
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురు నియమితులయ్యారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు అన్నంరెడ్డి అదీప్ రాజు.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్.. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు పేర్ని కిట్టు.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భూమన అభినయ్ రెడ్డి.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.
