ఎల్లుండి వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం | YSRCP Political Advisory Committee Meeting On July 29 | Sakshi
Sakshi News home page

ఎల్లుండి వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం

Jul 27 2025 1:25 PM | Updated on Jul 27 2025 3:59 PM

YSRCP Political Advisory Committee Meeting On July 29

సాక్షి, తాడేపల్లి: ఈ నెల 29న వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై పీఏసీ చర్చించనుంది.

కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆయన మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement