరు.. కచ్చితంగా నాలుగింతలు ప్రజలు వస్తారు. ఈ సంప్రదాయాన్ని మీరు ప్రారంభించారు.. భవిష్యత్తులో మీరు ఎక్కడా తిరగలేరని గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అడ్డంకులు, ఆంక్షలు పెట్టినా జగన్ నెల్లూరు వస్తారు.. పర్యటన చేస్తారు. ఇలాంటి ఆంక్షలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి’ అని హితవు పలికారు. -
జగన్ అడుగులే పిడుగులయ్యాయా?
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా?. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ల కంపమీద కూర్చోబెట్టినట్లు ఉంటుందా?. ఆయన కన్నెర్ర చేస్తుంటే చండ్రనిప్పులు కురుస్తున్నట్లు భయమేస్తోందా?. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్.. ఇన్ని నిబంధనలు విధిస్తోందా?.. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లడాన్ని ప్రభుత్వం అంగీకరించలేకపోతోంది. ఆయన ఏ ఊరు వెళ్లాలన్నా సవాలక్ష ఆంక్షలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడి పర్యటనల మీద గతంలో ఎన్నడూ లేనన్ని నిబంధనలు విధించడం అంటే ఆయన్ను చూసి ప్రభుత్వం భయపడుతున్నట్లు కాదా?. చుట్టూ కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేక మేఘాలను చెదరగొట్టేందుకు.. ప్రజల గొంతుకు ఆయన మరింత మద్దతు తెలపకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెడుతోందా?. వైఎస్ జగన్‌ను జనంలోకి వెళ్లకుండా ఆపడానికి ఇలా ఆంక్షలు విధిస్తోందా అనే అభిప్రాయాలూ జనంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజలను నమ్మించి గెలిచినా ప్రభుత్వం ఆ దిశగా చేసింది ఏమీ లేదన్న అభిప్రాయాలు జనంలో ఉన్నాయి. పెన్షన్ల పెంపు మినహా మరే హామీ అమలు చేయలేదు. రైతులకు.. యువతకు.. విద్యార్థులకు.. మహిళలకు ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవాళ్లను, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్లను సైతం రాత్రికి రాత్రి పోలీసులు తీసుకెళ్లి అరెస్టులు చేస్తున్నారు. చిత్రహింసలు పెట్టి ప్రభుత్వం చెప్పినట్లు చేస్తూ పెద్దలను సంతృప్తి పరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ తీరును.. పోలీసులు చేస్తున్న అతిని హైకోర్టు కూడా పలుమార్లు అభిశంసించింది.ఇక, అరటి.. మామిడి.. మిర్చి.. పొగాకు.. రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వారి ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయక.. ఇటు వ్యాపారాలు సిండికేట్ అవడంతో ధర ఘోరంగా పడిపోయి రైతులు నష్టపోయారు. ఇటు సామాజిక.. రైతుల అంశాలతోపాటు ప్రభుత్వ వేధింపులతో నష్టపోతున్న కార్యకర్తలను ఓదార్చేందుకు.. నైతిక మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా అయన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎన్నడూ లేని అడ్డంకులు కలిగిస్తోంది. మొన్న పల్నాడు వెళ్లాలనుకున్నపుడు కూడా ఇలాగే నిబంధనల సంకెళ్లు విధించింది. నేడు నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డిని పరామర్శించేందుకు సైతం జగన్ వెళ్లబోగా రూల్స్ పేరిట కట్టడి చేస్తోంది.గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న లోకేష్.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇష్టానుసారం దూషించలేదా?. నాటి ప్రభుత్వాన్ని.. అధికారులను.. పోలీసులను దునుమాడలేదా?. లోకేష్ అయితే ఏకంగా రాష్ట్రంలో ఆ చివర నుంచి ఈ కొసకు నడుస్తూ అడుగడుక్కీ వైఎస్ జగన్‌ను తిడుతూనే వెళ్లారు. మరి నాడు ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టలేదు కదా. మరి నేడు చంద్రబాబు ప్రభుత్వం జగన్‌ను చూసి ఇంతగా ఎందుకు కలవరపడుతోంది. తమ ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాల మీద ప్రజలు జగన్ కలుస్తున్నారని భయమా?. గెలిచినా ఓడినా ప్రజల్లో ఆదరణ తగ్గని జగన్ మళ్ళీ సమాజంలో తిరిగితే ప్రభుత్వ బండారం బట్టబయలు అవుతుందని కలవరమా?.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, బాధ్యత ప్రతిపక్షానికి ఎప్పటికీ ఉంటుంది.. ఆ హక్కును కాలరాయడం అంటే అది నియంతృత్వమే అవుతుంది. ఇక ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా.. నిబంధనలు విధించినా వాటిని తెంచుకుని వెళ్తాము అంటూ వైఎస్ జగన్, ఆయన కార్యకర్తలు అయితే ముందడుగు వేస్తున్నారు.. -సిమ్మాదిరప్పన్న. -
పవన్, పురంధేశ్వరి.. మాటలు రావట్లేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుల యావ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎందుకోసం?.. ఎవరికోసం చేస్తోందో తెలియదు కానీ.. అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరిపోయింది. సంపద సృష్టికర్తనని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ‘‘అప్పు చేసి పప్పు కూడు’’ తింటున్నట్టుగా ఉంది. ఒకపక్క ఆదాయం ఆశించినంతగా పెరగకపోవడం, ఇంకోపక్క అప్పులు మోత మోగిపోతుండటంతో రాష్ట్రం భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.తాజా ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో రూ.37 వేల కోట్ల అప్పులు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సగటున నెలకు రూ.12.300 కోట్లు అన్నమాట. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారా, గనుల తాకట్టుల ద్వారా కూడా వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వచ్చిన వార్తలు స్పష్టం చేస్తున్నాయి. ఖజానానే తాకట్టు పెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇదేదో తమ గొప్పదనం అన్నట్టుగా చంకలు గుద్దుకోవడం ఒక హైలైట్ కాగా.. వైఎస్సార్సీపీ వాళ్లు కుట్ర చేసినా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నామహో అని చాటింపు వేసుకోవడం ఇంకో హైలైట్!. గనులు తాకట్టు పెట్టడం, రుణం ఇచ్చే వారు ఆర్బీఐ ఖాతా నుంచే నేరుగా డబ్బు వసూలు చేసుకునే నిబంధనకు అంగీకరించడం ఎంత వరకు కరెక్ట్?. గౌరవపూర్వకమన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. టీడీపీ నేతలు వీటి గురించి మాట్లాడరు. వైఎస్సార్సీపీ వారిపై బురదజల్లేందుకు మాత్రం తయారుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలంలోనే సుమారు రూ.1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంక్, హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల అప్పులు దీనికి అదనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఉండగా ఏ చిన్న అప్పు చేసినా ఆర్థిక విధ్వంసం జరిగిపోతోందని, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని నానా యాగీ చేసిన టీడీపీ, దాని మురికి మీడియా.. ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న అప్పుల గురించి పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నోరు మెదపడం లేదు. వీరంతా.. జగన్ సీఎంగా ఉండగా అప్పులు చేయడమే తప్పని అన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారన్న వింత వాదనకు దిగారు. నిజానికి కేంద్రంలో, రాష్ట్రంలోనూ పాలన చేస్తున్నది ఈ కూటమి పార్టీలే!. ఏ మేరకు, ఎందుకోసం అప్పులు చేసిందో ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కొత్త విషయం తెలిపారు.వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అయితే, దానికి ఆధారాలు మాత్రం చూపరు. బడ్జెట్ స్పీచ్లోనేమో ఏపీ అప్పు అంతా కలిపి సుమారు ఆరు లక్షల కోట్లు అని చదువుతారు. ఎన్నికలకు ముందు రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు తదితర కూటమి నేతలు ప్రచారం చేశారు. పైగా అదంతా జగన్ వచ్చిన తర్వాత జరిగిన అప్పు అన్న చందంగా పచ్చి అబద్దాలు జనంలోకి తీసుకువెళ్లారు. విభజన టైమ్‌కు ఉన్న అప్పు, 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రం మాట్లాడరు. అలాగే జగన్ టైమ్‌లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కరోనా సంక్షోభం కారణంగా అప్పులు చేయడానికి కేంద్రమే అనుమతి ఇచ్చిన విషయాన్ని దాచేస్తారు. ఎప్పుడు ఏ అబద్దం చెబుతారో, ఎలాంటి వదంతులు సృష్టిస్తారో తెలియని ఇలాంటి పార్టీలతో రాజకీయాలు చేయాలంటే అంతకన్నా ఎక్కువ అసత్యాలు ప్రచారం చేయగలగాలి. అంత యుక్తి కానీ, శక్తి కానీ వైఎస్సార్సీపీకి లేదన్నది వాస్తవం. జగన్ జనాన్ని నమ్ముకోవడం తప్ప, ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నే అలవాటు ఉన్న వ్యక్తి కాదు.కాగ్ లేటెస్ట్గా ఇచ్చిన నివేదికలో వెల్లడైన అంశాలు ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియ చేస్తుంది. ఏడాది కాలానికిగాను దాదాపు రూ.80వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో తెలిపారు. దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ 12 నెలల్లో తీసుకోవాల్సిన అప్పులో సుమారు సగం (రూ.37 వేల కోట్లు) మూడు నెల్లలోనే తెచ్చేసుకున్నారు. ఈ లెక్కన ఏడాది పూర్తి అయ్యేసరికి మరో మళ్లీ 1.25 లక్షల కోట్లు అప్పు చేయాల్సి రావచ్చు. ఇతర మార్గాల ద్వారా ఇంకెన్ని వేల కోట్ల అప్పు చేస్తారో చెప్పలేం. ఈ అప్పులన్నీ ఏమవుతున్నాయో, వేటి కోసం ఖర్చు పెడుతున్నారో పాలకులు చెప్పడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఒకటి, అర తప్ప అమలు చేయడం లేదు.ఇటీవల తల్లికి వందనం స్కీమ్ ఇచ్చినా, చాలా లొసుగులు బయటకు వచ్చాయి. ఎన్నికలలో చెప్పినట్లుగా ప్రతీ విద్యార్దికి రూ.15 వేల చొప్పున ఇవ్వలేదు. రూ.13వేలే ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులోనూ బలహీన వర్గాల వారికి ఇంకా కోత పెట్టారు. కేంద్రం ఇచ్చే స్కాలర్షిప్లను జత చేసి అన్యాయం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌లో రూ. 4300 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్యశ్రీ సంగతి తెలియదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఏభై ఏళ్లకే ఫించన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. వలంటీర్లకు అసలుకే మోసం తెచ్చారు. వీటన్నిటిని ఎగవేసినా, రాష్ట్ర ఆర్థిక స్థితి సజావుగా ఉందా అంటే అదీ కనిపించడం లేదు. రాష్ట్ర ఆదాయంలో వృద్ది అన్నీ కలిపి 6.14 శాతంగా ఉంటే, అప్పులు మాత్రం 15.61 శాతంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఏది చెప్పినా ఆధార సహితంగా చెబుతుంటారు. కాగ్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, అప్పులపైనే ఆధార పడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ అమ్మకం పన్ను ఆదాయాలు తగ్గుదలను ఉదాహరణగా చూపారు. అటు సంక్షేమం సరిగా అమలు చేయక,, ఇటు అభివృద్ధి లేక ప్రభుత్వం ఏపీ ప్రజలను సంక్షోభంలోకి తీసుకుపోతోందని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ తెలిపిన ఈ అంశాలకు చంద్రబాబు లేదా కేశవ్ సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. కాకపోతే వారు తమ మీడియా బలంతో రొడ్డ కొట్టుడు ప్రకటనలు చేసి జగన్ పై విమర్శలు సాగిస్తారు. అలాకాకుండా కాగ్ నివేదికను దగ్గర పెట్టుకుని, జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు లేదా కేశవ్ వివరణ ఇస్తే ఏమైనా అర్దం ఉంటుంది. ఆ పని మాత్రం చేయరు. సంక్షేమం, అభివృద్దిలో కాకుండా అప్పులలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా చేసినందుకు కూటమి సర్కార్ సిగ్గుపడాలో, గర్వపడాలో వారే ఆలోచించుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత. -
పదే పదే జగన్ పర్యటనకు అడ్డంకులు.. ఇప్పుడు తాజాగా
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్కడ పర్యటిస్తున్నా.. కూటమి సర్కార్ (Kutami Government) అనేక అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల చిత్తూరు బంగారుపాళ్యంలో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. నెల్లూరులోనూ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో పర్యటనలో భాగంగా అక్రమ కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌తో గురువారం(జులై 31) వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇందుకు వైఎస్సార్సీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. అదే సమయంలో ఈ పర్యటనపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.నెల్లూరు వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది కూటమి సర్కార్. ఈ నెల మొదట్లోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. హెలిప్యాడ్ అనుమతులను నిరాకరించింది. ఇప్పుడేమో.. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు.కోవూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పోలీసు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడ చూసినా చెక్‌పోస్టులు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనకు జనసమీకరణ చేసినా.. స్వచ్ఛందంగా జనం గుంపుగా వచ్చినా చర్యలు తప్పవంటూ అనౌన్స్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిసతే కఠిన చర్యలు, కేసులు తప్పవంటూ బెదిరిస్తున్నారు.జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. పోలీసుల తీరుపై ఇటు వైఎస్సార్సీపీ నేతలు.. కర్ఫ్యూను తలపించే ఆంక్షలతో అటు ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబుకు సింగపూర్ ‘నో’ చెప్పింది.. తట్టుకోలేకపోతున్న చిట్టిబాబు..
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్షియం పేరుతో చంద్రబాబు, ఆయన బినామీల దోపిడీ బాగోతాన్ని సాక్ష్యాధారాలతో రట్టు చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ మంగళవారం పోస్టు చేసింది. ‘గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసింది.రాజధానిలో రూ.లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదేస్థాయి దోపిడీకీ బరితెగిస్తూ సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.18,221.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వచ్చే ఆదాయం 8.7 శాతం, అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కన్సార్షియంకు వచ్చే ఆదాయం 91.3 శాతం. ఇది కుంభకోణం కాదా!’ అని వైఎస్సార్సీపీ నిలదీసింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం గుట్టురట్టవుతుందని, అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలవుతామన్న భయంతో సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని 2019 అక్టోబర్ 30న ప్రభుత్వాన్ని కోరింది.సింగపూర్ సంస్థల కన్సార్షియం అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్సార్సీపీ గుర్తు చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకు సింగపూర్ సంస్థ కన్సార్షియం ముందుకు రాకపోవడంతో తన దోపిడీకి అడ్డుకట్ట పడిందన్న అక్కసుతో చంద్రబాబు గ్యాంగ్ యథావిధిగా దుష్ప్రచారం చేస్తోందని పేర్కొంది. అవినీతి చక్రవర్తి సీబీఎన్తో కలవలేమని సింగపూర్ చెప్పడంతో తట్టుకోలేక చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పిచ్చెక్కి ఊగిపోతున్నాయని, బాబుతో ‘నో’ అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద విన్యాసాలు, కట్టుకథలు, తప్పుడు ప్రచారాలతో మొదలెట్టేశాయంది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టుం సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులతో సహా వాస్తవాలను 14 పాయింట్లతో వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు… సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు, పాత్రధారులు.. వాస్తవాలు ఇవీ:తెలుగు దొంగల పార్టీ అధినేత, స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కాంలతో మొదలుపెట్టిన చంద్రబాబు, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖంమీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెళ్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టంచేసింది. నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమదేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలుపాలైన సంగతిని వాళ్లింకా మరిచిపోలేదు.మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి, అమరావతిలో రెండో దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కాంలు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితం అయినా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగుపెట్టలేమని చెప్పేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు సుమారు రూ.9 -10వేలు ఖర్చు చేస్తున్న తీరుపై, ఆరేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే బాబు అంటేనే భయపడుతున్నాయి. 💣Truth Bomb 💣Must Read ❗అవినీతి చక్రవర్తి @ncbn తో కలవలేమన్న సింగపూర్తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టు కథలు, తప్పుడు ప్రచారాలుతెలుగు దొంగలపార్టీ సోషల్ సైకోల వికృత, విచిత్ర, ఉన్మాద… pic.twitter.com/MrzRYFxB8S— YSR Congress Party (@YSRCParty) July 29, 2025వాస్తవం ఏంటేంటే.. సింగపూర్ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ ఏంటంటే?1.అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా 1691 ఎకరాలు. దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేలకోట్ల అవినీతికి తెరలేపాడు. 2. ఈ 1691 ఎకరాల్లో ల్యాండ్ డెవలప్ మెంట్ కోసం 2018లో ఏపీ ప్రభుత్వం నుంచి CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ లిమిటెడ్‌కు ఒప్పందం కుదిరింది. 3.అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్లో సింగపూర్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెమ్‌కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఇవి కన్సార్షియంఏర్పడ్డాయి. ఈ కన్సార్షియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ CCMDC ని చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా చొరబడేలా చేశాడు. ( అఫీషియల్ డాక్యుమెంట్ చూడొచ్చు)4.ఉద్దేశ పూర్వకంగా ఈ కంపెనీలకు అప్పగించడానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేశారు. అంటే ఒక ప్రాజెక్టు ఆలోచన వాళ్లు చేస్తారు, ఎంత ఆదాయం ఇస్తామో వాళ్లే ప్రభుత్వానికి చెప్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆప్రాజెక్టు ఇస్తారు, లేదా, ఆ ధర తామే ఇస్తామంటే, ప్రాజెక్టు ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు. కాని ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు చెప్పలేదు. దీన్ని హైకోర్టుకూడా తప్పుబట్టింది. అయినా వీటికే కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్ మెంట్‌ను చంద్రబాబు అప్పగిస్తారు. అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు పడ్డాయి. 5.కోర్ క్యాపిటల్ లోని 1691 ఎకరాల్లో రోడ్లకోసం 371 ఎకరాలు పోనూ, మిగిలిన 1321 ఎకరాల్లో 250 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంకు ఫ్రీగా ఇస్తారు. అవి ఆ కన్సార్షియం అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్కపైసా రాదు. మిగిలిన 1070 ఎకరాలను ప్లాట్లుగా వేస్తారు. 6. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీకూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. దీనికోసం రూ.5,500 కోట్లు ప్రభుత్వమే పెడుతోంది. సింగపూర్ కన్సార్షియంలో చంద్రబాబు బినామీల CCDMCల వాటాగా కేవలం రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది.7.విచిత్రంగా ఈ 1070 ఎకరాల్లో తన బినామీలు ఉన్న CCDNCతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్షియంకు, ఉచితంగా 250 ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు చెప్తున్న ధర ప్రకారం ఎకరా రూ.50 కోట్లు లెక్కవేసుకుంటే ఈ 250 ఎకరాల విలువ అక్షరాల రూ.12,500 కోట్లు. ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా?8.ఈ అవినీతి బాగోతం ఇక్కడితో ఆగిపోలేదు. 1071 ఎకరాల అభివృద్ధికోసం రూ.18,229 కోట్లు ఖర్చుచేసినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ కంపెనీలో దక్కే వాటా 42 శాతం మాత్రమే. చంద్రబాబు బినామీలతోకూడిన సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. 9. కాని 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 కోట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5,500 కోట్లు, CCDMC వాటా కింద ఇచ్చే రూ.221.9కోట్లు వెరసి రూ.18,221.9 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వ సంస్థ సీఆర్డీయేకు దక్కే వాటా కేవలం 42శాతమే. ఇది స్కాం కాదా?10.చివరకు స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం 8.7 శాతం దక్కనుండగా కన్సార్షియానికి 91.3 శాతం వాటా లభిస్తుంది. మరి అవినీతి కాదా? 11.వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. బాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా?12.ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన CCDMC కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. మరి ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి పోతోంది?13.సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ పనులను ఇచ్చారన్నది అబద్ధం. ‘సుర్బానా–జురాంగ్’కు రూ.28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీన్ని తప్పు బడుతూ 2023లో కాగ్ నివేదిక ఇచ్చింది. 14.అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్షియం ఆందోళన చెందింది. దాంతో 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం కాదా? -
జనసేనలో ముసలం
విశాఖ సిటీ: జనసేన పార్టీలో ముసలం రాజుకుంది. ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలో జనసేనకు విలువ లేదన్న వాస్తవాన్ని ఆమె భర్త చెప్పిన పాపానికి జనసేన పెద్దలు వారిపై కక్ష కట్టేశారు. బీసీ మహిళా నేతను పదవి నుంచి పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుంటే.. దాన్ని పార్టీ ధిక్కార స్వరంగా అధినాయకులు పరిగణిస్తుండడం శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. పార్టీ నేతల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుండడం తీవ్ర చర్చకు దారిస్తోంది.ప్రాధాన్యత లేదన్న పాపానికి..కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయింది. సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకమున్నాయి. పోలీస్‌స్టేషన్‌లో సిఫార్సు చేసిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదన్న కోపంతో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గన్మెన్లను సరెండ్ చేసిన అంశం అప్పట్లో హట్ టాపిక్‌గా నిలిచింది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ పెత్తనానికి చెక్ పెట్టేందుకు కిందా మీదా పడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పార్టీ నేతలు, ద్వితీయ స్థాయి నాయకులు పరిిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోని చిన్న పని కూడా జరగని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆత్మగౌరవం కోసం జనసేన నేతలు గత ఏడాది కాలంగా పట్టుబడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీతంపేట ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీనికి జనసేన కార్పొరేటర్లతో పాటు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కొందరు నేతలు గోడు చెప్పుకున్న పాపానికి నాగబాబు ఒంటి కాలిపై లేచారు. కూటమిలో తమకు విలువ ఇవ్వడం లేదని, తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమిలో సర్దుకొని పనిచేయాల్సిందే అని నాగబాబు తెగేసి చెప్పడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు.చేతికి మట్టి అంటకుండా..నాగబాబు సమావేశంలో జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ పార్టీ పరిస్థితిపై మాట్లాడారు. కూటమిలో జనసేన పార్టీ నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని మాత్రమే చెప్పారు. ఇంతలో ఎమ్మెల్సీ నాగబాబు కల్పించుకుని గోపీకృష్ణపై ఫైర్ అయ్యారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వెంటనే అక్కడి నేతలు గోపీకృష్ణ చేతిలో ఉన్న మైక్ లాక్కున్నారు. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఫ్లోర్‌లీడర్ భర్త అవమానభారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూటమిలో జనసేన ప్రాధాన్యత కోసం మాట్లాడుతుంటే.. దానికి మద్దతుగా నిలవాల్సిన పార్టీ పెద్దలు.. వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే.. వెంటనే ఫ్లోర్‌లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు జరిగిపోతుండడం గమనార్హం. నాగబాబు సమావేశంలో ఆమె భర్త మాట్లాడడాన్ని పార్టీ పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పెద్దల చేతికి మట్టి అంటకుండా తెలివిగా కార్పొరేటర్లను ముందు పెట్టి కథను నడిపిస్తున్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు లేఖ అందజేయడం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్‌గా మారింది.ఫ్లోర్ లీడర్‌పై ఆరోపణలతో లేఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిపై వేటుకు ప్లాన్ ఎమ్మెల్సీ నాగబాబు సమావేశంలో ఆమె భర్త ప్రశ్నించారనే అక్కసుతోనే..స్టాండింగ్ కమిటీలోనూ జనసేనకు నో చాన్స్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అంశం జనసేనలో అగ్గి రాజేస్తోంది. స్థాయీ సంఘంలో కూడా జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇందులో 10 స్థానాలు ఉండగా.. 9 టీడీపీ, ఒకటి బీజేపీ సర్దేసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమావేశం నిర్వహించి జనసేనకు మూడు స్థానాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వీటిలో ఒకటి పెద్దిశెట్టి ఉషశ్రీ, మరొకటి మహమ్మద్ సాధిక్, మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని ఆశ పెట్టారు. దీంతో ఆ కార్పొరేటర్లు ఊహల్లో తేలారు. చివరికి జనసేనకు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే 11వ సభ్యుడిగా సాధిక్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మందిలో ఎవరైనా విత్‌డ్రా అయితేనే సాధిక్‌కు అవకాశం ఉంటుంది. లేకుంటే స్టాండింగ్ కమిటీలో జనసేనకు ప్రాతినిథ్యం లేకుండా పోతుంది.జనసేన ఫ్లోర్‌లీడర్‌గా ఉషశ్రీ?ప్రస్తుత ఫ్లోర్‌లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేనలోకి జంప్ అయ్యారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవిని ఆశించి భంగపడ్డారు. కనీసం స్టాండింగ్ కమిటీలో అయినా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. అందులో జనసేనకు ప్రాతినిథ్యమే లేకపోవడంతో ఇప్పుడు ఫ్లోర్‌లీడర్‌పై కన్నేశారు. జనసేన పార్టీ పెద్దలు కూడా ఉషశ్రీ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పార్టీ పెద్దల స్కెచ్ ప్రకారం జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణకు లేఖ అందజేశారు. ఇందులో ఫ్లోర్‌లీడర్ భీశెట్టి వసంతలక్ష్మిని మార్చాలని పేర్కొన్నారు. ఆమె స్వప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారం కోసమే దృష్టి పెట్టారని ఆరోపించారు. మిగిలిన జనసేన కార్పొరేటర్లను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అలాగే ఆమెకు ఫ్లోర్‌లీడర్‌కు అవసరమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఈ పదవికి అనుభవజ్ఞుడైన వ్యక్తి అవసరమన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేనకు చెందిన 11 మందిలో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని కోరారు. ఈ లేఖ వెనుక జనసేన పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అతడు పార్టీ నేతల తరఫున మాట్లాడిన పాపానికి వసంతలక్ష్మిపై వేటుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ ఉనికి కోసం నేతలు పోరాటం చేస్తుంటే.. వారిపైనే వేటు వేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
‘వైఎస్ జగన్ పర్యటనలకే అడ్డంకులు ఎందుకు?’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని భరత్ గుర్తు చేశారు. ఈరోజు(మంగళవారం, జూలై 29) తాడేపల్లి నుంచి ‘సాక్షి’తో మాట్లాడిన మార్గాని భరత్.. ‘ మేము అడ్డంకులు సృష్టిస్తే లోకేష్ పాదయాత్ర చేసేవారా?, జగన్ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుపైకి చంద్రబాబు వెళ్తే ప్రజలు రావడం లేదు. అందుకే జగన్ పర్యటనలపై కక్ష కట్టారు. ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి జగన్ వెళ్తే మీ రూల్స్ ఏంటి?, జగన్ పర్యటనలకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజులు కాదు.. ఇది రాచరికం కాదని ప్రభుత్వం గుర్తు పెట్టకోవాలి రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న అరాచకాలను రాయడానికి ఏ బుక్ సరిపోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. డిజిటల్ లైబ్రరీ తెస్తున్నాం అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నాం. దాడులు వేసిన వారికి అసలు, వడ్డీతో సహా కలిపి ఇస్తాం’ అని మార్గాని భరత్ హెచ్చరించారు. -
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళనగా ఉంది: రోజా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నట్లు కోర్టులో ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్టీఆర్పైనే చెప్పులేసి చావుకు కారణమైన పార్టీ టీడీపీ.జగనన్నపై ఎలాంటి కుట్రలు చేస్తారోనని ఆందోళనగా ఉంది.మా నాయకులు,కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టేవారి వివరాలు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ని రూపొందిస్తున్నాం. అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో చట్టప్రకారం బదులిస్తాం’ అని వ్యాఖ్యానించారు -
వైఎస్ జగన్ సంచలన ప్రకటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్(యాప్) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సోమవారం వైఎస్సార్సీపీ పీఏసీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్లోడ్). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వైఎస్సార్సీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారాయన. చంద్రబాబు ఏదైతే విత్తారో.. అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డి అరెస్ట్ బాధాకరమన్నారు.‘‘మిథున్‌ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‌కు ఏం సంబంధం?. మిథున్ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు...కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్‌రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్ కొడుకు లండన్‌లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు...టోల్గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్ వద్ద తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు..సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు...ఏకంగా సీఐ గన్ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ర్వార్ట్జ్, సిలికా, లెటరైట్ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది..రేషన్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?. ఫీజురియింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్ మెంట్ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి...ఆరోగ్యశ్రీ బిల్స్ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం...ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి...పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్లోడ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు...ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్లోడ్ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి...ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి...పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం...కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్‌కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్‌మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళనవైఎస్ జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్.జగన్ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్‌కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు. -
భద్రత విషయంలో రాజీ వద్దు.. జగన్‌ను కోరిన పీఏసీ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భద్రతపై వైఎస్సార్సీపీ పార్టీ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో పోలీసులు-ప్రభుత్వం రాజీ పడ్డాయనే విషయం స్పష్టమైందని.. ఇక మీదట ఇలాంటి పరిణామాలను ఉపేక్షించడం సరికాదని పలువురు సభ్యులు ఆయనతో అన్నారు.మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలువురు సభ్యులు జగన్ భద్రత అంశాన్ని లేవనెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందన్న పీఏసీ సభ్యులు.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మీ ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మీ పర్యటనలకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ విషయంలో మా అందరికీ చాలా ఆందోళనకరంగా ఉంది. మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. కాబట్టి భద్రత విషయంలో ఇక మీరు ఉపేక్షించడం కరెక్టు కాదు. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు’’ అని వైఎస్ జగన్‌కు పీఏసీ సభ్యులు పలువురు సూచించారు. -
ఆంక్షలతో జననేత జగన్‌ను అడ్డుకోలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్‌ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడంనెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్‌ను అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు. -
ముగిసిన వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో ఏపీ సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించారు. పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక నుంచి ఈ విషయంలో రాజీ పడొద్దని పలువురు సభ్యులు ఆయన్ని కోరారు. అదే సమయంలో.. ఆయన కూటమి పాలనలో నడుస్తున్న కక్షపూరిత రాజకీయాలపైనా మాట్లాడారు. -
మసిపూసి మారేడు కాయ... ఇంకోసారి!
తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణను తూతూ మంత్రంగానే ముగించినట్లు అనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు వేసే విచారణ కమిషన్లలో ఫలితాలు ఇదే తరహాలో ఉంటాయన్న భావన బలపడుతోంది. కమిషన్ నియామకం తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు ఇప్పించేలా జాగ్రత్తపడతారో, లేక మరే కారణమో తెలియదు కానీ నివేదికలు మాత్రం ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య’’ చందంగానే వస్తుంటాయి.తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యమన్న భావన కారణంగా ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏ జాగ్రత్తలు తీసుకునేవారో స్పష్టంగా తెలియదు కానీ గతంలో ఎన్నడూ తొక్కిసలాటలు జరగలేదు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదాలకు కారణమవుతూండటం ఆశ్చర్యకరమైన విషయమే. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలుస్తోందని సీఎం ఆరోపించడం, కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్తీ అయిన నేతితో తయారు చేసిన లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని అనడం తీవ్ర సంచలనమైంది.చిత్రం ఏమిటంటే ఈ నెయ్యి సరఫరా అయింది కూటమి అదికారంలోకి వచ్చిన తర్వాతే. అయినా నెపాన్ని గత వైసీపీ ప్రభుత్వంపై, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నెట్టేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై విచారించిన సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు ఆదేశించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కమిటీని ప్రభావితంగా చేసే విధంగా యత్నించక పోలేదు. అది వేరే సంగతి.అయితే జంతు కొవ్వు కలిసిందన్న పిచ్చి ఆరోపణకు ఆధారాలు కనిపించకపోవడంతో కూటమి నేతలు ఆ ఊసు ఎత్తడం మానేశారు. కల్తీ నెయ్యి అనడం ఆరంభించారు. తెలుగుదేశం మీడియా కూడా అలాగే స్వరం మార్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కొన్నిసార్లు టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి తగిన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెనక్కి పంపుతారు. ఈ సారి కూడా అలాగే జరిగింది. అయినా మ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలేశుడిని కూడా వాడుకునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఆ తరువాత కొంత కాలానికి తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగింది. దానిపై కూడా ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లి టీటీడీ కార్యనిర్వాహణాధికారి శ్యామల రావును, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును బహిరంగంగానే మందలించినట్లు వార్తలు వచ్చాయి. అవి కూడా టీడీపీ మీడియాలోనే ప్రముఖంగా వచ్చాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బోర్డు ఛైర్మన్, ఈవోలు ఈ ఘటనకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత ఒప్పుకోని ఛైర్మన్ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్యనారాయణ మూర్తి కమిషన్ మాత్రం వీరెవరిని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యం.సాధారణంగా ముఖ్యమైన సందర్భాలలో సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సమీక్షలు చేసి నిర్ణయాలు చేస్తుంటారు. భద్రతా చర్యలపై ఆదేశాలు ఇస్తుంటారు. భక్తుల పరంగా చూస్తే వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రముఖమైందే. భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా, సీఎం, మంత్రి సీరియస్‌గా తీసుకోలేదా? బోర్డు చూసుకుంటుందని అనుకున్నారా? అదే టైమ్‌లో బోర్డు తిరుపతిలో టోకెన్లు పంపిణీకి నిర్ణయం తీసుకుని తగు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న అభిప్రాయం ఉంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్ల పర్యవేక్షణ లోపం కూడా ఉందని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొక్కిసలాట ఘటనపై ఇద్దరు టీటీడీ అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు ఎస్పీ, ఆలయ జేఈవోలను బదిలీ చేశారు. కాని అనతికాలంలోనే ఎస్పీకి పోస్టింగ్ ఇచ్చేశారు.న్యాయ విచారణ సంఘం తనకు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారం కేవలం డెయిరీ ఫామ్ అధికారి హరినాథ రెడ్డి క్రైమ్ డీఎస్పీ రమణకుమార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారస్ చేయగా దానిని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్పీతోసహా వివిధ శాఖల అదికారులకు టీటీడీ ఈవో బాధ్యతలు అప్పగించగా, వారెవ్వరి జోలికి వెళ్లకుండా ఇద్దరు అధికారులపైనే క్రిమినల్ చర్య తీసుకోవడం ఏమిటని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ నివేదికను వైసీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులు కాబట్టి, వారిని కాపాడేందుకు నివేదికను నీరు కార్చారని భూమన ఆరోపించారు.ఈ ఘటనలో వాస్తవాలు బయటపడడానికి, నిజమైన బాధ్యులెవరో తేల్చడానికి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. కాని ప్రభుత్వం అందుకు సిద్దపడదు. తొక్కిసలాట ఘటనలో ఎవరి తప్పు ఎంత అన్నది తేల్చాలని చిత్తశుద్దితో ప్రభుత్వం భావించి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని సంస్థతో దర్యాప్తు చేయించి ఉండేది. ఇలాంటి వాటిలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఏదో పెద్ద చర్య తీసుకోబోతున్నట్లు హడావుడి చేస్తారు. ఆ తరువాత ప్రభుత్వానికి లేదా, తనకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయని అనుకుంటే క్రమంగా తీవ్రతను తగ్గిస్తారు. వీలైతే ప్రత్యర్ధులపై దుష్ప్రచారం చేయిస్తారు. తిరుమలకు సంబంధించి కూడా ఆయా ఘటనలల్లో అలాగే చేశారు. ఎక్కడ వీలైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బురద వేయడానికి యత్నించారు. గత టర్మ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు పెద్ద తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు మరణించారు. దానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు సాధారణ భక్తులకు కేటాయించిన ఘట్టంలో స్నానం చేయడం దాన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నియోగించడం, ఆయన ఆ పనిలో ఉన్నప్పుడు భక్తులను గేట్ల వద్దే నిలువరించడం, ఒక్కసారిగా వాటిని తెరవడంతో తొక్కిసలాట దుర్ఘటన చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ సర్కార్ వేసిన కమిషన్ సీఎం సహా ముఖ్యమైన అధికారులెవ్వరిని పెద్దగా తప్పు పట్టలేదు. భక్తులు అధికంగా రావడం, మీడియా విపరీత ప్రచారాలను కారణాలుగా తేల్చి సరిపెట్టేసింది.దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా మాయమైందన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్ దాని జోలికి వెళ్లలేదన్న అభిప్రాయం ఉంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వంటి వారు ఈ కమిషన్ విచారణ తీరును అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించారు. చివరికి అంత పెద్ద ఘటనలో ఒక్కరిపై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. ఇంకో ఉదాహరణ చెప్పాలి. కాపులను బీసీలలో చేర్చే అంశంలో కర్ణాటకకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి మంజునాథ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వివిధ ప్రాంతాల్లో పర్యటించి కాపులతోపాటు, బీసీ వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంది.కమిషన్ ఛైర్మన్ మంజునాథ ప్రభుత్వం అనుకున్నట్లు నివేదిక ఇవ్వబోవడం లేదన్న అనుమానం వచ్చిన చంద్రబాబు సర్కార్ ఆయనతో సంబంధం లేకుండా కమిషన్ సభ్యులతో ఒక నివేదిక ఇప్పించుకుని సభలో పెట్టడం వివాదాస్పమైంది. ఈ మధ్య మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించారు. ఆ ప్రమాదంలో జగన్‌ను కూడా బాధ్యుడిని చేస్తూ కేసు పెట్టింది. జగన్ మానవత్వం లేకుండా వ్యవహరించారని చంద్రబాబు దుష్ప్రచారం కూడా చేశారు.కాని 29 మంది మరణించిన గోదావరి పుష్కరాల దుర్ఘటనలో కాని, ఆరుగురు మరణించిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో కాని కీలకమైన వ్యక్తులు ఎవరిపై కేసులు రాకపోవడం గమనార్హం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీర మహిళ షాక్
సాక్షి, విశాఖపట్నం: ‘జనసేన నేతలకు, కార్యకర్తలకు ఏం పనులు జరగడం లేదు. మీ వెనుక మేమెందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి’ అని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీకీలక నేత, ఎమ్మెల్సీ కె.నాగబాబును నిలదీశారు. ఇదే విషయమై 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త భీశెట్టి గోపీకృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబును నిలదీయగా.. వీరిద్దరినీ తీవ్రంగా అవమానించడం కలకలం రేపింది.ఎమ్మెల్సీ కె.నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ కళ మాట్లాడారు. తమ వెనుక ఉన్న వారికి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. పార్టీ నాయకులు వెంటనే ఆమె మాట్లాడుతున్న మైక్‌ను కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ.. మైక్‌ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులు ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ.. ‘పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయొద్దు. వ్యక్తిగతమైన సమస్యల్ని వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందే’ అని తెగేసి చెప్పడంతో సమావేశానికి హాజరైన నాయకులు షాక్‌కు గురయ్యారు.జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భర్తకూ అవమానం ఇదే సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తల గోడును విన్నవించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేటర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి భర్త గోపీకృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటకు విలువ ఇవ్వడం లేదని గోపీకృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా.. నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పవన్‌ను నమ్మి తన భార్యను కార్పొరేటర్‌గా గెలిపించుకుంటే.. ఇలా అవమానిస్తారా? అని గోపీకృష్ణ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. -
కొలుసుకు భూ గొలుసు
బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్‌లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు! హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలేఅయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్ చిట్ ఫండ్ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్ కొలుసు ప్రసాద్ పేరిట ఏర్పాటైనదే..! కన్స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్ పర్ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లుప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకుతోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎకరాలను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరాలను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.రిలయన్స్ ప్లాంట్‌కు మించి..వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్‌కు కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివెనుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కంపెనీలుపార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్ 13, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ చిరునామాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హరిత పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు నేరుగా కొలుసు పార్థసారథి పేరును సూచించేలా కేపీఆర్ టెలీ ప్రొడక్ట్స్ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీలతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కన్స్ట్రక్షన్, సబ్ స్టేషన్లు, టెలికాం కేబుల్స్ నిర్మాణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?హైదరాబాద్ లులు మాల్‌కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్‌కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ ఔట్ లెట్స్‌లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్‌లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్‌లో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. లులూ హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. -
‘లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?’
తాడేపల్లి : లులూ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి దాగి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో కలిపి రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారాయన. ఈ రోజు(సోమవారం,. జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడియ మల్లాది విష్ణు.. ‘లులూకు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఏ మాల్స్ అయినా సొంంతంగా భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటుంది. కానీ లులూకు మాత్రం చంద్రబాబు వేల కోట్ల భూమిని దోచిపెట్టడం వెనుక కారణం ఏంటి?, అసలు లులూ గ్రూపు మీద చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ ఎందుకు?, లులూ ఛైర్మన్ అలీ.. చంద్రబాబుకు లెటర్ రాయగానే భూకేటాయింపులు ఎలా చేస్తారు?, ఆ సంస్థకు ఇచ్చే భూమి విలువ ఎంత? వారు పెట్టే పెట్టుబడి ఎంత?, విశాఖలో 14 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాని వలన ప్రభుత్వానికి రూ.2,100 కోట్లు నష్టం జరుగుతుంది. అసలు మూడేళ్లపాటు ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని చంద్రబాబు జీవో ఇచ్చారు. లులూకే కాదు, తన బినామీలకు పెద్ద ఎత్తున భూపందేరాలు చేస్తున్నారు. విజయవాడలో కూడా అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాన్ని కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టే లులూకి రూ. 600 కోట్ల విలువైన భూమిని ఎందుకు ఇస్తున్నారు?, విశాఖ, విజయవాడలో కలిపి రూ.3 వేల కోట్ల విలువైన భూమిని అక్రమంగా లులూకి కట్టబెట్టారు. ఈ భూపందేరాల వెనుక భారీ అవినీతి ఉందిఆ మేరకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ భూపందేరం వెనుక లాభపడేది టీడీపీ పెద్దలే. భూపందేరాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత నష్టాల్లోకి నెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. లులూకి కేటాయించిన స్థలాలను వెంటనే రద్దు చేయాలి. మాల్స్ వారే స్వయంగా భూములు కొనుక్కుంటారు. కానీ లులూకి చంద్రబాబు ప్రత్యేకంగా భూపందేరం చేయడం వెనుక కారణమేంటి?’ అని ఆయన నిలదీశారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన..10 మందికే అనుమతి!
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్ జగన్ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్‌లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. అప్పుడు హెలీప్యాడ్‌కు అనుమతి లేదంటూ..జులై 3న వైఎస్ జగన్ చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అడ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు. హెలీప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది. గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్ జగన్ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం పీ-4 పరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరొకవైపు టీచర్లు కూడా పీ-4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, జూలై 28) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా p4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారు. అసలు జీతాలే సరిగ్గా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?, ఎన్నికలలో గెలుపు కోసం సంపద సృష్టిస్తానంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోమనటం అన్యాయం. పారిశ్రామిక వేత్తలు, సంపన్నులతో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడేమో టీచర్లనే తీసుకోమని కలెక్టర్లతో చెప్పిస్తున్నారు. బలవంతంగా దత్తత తీసుకోమని బెదిరించడం అన్యాయం. పరిపాలనా విధానాన్ని సర్వ నాశనం చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది. దేశంలో చాలామంది పన్నులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పన్నులు వసూలు చేస్తే లక్షలమంది పేదల జీవితాల్లో మార్పు తేవచ్చు. పాఠాలు చెప్పాల్సిన మమ్మల్ని p-4 కోసం వాడుకోవటమేంటని టీచర్లు అడుగుతున్నారు. టీచర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగులతో రాజకీయ నాయకుల కాళ్లు పట్టించుకోవడం సిగ్గుచేటు. విరామం లేకుండా డ్యూటీ చేయించటం వలన రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఉద్యోగుల మీద ఒత్తిడి చేసి వారిని వేధించవద్దు’ అని ఆయన సూచించారు. -
చంద్రబాబూ.. అత్త సొమ్ము అల్లుడి దానమా?: శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శోభనాద్రీశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారు.చంద్రబాబు తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంది. విశాఖలో లులు కంపెనీకి కోట్ల రూపాయల స్థలం కట్టబెట్టాడు. గతంలో విజయవాడ స్వరాజ్య మైదానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశాడు. అప్పుడు నేను హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజీవ్ గాంధీ పార్క్‌ను అభివృద్ధి పేరుతో చైనా కంపెనీలకు ఇవ్వాలని చూశాడు. కెనాల్ గెస్ట్ హౌస్ నాలుగు ఎకరాలు టూరిజం పేరుతో గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాడు. 200 కోట్ల రూపాయల స్థలంలో ఆయన హోటల్ కట్టుకున్నాడు.చంద్రబాబు ఎవరి చెవిలో పువ్వులు పెడతాడు. డీమార్ట్, రిలయన్స్‌కి ఎవరైనా గవర్నమెంట్ స్థలం ఇచ్చారా?. విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలం లులుకి ఇవ్వడం అన్యాయం. లులు సంస్థకు స్థలం ధారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉంది. చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నాడు. అమరావతికి 34వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలి. రైతులు, వ్యవసాయం అంటే చంద్రబాబుకు లెక్కలేదు. ప్రస్తుతం చేసిన భూముల కేటాయింపులన్నింటినీ రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
జగన్ ముందే చెప్పాడు!
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే.. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్‌పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది. 'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్‌లో అన్నారు. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు. సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. కాగా మూడు టర్మ్‌లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్‌పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్‌లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మన వాణిని బలంగా వినిపిద్దాం... ప్రజలను చైతన్యపరుద్దాం: సజ్జల
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సజ్జల ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు, కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు. వారి ఫేక్ న్యూస్‌ను బలంగా తిప్పికొడదాంమండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్‌ఫోర్స్‌లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి. ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలిియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.మన నాయకుడు జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాంకూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు. -
‘అవినీతి సొమ్మును దాచేందుకే బాబు సింగపూర్ వెళ్తున్నారు’
విశాఖ: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీ సందర్భంలోనూ సింగపూర్ పర్యటనే ఉంటుందని, అవినీతి సొమ్మును దాచేందుకే ఆయన అక్కడకు తరచు వెళ్తుంటారని మాజీ మంత్రి, వైఎస్సార్సీసీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ రోజు( ఆదివారం, జూలై 27) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడిన అమర్నాథ్.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో రూ. 3 వేల కోట్ల భూములను వాళ్లకు కావాల్సిన వారికి అప్పగించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ‘ ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ గల 60 ఎకరాల భూమి కేటాయించారు. ఆ సంఘటన మరుకముందే మరో 60 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చారు. సత్వ, కపిల్ వంటి వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కారు చౌకగా భూములు అప్పగించారు.. ఈ భూ కేటాయింపులో క్రీడ్ ప్రో కో ఉంది. ఐటీ కంపెనీలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే భూ కేటాయింపులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సింగపూర్ వెళ్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును సింగపూర్ లో దాస్తున్నారు. చంద్రబాబు అవినీతి గురించి కోలా కృష్ణ మోహన్ చెప్పారు. చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అవినీతి కేసులో జైలకు వెళ్లారు. చంద్రబాబు సింగపూర్ ఈశ్వరన్ కవల పిల్లలులా తిరిగేవారు. ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల్లో సింగపూర్ ఒకటి. అటువంటి అవినీతి దేశంలో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు. సంపాదించిన అవినీతి డబ్బు దాచేందుకు చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి పెట్టుబడి తెచ్చారా?, దుబాయ్ శ్రీనులా, సింగపూర్ చంద్రబాబులా పేరును ఆయన సంపాదించుకున్నారు’ అని విమర్శించారు. -
ఎల్లుండి వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 29న వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది.కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడ్డారు.ప్రతి మంగళవారాన్ని అప్పులవారంగా మార్చుకున్న చంద్రబాబు.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.61 శాతం అధికంగా అప్పులు చేశారంటూ దెప్పి పొడిచారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచీ (ఇండికేటర్)లను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, ఒక సవాలుగా నిల్చింది. సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. ఆ దిశగా వ్యయం చేస్తుందో, అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.⇒ కానీ.. కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోంది. మరో వైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.⇒ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే.. మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోందనడానికి నిదర్శనం.⇒ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగ్ విడుదల చేసిన నివేదిక చూపుతోంది.⇒ గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 3.47 శాతం, ఇతర ఆదాయాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14 శాతం వృద్ధి మాత్రమే ఉంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది.