
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్‌రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్‌రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు.
