
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.
జెడ్ ప్లస్ భద్రత ఇస్తున్నట్లు కోర్టులో ప్రభుత్వం అబద్ధం చెప్తోంది. జిల్లాలకు వెళ్లినప్పుడు వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్టీఆర్‌పైనే చెప్పులేసి చావుకు కారణమైన పార్టీ టీడీపీ.
జగనన్నపై ఎలాంటి కుట్రలు చేస్తారోనని ఆందోళనగా ఉంది.మా నాయకులు,కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టేవారి వివరాలు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ని రూపొందిస్తున్నాం. అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో చట్టప్రకారం బదులిస్తాం’ అని వ్యాఖ్యానించారు