breaking news
-
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా తగ్గాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో అవినీతి విశృంఖలత్వం వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని మండిపడ్డారు.ప్రతి మంగళవారాన్ని అప్పులవారంగా మార్చుకున్న చంద్రబాబు.. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.61 శాతం అధికంగా అప్పులు చేశారంటూ దెప్పి పొడిచారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన కీలకమైన ఆర్థిక సూచీ (ఇండికేటర్)లను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తగ్గిపోయిన ప్రజల కొనుగోలు శక్తి⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నెలవారీ కీలక ఆర్థిక సూచీల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, ఒక సవాలుగా నిల్చింది. సంక్షేమం, అభివృద్ధి.. రెండింటికి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి.. ఆ దిశగా వ్యయం చేస్తుందో, అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఇది అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.⇒ కానీ.. కూటమి పాలనలో అంతులేని అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోతోంది. మరో వైపు అన్ని రంగాల్లో వృద్ధి పూర్తిగా తిరోగమనం కావడం కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో తొలి మూడు నెలలకు సంబంధించి చూస్తే పన్ను, పన్నేతర ఆదాయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.⇒ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కొన్ని విభాగాల్లో అతి తక్కువ వృద్ధి ఉంటే.. మరికొన్ని విభాగాల్లో వృద్ధి తగ్గింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతోందనడానికి నిదర్శనం.⇒ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయం ఏ స్థాయిలో తగ్గిందనేది ఇప్పుడు కాగ్ విడుదల చేసిన నివేదిక చూపుతోంది.⇒ గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం రాష్ట్ర సొంత ఆదాయంలో కేవలం 3.47 శాతం, ఇతర ఆదాయాలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14 శాతం వృద్ధి మాత్రమే ఉంది. కానీ, ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల కోసం ఆదాయం పెంచుకునే మార్గాలపై కాకుండా, పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. -
‘చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటన.. అసలు ప్లాన్ అదే’
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్‌ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలను తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మంత్రి నారాయణను కూడా వెంట తీసుకువెళుతున్నారని అన్నారు. పైకి మాత్రం సింగపూర్‌తో మైత్రి, పెట్టుబడులు అంటూ కట్టుకథలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియాలో సింగపూర్ భజన మొదలైంది. వైఎస్ జగన్ నిర్వాకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని ఏడుపుగొట్టు వార్త రాసుకొచ్చారు. సొంత అజెండాతో చంద్రబాబు సింగపూర్ వెళ్తుంటే ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పగానే ఆయనకు భజన చేస్తూ ఎల్లో మీడియా అదంతా నిజమేనన్నట్టు హడావుడి మొదలెట్టేశారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన వేరు. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వేరు.సింగపూర్‌తో మైత్రి దెబ్బతిందని ఎవరు చెప్పారు.?వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌కి మైత్రి ఎక్కడ దెబ్బతింది? ఏపీ పౌరులు సింగపూర్ వెళ్లడం లేదా? సింగపూర్ నుంచి ఏపీకి రాకపోకలు జరగడం లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? అసలు సంబంధాలు దెబ్బతినడానికి జగన్‌కి ఏంటి సంబంధం? ఆ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? ఆయనేమన్నా దేశానికి ప్రధానమంత్రా, దేశ విదేశాంగమంత్రా?. భారత దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో ఏం పని?కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్తోనే నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అలాంటప్పుడు సింగపూర్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు బాధపడుతుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్ వెళ్లడానికి ఇదేనా సమయం.? వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఖరీఫ్ సీజన్‌కి సన్నద్ధమవుతుంటే, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కల్పించాల్సిన బాధ్యతలను పర్యవేక్షించకుండా చంద్రబాబు రెండు డజన్ల బృందంతో సింగపూర్ పర్యటకు వెళ్లడం ఏంటి.? రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా?సింగపూర్ ప్రభుత్వం పేరు చెప్పి కన్సార్సింతో ఒప్పందాలుచంద్రబాబు, సింగపూర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలంటూ ఇవే ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు. కానీ జీవోలు రిలీజ్ అయ్యాక చూస్తే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు చేసిన ప్రచారం పెద్ద బూటకమని తేలిపోయింది.అసెండాస్ సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్సియంతో ఒప్పందాలు చేసుకుని నేరుగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అనేలా ప్రజల్ని భ్రమింపజేశారు. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చినట్టు మొదట ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత సూర్జానా జురాంగ్ అనే కంపెనీకి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యత ఇచ్చినట్టు జీవోలు ఇచ్చి, ఆ పని పూర్తి చేసినందుకు రూ.28.96 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో నేరుగా పనులు అప్పగించి బిల్లులు చెల్లించడాన్ని 2023లో కేంద్ర ఆధీనంలో ఉన్న కాగ్ తీవ్రంగా వ్యతిరేకించింది.స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్ల కుంభకోణంరాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు కేటాయించకుండా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. వీటిలో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే. కానీ కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది.ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ‘ఫార్ములా-1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. ఏడాది పాటు జైలు జీవితం అనుభవించి గత నెల జూన్ 5న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.అమరావతి భూములతో జేబులు నింపుకునే ప్లాన్అమరావతిలో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడమే ఆ సంస్థల ప్లాన్. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.కుంభకోణం బయటపడిపోతుందనే భయంతో..2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించిన సింగపూర్ సంస్థల కన్సార్షియం 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికా? పెట్టుబడులు పెట్టడానికా అనేది స్పష్టం చేయాలి?. జైలు నుంచి విడుదలైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను కలవడానికి వెళ్తున్నారా లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి అన్నట్టు గ్యాస్ కొట్టడం ఆపాలి. అసత్య కథనాలు రాసేముందు పాఠకులు చీకొడతారేమోనన్న విచక్షణతో ఎల్లో మీడియా పనిచేయాలి. -
‘ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని సిట్ సేకరించలేదు’
తాడేపల్లి : లేని మద్యం కేసుని సృష్టించి సిట్ అధికారులు వేధింపులకు దిగారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. ఆ కేసులో ఇప్పటివరకూ సిట్ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈరోజు(శనివారం, జూలై 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్ సుధాకర్ బాబు.. ‘ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న సమయంలో మళ్ళీ సోదాలు అంటూ డ్రామా చేస్తోంది. అరెస్టు సమయంలో 8 గంటల పాటు సోదాలు, విచారణ చేసిన సిట్ అధికారులు మళ్ళీ సోదాలు చేయటమంటే ఇది కుట్ర కాక మరేంటి?, బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్‌కు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ని అక్రమ కేసులో ఇరికించారు. ఇలాగైతే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు?, గౌరవ కుటుంబం నుండి వచ్చిన బాలాజీ గోవిందప్పని వేధించటం ద్వారా ఏం సాధించదలచుకున్నారు?, పోలీసు వ్యవస్థని పూర్తిగా తన సొంతం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బాలాజీ గోవిందప్పని ఇప్పటికే 75 రోజుల నుండి జైల్లో పెట్టారు. పారిశ్రామిక వేత్తలపై దాడులు చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ కొనసాగాలన్నా బెదిరించి కప్పం వసూలు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశ్రమలను ఎలా బెదిరిస్తున్నారో అందరికీ తెలుసు. వీరి దెబ్బకు తట్టుకోలేక పరిశ్రమలు పరారవుతున్నాయి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?, నియోజకవర్గంలో నుండి గ్రానైట్ వాహనాలు వెళ్తుంటే వాటిని ఆపి కమీషన్లు లాక్కుంటున్నారు. మద్యం కేసులో సిట్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. జగన్ అత్యంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశారు’ అని స్పష్టం చేశారు. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
సాక్షి, తాడేపల్లి: కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కరేడులో భూసేకరణ గ్రామ సభలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భూసేకరణ పేరుతో మళ్ళీ హడావుడి చేస్తున్నారు. గ్రామంలోని ఎస్టీలను భయపెట్టి భూసేకరణ చేయాలని చూస్తున్నారు. గత భూసేకరణ గ్రామ సభలో అభ్యంతరం తెలిపిన ఒక మహిళ మీద అక్రమంగా కేసులు పెట్టించారుఈ కేసులో ముగ్గురు ఎస్టీ మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా?. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి. ప్రజల అనుమతి లేకుండా భూసేకరణ చేస్తామంటే కుదరదు. బలవంతపు భూసేకరణ, అర్థరాత్రి ఎస్టీ మహిళలను అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్టీ, సేల్స్ టాక్స్ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్‌ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం. -
వివాదంలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. వసుంధరకు నిరసన సెగ!
సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాదంలో బాలకృష్ణ..మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ షాక్
సాక్షి, ఏలూరు జిల్లా: వైయస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన దెందలూరు ఎమ్మెల్యేకి బిగ్ షాక్ తగిలింది. వైయస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన ఏలూరు కోర్టు.. విడుదలకు ఆదేశాలిచ్చింది. వైయస్సార్సీపీ నేతలపై వేధింపులకు దిగిన కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని జైలుకు పంపుతానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కామిరెడ్డి నానితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరులు తేజ, ప్రదీప్‌లను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేసిన రూరల్ పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. అయితే వీళ్లను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేకపోయారు. దీంతో నిన్నంతా ఏలూరులో హైటెన్షన్ నెలకొంది. అయితే.. బెయిల్ మీద వ్యక్తిగత పూచీపై వీళ్ల విడుదలకు ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. అదే సమయంలో.. సిద్ధం సభ కేసు అంటూ పేర్కొనడాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించినందుకుగానూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రామకృష్ణకు మెమో జారీ చేసింది. సమన్లు ఇచ్చాకే కోర్టులో హాజరుపర్చాలని తీర్పు ఇచ్చింది. చింతమనేని సవాల్ నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగిందనే చర్చ జోరుగా నియోజకవర్గంలో నడుస్తోంది. -
పవన్.. దాడులు చేస్తే అది సివిలైజేషనా?
సాక్షి, తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. “సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్‌కళ్యాణ్ ప్రజలను, వారి సైనికులను రెచ్చగొట్టడం దారుణమన్నారు. అదే రకమైన ప్రవర్తన జనసైనికులకూ వచ్చిందన్నారు.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి, పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగులగొట్టి.. టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధమైన ప్రవర్తనతో వీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. -
టీడీపీ ఎమ్మెల్యే థామస్‌కు బిగ్ షాక్
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్‌పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.థామస్ పీఏ చంద్రశేఖర్‌ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. -
సింగపూర్‌లో చంద్రబాబుకు ఏం పని?: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది బ్రెయిన్ లెస్ గవర్నమెంట్ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వారి కష్టాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎగ్గొట్టి సింగపూర్ ట్రిప్పులు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు సింగపూర్‌ని మరిచిపోలేకపోతున్నారు. ఆయనకు, అసెండాస్‌తో ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టాలి?. నారా లోకేష్ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారు. గత ఆరు త్రైమాసికాలుగా రూ.4,200 కోట్లు బకాయిపడ్డారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థులు గొప్ప చదువులు చదవడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా రంగానికి వేల కోట్లు ఖర్చు చేసి సంస్కరణలు తెచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేసింది.‘‘ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టటానికి రకరకాల కొర్రీలు పెట్టారు. లోకల్, నాన్ లోకల్ అంటూ కొత్త కొర్రీలు పెట్టారు. చదువుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తే నాన్‌లోకల్ అంటారా?. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?. జులై 10 నాటికి విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు’’ అంటూ శైలజానాథ్ దుయ్యబట్టారు. -
ఆ మాట జేసీ భార్య ఉమక్క చెబితే క్షమాపణలు చెబుతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన. సాక్షి, అనంతపురం: తాడిపత్రి రాజకీయ రగడపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టినవి తప్పుడు కేసులు కావని, అందుకు దగిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏఏ కేసులు ఉన్నాయో అందరూ ఆలోచించాలి. సుప్రీం కోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వ్యవహారం లోనే సుమారు వందకు పైగా కేసులు జేసీ పై నమోదయ్యాయి. జేసీ ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేష్ కూడా గ్రహించాలి. ఈ ఫోర్జరీ కేసులను రద్దు చేయించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎత్తుగడ వేస్తున్నారు. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదు. నేను దూషించినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమక్క చెబితే.. క్షమాపణలు చెబుతా. నా కోడలు తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం?. తాడిపత్రి ఏఎస్పీ, అనంతపురం డీపీఓలను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించటం దుర్మార్గం. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అవినీతి పరుడు అంటూ జేసీ విమర్శలు చేశారు. అవినీతి డబ్బు మీ ఇంటికి చేరింది కనుకే తాడిపత్రి లో ధర్నా విరమించుకున్నారా? అని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. -
నవ్వినా.. చప్పట్లు కొట్టినా కేసులు పెట్టడం హాస్యాస్పదం
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవని వైఎస్సార్సీపీ నేత, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంటున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విమర్శించారన్న కేసులో నోటీసులు అందుకున్న ఆయన.. పోలీసు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితె జైళ్లు, కోర్టులు సరిపోవు. ఈ కేసుకు సంబందించి 40 ప్రశ్నలు అడిగారు.. దానికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు.. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు.. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతాం అనేది మంచి సంప్రదాయం కాదు అని ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు.శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. మూడుగంటలపాటు ఆయన విచారణ జరిగింది. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుకు షూరిటీస్ను తన న్యాయవాది ద్వారా సమర్పించారు. -
లోకేశ్, బీటెక్ రవికి ఇదే నా హెచ్చరిక: సతీష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: ఏపీలో మంత్రి నారా లోకేశ్‌కు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీటెక్ రవి, వాసును లోకేశ్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు. విష సంస్కృతికి తెరతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందులలో భౌతిక దాడులు చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నీ అమలు చేశామని ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సూపర్ సిక్స్ మా ప్రథమ ప్రాధాన్యం అన్నారు.. ఇప్పుడు అన్నీ అమలు చేశాం అంటున్నారు. పథకాల గురించి మాట్లాడితే చంద్రబాబు.. వారి నాలుక మందం అంటున్నాడు. అచ్చెన్నాయుడు అయితే అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నాడు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు మీరు ఇచ్చారా?. 50 ఏళ్లు దాటిన మహిళకు పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. మీరు ఇచ్చిన సిలిండర్లు ఎంత మందికి చేరాయి అనేది గ్రామాలకు వెళ్ళి అడుగుదాం రండి. మేము ప్రశ్నించడం మొదలు పెట్టే సరికి తల్లికి వందనం అన్నారు.. అది కూడా అందరికీ రావడం లేదు. ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల కష్టాలపై పోరాడటమే. లిక్కర్ స్కాం ఇప్పుడు జరుగుతోంది..నువ్వు ఇవన్నీ అమలు చేయకుండా మాపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు. లక్ష కోట్లు అన్న లిక్కర్ కేసు చివరికి ఎన్ని కోట్లకు వచ్చింది. అసలు ఆధారాలు లేకుండా ఒక కట్టు కథ అల్లి కేసులు కట్టారు. జూన్ 12న మీరు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పాత లిక్కర్ పాలసీ 6 నెలల కొనసాగింది. మరి ఆరు నెలల్లో మీకు ఎన్ని వేల కోట్లు వచ్చాయి?. వాటిని పత్రికలు అనాలో.. ఇంకా ఏం అనాలో అర్థం కావడం లేదు. అన్నీ కలిపి జగన్ ఇంటికి ఆ డబ్బంతా వెళ్ళింది అంటారు. మరి ఈ ఆరు నెలల్లో డబ్బు మీ ఇళ్లకు చేరిందా?. ప్రభుత్వ అధీనంలో మద్యం అమ్మకాలు జరిగితే ఇక ఏ విధంగా స్కాం జరుగుతుంది?.స్కాం జరిగింది అప్పు డు కాదు.. ఇప్పుడు జరిగేది స్కాం. ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు అదనంగా అమ్ముకున్నావు. దాని వల్ల 10వేల కోట్ల నష్టం ప్రభుత్వానికి వాటిల్లుతోంది. జగన్ బ్రాండ్స్ అన్నావు.. అవన్నీ నీ హయాంలోనే అనుమతులు ఇచ్చావు. మీరు ఇచ్చిన అనుమతులు.. మా బ్రాండ్లు ఎలా అవుతాయి?. జగన్‌పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. నువ్వు చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. నేను మాట్లాడుతుంటే భరించలేక తప్పుడు కేసులు, ఇష్టారీతిన మాటలు మాట్లాడుతున్నారు.లోకేశ్, బీటెక్ రవికి వార్నింగ్.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీటెక్ రవి.. లోకేశ్ గురించి మాట్లాడకూడదు అంటున్నారు. లోకేష్ భరించలేక వీళ్లతో నన్ను విమర్శించాలని ఆదేశాలు ఇస్తున్నాడు. మీ పార్టీకి లోకేష్ యువరాజు కావచ్చు.. అయితే నాకేంటి?. నా ధర్మంతో నేను ప్రవర్తిస్తున్నా.. నేను ఎందుకు టీడీపీకి ఎందుకు రాజీనామా చేసాను అనేది వాళ్లకి తెలుసు. నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది?. మొన్నటికి మొన్న రమేష్ రెడ్డి ఇంటిపై మంత్రి స్థాయి వ్యక్తి తాగుబోతులతో దాడి చేయిస్తాడా. బీటెక్ రవి.. నువ్వు బయటపెడితే.. నేను భయపడతానా?. నువ్వు ఏ రకమైన బాషా మాట్లాడతావో నా నుంచి సమాధానం అదే భాషలో ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించిన వారంతా అధికారం కోల్పోయాక ఎక్కడికి వెళ్లారో గుర్తు చేసుకోండి.ఈరోజు మా వెనుక పోలీసులు లేకపోవచ్చు.. నువ్వు ఏదైనా చేస్తే భవిష్యత్తులో అనుభవిస్తారు. లోకేష్.. కడపలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావ్.. ఇక్కడ ఎవరు భయపడరు. చావే నా దగ్గరకు వస్తే.. నా మీసంపై నా చేయి ఉంటుంది. తమాషాలు పడుతున్నావా లోకేష్.. ఇక్కడ మీ వాళ్లని భౌతికంగా దాడి చేయమంటావా?. ఏం చేస్తావో చెయ్.. నేను సిద్ధంగా ఉన్నాను. బైరటీస్ మైనింగ్ పెద్ద కుంభకోణం జరిగిందని మీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. దమ్ముంటే దానిపై మాట్లాడండి. నాకు డంకీలు ఇవ్వడం కాదు.. జిల్లాకు ఏం కావాలో మీ నాయకులను అడగండి. ఈ ఏడాది కాలంలో జిల్లాకు ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రూపాయి ఇచ్చే దిక్కు లేదు కానీ.. బనకచర్ల చేస్తాడట అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఏలూరులో టెన్షన్.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఏలూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులే టార్గెట్‌గా అక్రమ కేసులు నమోదు చేస్తూ.. అరెస్ట్‌లు జరుగుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్‌ని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో వారిని అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదు. అనంతరం, వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు.ఇక, గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని కచ్చితంగా జైలుకు పంపుతానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నానిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంత మందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు. -
అబ్బా.. ఓపెనైపోయాడు.. సినిమా ఫ్లాప్ అని ఒప్పేసుకున్నాడు
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కార్యకర్తలని.. ఫ్యాన్సును రెచ్చగొట్టి నానాయాతన పడి రిలీజ్ చేయించుకున్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని విషయాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజు ఒప్పేసుకోవాల్సి వచ్చింది.సినిమాను సినిమాగా కాకుండా దానికి పొలిటికల్ ఫ్లేవర్ అద్ది.. రాజకీయంగా సైతం లబ్ధి పొందాలని భావించిన పవన్ కళ్యాణ్ వీరమల్లు చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలోని ఎంతోమంది టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడం జరిగింది. వాస్తవానికి సినిమా బాగుంటే ఎవరూ పాజిటివ్‌గా ప్రచారం చేయక్కర్లేదు... బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు థియేటర్‌కు వెళ్ళేది లేదు. ఈ విషయం ఎన్నో మార్లు స్పష్టమైనది. అయినా సరే పవన్ కళ్యాణ్ తనకు తాను ఓ దైవంశ సంభూతుడుగా భావించుకుంటూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేన కుర్రాల్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు. మొదటి రోజు కేవలం ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు మాత్రం థియేటర్లో గందరగోళం సృష్టించి చెలరేగిపోయారు..తీరా సాయంత్రానికి రకరకాల వెబ్సైట్లు సోషల్ మీడియా చానెళ్లలో రివ్యూలతోబాటు చూసినవాళ్లు చెప్పిన మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండోరోజుకు అసలు రంగు బయటపడింది.సినిమా బాలేదు.. నాసిరకంగా ఉంది.. అవాస్తవాలను చరిత్రగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది అనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఇక సినిమా ఫ్లాప్ అంట కదా మరి వెళ్లొద్దులే అని జనం వెనుకడుగు వేశారు. మూడో రోజుకు థియేటర్లు మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు వాస్తవం బాధపడింది. సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక కార్యకర్తలను రెచ్చగొట్టే డైలాగులు చెబుతున్నారు.సినిమాను నెగిటీవ్‌గా ప్రచారం చేయాలనుకుంటున్న వారికి అక్కడికక్కడే సమాధానం చెప్పండి.. మెతకగా ఉండకండి... వీరత్వం చూపండి రెచ్చిపోండి అంటూ కార్యకర్తలను ఫాన్సను రెచ్చగొడుతున్నారు. ఆ సినిమాను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది బ్యాన్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా దాని ప్రభావం కూడా ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. కానీ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు.సినిమా జయాపజయాలు గురించి తాను పట్టించుకోనని చెబుతూ వేదాంతం చెబుతున్నారు. జీవితాలను ఆనందంగా తీసుకోవాలని అన్నారు. బంధాలు..బాంధవ్యాలు ముఖ్యం అని ఏదేదో మాట్లాడుతున్నారు. రిలీజుకు ముందు బిల్డప్పులు కొట్టిన పవన్ రిలీజ్ తరువాత నీరసం వచ్చి వాయిస్‌లో తేడా వచ్చేసింది. తాను పేద కుటుంబములో పుట్టానని.. హీరో అయ్యానని..రాజకీయ పార్టీ పెట్టానని.. గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకుని గాంభీర్యం చూపుతున్నారు.రిలీజ్‌కు ముందు మీసం మెలేసిన పవన్ ఇప్పుడు మొత్తం సాఫ్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో బాబుకు బాగానే గుణమర్ధన అయిందని జనం భావిస్తున్నారు.*సిమ్మాదిరప్పన్న -
పవన్.. పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేసినట్టేనా?
సినిమా ప్రచారం కోసమో.. వైఎస్సార్సీపీపై ఉన్న అక్కసో తెలియదు కానీ.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రకటన ఆయనలోని లోపలి మనిషిని బయటపెట్టినట్లు అయ్యింది. ‘‘కోసేస్తాం.. నరికేస్తాం.. అంటే చేతులు కట్టుకుని కూర్చోం’’ అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేకంగా టీడీపీ మురికి మీడియా ఈ వ్యాఖ్యలను బాగా హైలైట్ చేసింది. ‘‘వైఎస్సార్సీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరిక్కడ’’ అనడంతోపాటు పవన్ ఇంకా చాలా మాటలన్నట్లు తెలుస్తోంది.తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత తన పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం పెట్టి సినిమా సంగతులతో పాటు వైఎస్సార్సీపీపై విమర్శలు కూడా చేశారు. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెబుతూనే ఆయన వైఎస్సార్సీపీని విమర్శించడం ద్వారా సినీ నిర్మాతకు మేలు చేయదలిచారా? లేక కీడు జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా!. అసలు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రస్తావన తేవలసిన అవసరం ఏంటి?. టీడీపీ, సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌ల వారి మెప్పుదల కోసం కాకపోతే? హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంపునకు సీఎం అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో మేనేజ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఆక్షేపణ లేదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం అసెంబ్లీలో ఇకపై సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని గంభీరంగా ప్రకటించినా, పవన్ కళ్యాణ్ కోసం మాట తప్పడం విశేషం. ఈ వ్యవహారంలో పవన్.. వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి వారిని బెదిరించాల్సిన అవసరం ఏంటి?. నిజానికి పవన్ కళ్యాణ్ ఏడాదికాలంగా ఒకటి, రెండుసార్లు తప్ప ఏపీలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా ప్రశ్నించడం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబుతో కలిసి సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఎన్నికల ప్రణాళిక అంటూ ప్రజాగళం పేరుతో బోలెడన్ని హామీలు ఇచ్చారు. ఏనాడైనా తన పార్టీ వారితో కలిసి వీటిని సమీక్షించారా?. సూపర్ సిక్స్ హామీలు అన్నిటిని ఎందుకు అమలు చేయలేక పోతున్నామని చంద్రబాబును ప్రశ్నించారా?.ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తే ఏపీని అమ్ముకోవల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో పవన్ ఏకీభవిస్తారా?. అది మోసం చేయడం అవుతుందా? కాదా?. కూటమి హామీలకు తనది గ్యారంటీ అని ఆ రోజుల్లో పవన్ ప్రకటించారా? లేదా?. దీనిపై ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడం లేదు?. పోనీ, తన పార్టీ వారి గురించైనా ఆలోచిస్తున్నారా!. శ్రీకాళహస్తిలో జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కోట వినూత దంపతులు పార్టీ కార్యకర్త రాయుడును దారుణంగా హత్య చేస్తే పవన్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై వినూత భర్త చేసిన ఆరోపణ ఏంటి?. వినూత వ్యక్తిగత వీడియోలు తీయించడానికి రాయుడును ఆయన మనుషులు ప్రయోగించారన్న విమర్శ మాటేమిటి?. అది అసలు పవన్ దృష్టిలో సమస్యే కాదా?. వైఎస్సార్సీపీ వారు కోసేస్తాం.. అని అన్నారట. అది అవాస్తవం అని తెలిసినా ఎందుకు పవన్ అలా మాట్లాడుతున్నారు.మరి శ్రీకాళహస్తిలో తన పార్టీవారే ఒక సామాన్య కార్యకర్తను నరికేశారే! సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే మహిళలపై కొన్ని అఘాయిత్యాలు జరిగినట్లు, దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లు కథనాలు వచ్చాయే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా కారణం ఏమిటో తెలుసుకుని వారికి న్యాయం చేయాలి కదా!. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిని బెదిరించడం ఏంటి?. ఇప్పటికే ఎర్ర బుక్కు పేరుతో వందలాది మంది వైఎస్సార్సీపీ వారిపై కేసులు పెడుతున్నారు కదా!. ఇది పవన్ కళ్యాణ్‌కు సరిపోవడం లేదా!. పోనీ శాఖాపరంగా ఎంత బాగా పని చేస్తున్నది ఆయనకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకే తెలియ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారిపైన బహిరంగంగానే దూషణల పర్వానికి దిగితే ఆ శాఖ మంత్రిగా పవన్ ఏం చేశారు?. చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేక ఏమైనా చర్య తీసుకోగలిగారా? ప్రభాకర్ రెడ్డే ఒక ఏఎస్పీపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అదేమి పద్దతి అని అయినా పవన్ అడగగలిగారా?. ముందు తను సమర్థంగా పని చేస్తున్నట్లు రుజువు చేసుకుని అప్పుడు ఇతరులపై విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది.టీడీపీ సేవలోనే పవన్ తరిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఇప్పటికే భావిస్తున్నారట. దాని గురించి ఆలోచిస్తున్నారా! సినిమాలు చేస్తున్నారని విమర్శిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలలో నటించినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తనను ఎవరూ ఏమీ అనకూడదని భావిస్తే కుదురుతుందా! సినిమాలు మీ ఇష్టం. కానీ, ప్రజలకు అత్యవసరమైన పంచాయతీ రాజ్ శాఖకు బాధ్యత వహిస్తున్న సంగతి మర్చిపోకూడదు. వేల సంఖ్యలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉంటున్నాయన్న విమర్శలకు ఆస్కారం ఇవ్వకూడదు. దానిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? వాళ్లలా తనకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవని పవన్ అంటున్నారు.వైఎస్సార్సీపీ వారిపై విమర్శలు చేయబోయి పవన్ కళ్యాణ్ టీడీపీ వారిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పుపట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలకు ఆయా వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భజన చేసే మురికి మీడియా బోలెడంత ఉండగా సొంత మీడియా అవసరం పవన్‌కు ఏం ఉంటుంది!. ఇవేవీ జనానికి తెలియదన్నట్లుగా పవన్ అమాయకంగా మాట్లాడితే సరిపోతుందా!. సినిమా టిక్కెట్ల ధరల పెంపు గురించి కూడా గత ప్రభుత్వంపై చేసిన విమర్శలు అర్థ రహితంగా ఉన్నాయి. పైగా జనం అంతా టిక్కెట్ల రేట్లు పెంచాలని అడుగుతున్నారట. ఇంతకన్నా అబద్దం ఏం ఉంటుంది?.పవన్‌కు అధికారం ఉంది కనుక టిక్కెట్ల రేట్లు పెంచుకుంటే పెంచుకోవచ్చు. కానీ మధ్యలో వైఎస్సార్సీపీపై ఆరోపణ చేయడం ఏమిటి? గత ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి ఒక విధానం ప్రకటించింది. దాని ప్రకారం ఏపీలో కూడా నిర్దిష్ట శాతం షూటింగ్ చేయాలని కోరింది. అదీ తప్పేనా? అవును! తమకు మద్దతు ఇస్తున్న ఈనాడు మీడియా గ్రూప్‌నకు చెందిన రామోజీ ఫిలిం సిటీకి ఎక్కడ నష్టం వస్తుందని అనుకున్నారో, లేక ఇంకే కారణమో కాని, ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి కూటమి ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదు. దాని గురించి నేరుగా మాట్లాడకుండా సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలనవసరం లేదని, తొలుత మౌలిక వసతులు అభివృద్ది చెందాలని అంటే ప్రయోజనం ఏమిటి?.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విశాఖలో సినీ స్టూడియోలు, ఇతర వసతులు కల్పించడానికి చేసిన కృషి గురించి విస్మరిస్తున్నారు. తనకు పదవి ఉంటే చాలు.. తన సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే చాలు.. అంతా బాగున్నట్లుగా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని పవన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గురివింద గింజ సామెత మాదిరి వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఎల్లకాలం అది సాధ్యమవుతుందా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గిరిజనుల ఆగ్రహం
సాక్షి,అల్లూరి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుర్రాలపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది పవన్ ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన సమయంలో ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన హామీ నీటిమీద రాతలు మిగిలాయి.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా.. రోడ్ల పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అసల వర్షా కాలం కావడంతో నానా అగచాట్లు పడుతున్న గిరిజనులు పవన్ తీరును ప్రశ్నించారు. నిరసనకు దిగారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రోడ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
అక్రమ మైనింగ్‌పై బాంబు పేల్చిన టీడీపీ ఎమ్మెల్సీ.. బాబుకు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బాంబు పేల్చారు. ‘అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అపారమైన బెరైటీస్ ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేవు, రాయల్టీ లేదు, అక్రమార్జనతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా లభిస్తోంది. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వాడుతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి గురువారం ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే.. ‘వేముల మండలం గొందిపల్లెలో సర్వే నంబర్ 275లోని 705.43 ఎకరాల్లో కృష్ణప్ప ఆజ్బెస్టాస్ అండ్ బెరైటీస్ కంపెనీకి గతంలో అనుమతులుండేవి. ప్రస్తుతం లీజు అనుమతులకు రెన్యువల్స్ లేకపోగా, రూ.6కోట్లు బకాయిలున్నాయి. అయినప్పటికీ కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం 100 టన్నులు ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. టన్ను రూ.35వేలు చొప్పున కడపలో ఉన్న పల్వరైజింగ్ మిల్స్‌కు విక్రయిస్తున్నారు. దీనిపై హక్కుదారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. వెల్ మైనింగ్‌లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇదివరకూ అక్రమ మైనింగ్‌లో అయ్యవారిపల్లెకు చెందిన రామచంద్ర మృతి చెందాడు. కలసపాడు వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్ కారణంగా గతంలో 10మంది కార్మికులు చనిపోయారు. విరివిగా దొరుకుతున్న జిలెటిన్ స్టిక్స్ వాడుకొని వి.కొత్తపల్లె గ్రామంలో నరసింహులును పేల్చి చంపారు’ అని వివరించారు.ఓ వైపు అక్రమ మైనింగ్, మరోవైపు దోపిడీ..‘వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహణే కాకుండా టిఫెన్ కంపెనీకు చెందిన రూ.10 కోట్లు విలువైన ఖనిజాన్ని దోపిడీ చేశారు. టిఫెన్ కంపెనీ ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు, ఇతర సంస్థలకు రూ.కోట్లలో బకాయి పడింది. దాంతో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్వాధీనం చేసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నిల్వ ఉన్న ఖనిజాన్ని ఎన్సీఎల్టీ వేలం వేయగా, ఎంబసీ గ్రూపు కొనుగోలు చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ చేశారు. గూగుల్ చిత్రాలను పరిశీలిస్తే దోపిడీ స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు
ఊసరవెల్లిని మించి పవన్ కల్యాణ్ రంగులు మార్చేస్తున్నారు. ‘‘జనసేనాని రూల్స్ మాట్లాడతారు.. కానీ పాటించరు.. నీతులు చెబుతారు.. కానీ ఆచరించరు. టిక్కెట్ రేట్లు పెంచుకుంటానికే డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్’’ అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అప్పుడు ‘పుష్ప’ సినిమా సమయంలో ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి టికెట్ల ధరలు పెంచుకోవాలన్న పవన్.. ఇప్పుడు తన ‘వీర మల్లు’కు మాత్రం.. నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచ్చేస్తారా?.. ఇదేనా మీరు చెప్పిన ‘‘నీకో చట్టం.. నాకో చట్టం" డైలాగ్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.మే 27న అధికారికంగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అంటూ ఓ ట్వీట్ చేశారు. నా సినిమా అయిన సరే టికెట్ల ధరలు పెంపు కావాలంటే.. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధర పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సంప్రదింపులు చేయాలని.. ఇందులో తన, మన బేధాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు..అయితే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. హరిహర వీరమల్లు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కేవలం మూవీ నిర్మాత రిక్వెస్ట్‌కు స్పందించిన చంద్రబాబు సర్కార్.. టికెట్ల రేటు పెంచుకోమంటూ పర్మిషన్ ఇచ్చేసింది. తన సినిమా రేట్లు పెంచుకుని డిప్యూటీ సీఎం సంతోష పడిపోయారు.పుష్ప సినిమా అప్పుడు : ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి రేట్స్ పెంచుకోవాలి మీ వీర మల్లు అప్పుడు : నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచేస్తారా @PawanKalyan ఇదేనా మీరు చెప్పిన " నీకో చట్టం నాకో చట్టం " డైలాగ్ 💦 pic.twitter.com/dAzZbDCouZ— Rohit_Ysrcp (@Rohit_Ysrcp) July 24, 2025కాగా, గతంలో కూడా పవన్ కల్యాణ్ ఒక మాట అన్నారు.. ఒకరు కూడా వచ్చి చంద్రబాబును కలవలేదని.. లేఖ రాస్తూ.. ఇకపై సినిమా రేట్ల టికెట్లకు సంబంధించి ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ సెలవిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఎంతమంది ప్రతినిధులు వచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
సాక్షి,కర్నూలు: మంత్రి టీజీ భరత్ ఇలాకాలో కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సత్తా చాటారు. దీంతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.నేడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి పోటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలే ఏక గ్రీవమయ్యారు. ఓటమి భయంతో టీడీపీ కార్పోరేటర్లు పోటీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాని రెండవసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబూ.. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఏది?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 2019-24 వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రలను పోల్చి చూశాయని జూపూడి తెలిపారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు.ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని.. వైఎస్సార్సీపీ ప్రజలతో కలిసి కూటమి హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే దాన్ని భరించలేక చంద్రబాబు తనకలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌లను బయటకు తీసి వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ ప్రజల పక్షానా నిలబడుతుందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హామీల కోసం నిలదీస్తే కూటమికి ఊపిరాడడం లేదు:వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. రూ.2.75 లక్షల కోట్లను పార్టీలు, కులాలు, మతాలకతీతంగా లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా.. డీబీటీ రూపంలో సంక్షేమం అందించారు. దేశంలోనే ఈ విధానం ఒక సందేశంగా మిగిలింది. ఇప్పుడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అయిన తర్వాత తాము ఎక్కడ, ఎందుకు, ఎలా మోసపోయామన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.ఈ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే.. ఎన్ని నిర్భంధాలున్నా ప్రజల తరపున ప్రజల్లోకి వైఎస్ జగన్ మాత్రమే వెళ్తున్నారు. ఆయన ప్రజల కోసం వెళ్లిన ప్రతిసారి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అయితే కూటమి పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రజల తరపున వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఒక ప్రణాళిక ఇచ్చి.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు వస్తాయి.. వాటి అమలు కోసం ప్రజలు నిలదీయండి అని చెప్పింది. దీంతో ప్రజలు టీడీపీని, కూటమి పార్టీలని నిలదీస్తుంటే... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఊపిరి ఆడటం లేదు. ఈ సందర్భంలో తాను పరిపాలన చేయలేనని.. అవసరమైతే ధర్నాలు చేస్తానంటూ కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ చేతులెత్తేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు.సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్:ఈ నేపథ్యంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి పార్టీలు పారిపోతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం 'డైవర్షన్ పాలిటిక్స్' మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌ని తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీ వల్ల ఖజానాకి రూ.3,500 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు.కానీ వాస్తవానికి ఖజానాకి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కూటమి 14 నెలల పాలనలో లిక్కర్ పాలసీలో అంతా దోపిడీ మయంగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్ద సంఖ్యలో యూట్యూబ్ చానెల్స్ ఓపెన్ చేశారు. డబ్బులిచ్చి ప్రపంచంలో వివిధ దేశాల నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఒక వైపు మద్యం కేసు పేరుతో వరుస అరెస్టులు చేస్తున్నారు. ఇంకో వైపు పెయిడ్ ఆర్టిస్టులతో వైఎస్ జగన్ హయాంలో మద్యం తాగి 30,000 మంది చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గతంలో వాళ్ల హయాంలో మద్యపానం వల్ల ఒక్కరూ చనిపోలేదని విచిత్రమైన వాదన తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా, ప్రజలతో గొంతు కలిపి వారేం అడుగుతున్నారో వాటిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తుంటే... వాటికి ఈ 35 మార్కులు బ్యాచ్ సమాధానం చెప్పలేకపోతుంది.పరిపాలన నాకు చేతగాదు అని చెప్పే భాగస్వామితో కలిసి అధికారంలో ఉన్న కూటమి కాబట్టి.. 35 మార్కులు బ్యాచ్ అయింది. పరిపాలన చేతకాకపోతే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు. మీకెందుకు రాజకీయాలు. ఒకవైపు పరిపాలన చేతగాదు అని చెబుతూనే మరోవైపు వైఎస్ జగన్‌ను విమర్శించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్న సంకేతం పంపుతున్నారు.వందలాది యూట్యుబ్ ఛానెళ్లతో అబద్దపు ప్రచారం:నిజం గడప దాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందన్న సామెత తరహాలో.. 14 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో తమకేం మేలు జరగలేదని తెలుసుకునేలోపు ఐదేళ్ల గత ప్రభుత్వ పాలనపై పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానెళ్లలో విషం చిమ్మడం ప్రారంభించారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని లక్షలాది పాంప్లెట్స్ తో ప్రచారం చేస్తున్నారు. విధ్వంసం జరిగితే రూ.2.75 లక్షల కోట్లు డీబీటీ ఎవరి అకౌంట్లలోకి వెళ్లింది. వైఎస్ జగన్ పాలనలో విధ్వంసమే జరిగితే ఆయన ప్రజాసమస్యల మీద బయటకు వెళ్తున్న ప్రతిసారి గతంలో పథకాలు తీసుకున్న లబ్ధిదారులే మీ పాలన మరలా కావాలని వెంటపడుతున్నారు.గత ఎన్నికల్లో మేం పొరపాటు పడ్డామని చెబుతున్నారు. కూటమి పార్టీల అబద్దపు ప్రచారాలని నమ్మి మోసపోయామని చెబుతున్నారు. దీంతో వందలాది యూట్యూబ్ ఛానెళ్లతో అబద్దాలు ప్రసారం చేస్తున్నారు. 2017 లో కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 183 మంది కల్తీ లిక్కర్‌తో చనిపోగా... 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాం నాటికి మరణాల సంఖ్య గతం కన్నా 27 తగ్గగా... 2020 నాటికి మరో 18 తగ్గింది. ముప్పై వేల మంది చనిపోయారని చెబుతున్నవారు వారి దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలి. తలో లెక్కతో కూటమి అనుకూల ఛానెల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.వైఎస్ జగన్ హయాంలో జరిగింది ముమ్మూటికీ అభివృద్ధి, పాలనలో అద్భుతాలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ. విద్యారంగంలో ఇంగ్లిషు మీడియం, నాడు నేడుతో సహా అనేక అద్భుతాలు చేసి చూపించారు. ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో వైద్య రంగంలోనూ సమూల మార్పులు చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వ విద్య, వైద్య విధానాలేంటో కూడా తెలియడం లేదు. ఆ రోజు వైఎస్ జగన్ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడితే కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌తో సహా భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏదైతే ఆశించారో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అది చేసి చూపించారు.ఏం నాటుతున్నారో అదే వస్తుంది:ఇవాళ రెడ్ బుక్ అనే ఇడియటిక్ బుక్ తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. గుర్తుంచుకొండి ఇవాళ ఏం మీరు నాటుతున్నారో అదే కాస్తుంది. వ్యవస్థలను నాశనం చేయాలనుకునే మీ ఫాసిస్టు దోరణిని ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మహిళా సాధికారత పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరిగింది. 30 లక్షల ఇళ్ల నిర్మాణం మహిళల పేరుతో చేపట్టారు. అంతే కాదు రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే.. డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్ వస్తుందని కోర్టులో సిగ్గులేకుండా చెప్పారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు అభివృద్ధి చెందాలని కోరుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డా.? మీరా.?పీ-4 ఓ మూర్ఖ పథకం:ఆ రోజు వైఎస్ జగన్ పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకతీతంగా చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కొత్త కొత్త పేర్లతో పథకాలు పెడతారు. పీ-4 పేరుతో ప్రతి గ్రామంలో సర్వే చేస్తారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు. టీడీపీకి ఓటేసి వారికి మాత్రమే మీరు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఇది కూడా ఓ ఇడియటిక్ ప్రోగ్రాం. ఇక మీరు అడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్న రూ.1500 ఏమయ్యాయి. దానికి సమాధానం చెప్పాలి.దానికి సమాధానం చెప్పలేక నీ అనుకూల యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా 30 వేల మంది బిడ్డలు తండ్రులను కోల్పోయారని.. అనాధలయ్యారని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. మీకు చేతనమైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో పోటీ పడండి. ఆయన మానవతా విలువలతో వైద్యం, విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషితో పోటీపడండి.నిజమైన మరో రెడ్ బుక్ ఉంది. 2024-27 మధ్యలో కరోనా లాంటి సాంక్రమిక వ్యాధులు ప్రజల్లో ప్రబలకుండా ఉండేందుకు వైద్యులు తయారు చేసిన పుస్తకం పేరు రెడ్ బుక్. మీరు తయారు చేసింది మీకు నచ్చని వాడి పేరు తీసుకుని వారిని జైల్లో వేయడం మీరు చేస్తున్న పని. ఆధారాలు లేని కేసుల్లో మీరు అరెస్టు చేసిన వారందరూ త్వరలోనే బయటకు వస్తారు.. కచ్చితంగా మీ అందరికీ తగిన శాస్తి జరుగుతుంది.అలా కాకుండా గాలి వార్తలు పోగు చేస్తూ ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరు. ప్రపంచంలో జరిగిన ఏ విప్లవాన్ని తీసుకున్నా.. మీకు అర్ధం అవుతుంది. జనాలు నిజాలు తెలుసుకున్నారు. కూటమి పార్టీలను ఇక ఎవరూ కాపాడలేరు. గ్రామాల్లోకి వెళితే మీకు, మీ ప్రజాప్రతినిధులకు వాస్తవాలు ప్రజలే చూపిస్తారు. ఆడబిడ్డ నిధి కోసం ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలని చెబుతున్న మంత్రులున్న ప్రభుత్వమిది. ఇప్పటికే రాష్ట్రంలో ఖనిజ సంపద, మెడికల్ కాలేజీలతో సహా అన్నింటినీ మీరు ఇప్పటికే అమ్మకం పెట్టారు. వైఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు.. ఆయన వెనుక ప్రజా సైన్యం ఉందన్న విషయం గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయడానికి మీరు చేస్తున్న కుయుక్తులు ఏవీ ఫలించవన్న విషయం గుర్తుపెట్టుకొండి. ప్రజల ఆమోదం ఉన్నంతవరకు వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌ని మీరేం చేయలేరని జూపూడి తేల్చి చెప్పారు. -
పవన్.. చేతనైతే ‘కోహినూర్’ను వెనక్కి రప్పించు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యింది. కోహినూర్ వజ్రం సీక్వెన్స్ ఈ చిత్ర కథలో భాగమని చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్... దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి” అని పవన్ పేల్చిన డైలాగూ ఉంది. అయితే బ్రిటిషర్లు తీసుకెళ్లిన ఆ వజ్రాన్ని నిజంగానే వెనక్కి తేవాలంటూ పవన్‌కు ఓ లేఖ చేరింది ఇప్పుడు. కోహినూర్.. ఒక వజ్రం(Kohinoor Diamond) మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఓ చిహ్నం కూడా. భారత్‌తో పాటు పాక్, అఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా ఈ వజ్రం తమదేనంటూ వాదిస్తుంటాయి. చివరకు.. 1849లో లాహోర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా చేతికి వెళ్లింది. అక్కడి నుంచి క్వీన్ విక్టోరియా కిరీటంలో పొదిగారు. రాజకుటుంబంలో మగవాళ్లు కోహినూర్‌ను అరిష్టంగా భావించి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత లండన్ టవర్ జ్యువెల్స్ టవర్‌లో ప్రదర్శనగా ఉంటోంది. కోహినూర్‌ను భారత్‌కు రప్పించేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ విజ్ఞప్తులను ఇంగ్లండ్ తోసిపుచ్చుతూ వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం తర్వాత మరోసారి ఈ డిమాండ్ ఊపందుకుంది. 2025లో బ్రిటన్ మంత్రి లీసా నాండీ(Lisa Nandy) భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ చర్చ జోరుగా సాగింది. కోహినూర్‌ను ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు అంటూ కామెంట్ చేశారామె. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం సంతృప్తికర పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతోందని అంటోంది. ఈ నేపథ్యంలో.. పవన్‌కు చేరిన లేఖలో అంశాలు ఇలా.. ‘‘మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన "హరిహర వీరమల్లు" చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను.బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్ సామ్రాజ్యం, కోహినూర్ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడించడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులకు, వారి నుండి మొగల్ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజులకు, వారి నుండి పంజాబ్ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్ వారికి అది లభించింది.బ్రిటిష్‌వారు దానిని దొంగతనంగా లండన్ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం. మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది.యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు.కోహినూర్ డైమండ్.. మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహినూర్ డైమండ్ కథాంశంగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కావడం గమనార్హం.VIDEO | Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan ) says, "The Kohinoor should definitely be brought back to India. I personally feel it belongs to our nation, it is the property of Bharat. That is our heart and soul, that is our Ratnagarbha. I think it should be… pic.twitter.com/sPZHjsBJjM— Press Trust of India (@PTI_News) July 22, 2025 -
అభిమానమా?.. ఉన్మాదమా..?: కారుమూరి
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తణుకు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ మంత్రిగా పనిచేసిన తనపైన జనసేన సైకోలు దారుణంగా దాడికి తెగబడ్డారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థను దారుణంగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిన్న'బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి వెళ్తుండగా తణుకు టౌన్ బాయ్స్ హైస్కూల్ వద్ద జనసేనకి చెందిన కొంతమంది రౌడీ మూకలు నా కాన్వాయ్ వాహనం పైకి ఎక్కి దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహనంపైన ఉన్న మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఫొటోలపైన నిలబడి హరి హర వీరమల్లు సినిమా జెండాలతో, జనసేన పార్టీ జెండాలతో వీరంగం సృష్టించారు. దాదాపు 15 నిమిషాలకు పైగా రణరంగం సృష్టించారు.గతంలో ఎన్నో సినిమాలు రిలీజైనప్పటికీ ఏ హీరో అభిమానులు కూడా ఇలాంటి సైకో దుందుడుకు చర్యలకు దిగడం తణుకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జనసేన అల్లరి మూకలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ చర్యలకు సామాన్య ప్రజలు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రౌడీ మూకలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనూ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా కలిసి అత్తిలిలో నా ఇంటిపైన దాడిచేసి వీరంగం సృష్టించారు.ఒకపక్క పవన్ కళ్యాణ్ ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అంతగా ప్రేమిస్తుంటే.. ఆయన మాత్రం టీడీపీ నాయకులు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించిన సొంత పార్టీ వారిని సంజాయిషీ కూడా అడగకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. చంద్రబాబే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారని పవన్ పదే పదే చెప్పడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఓర్చుకోలేకపోతున్నారు. మొన్న తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ఆవేదనపూరితంగా చెబితే, పవన్ మాత్రం చాలా క్యాజువల్‌గా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారంటే ఆ పార్టీ వారికి ఆయనిచ్చే గౌరవం అలాంటిది. ఆయన సొంత జనసేన కార్యకర్తల కంటే టీడీపీ నాయకత్వాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. -
అచ్చెన్నాయుడు గుట్టు బయటపెట్టేశాడే!
ఆడబిడ్డ నిధి పేరుతో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలి.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యఏపీలో ఐదేళ్ల ఫించన్ సొమ్ముతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చు.. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడునేనేదో చేసేస్తానని ఆశ పడుతున్నారు.. ఖజానా ఖాళీగా ఉంది.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు2024 ఎన్నికల సమయంలో వీరు ఈ మాటలు మాట్లాడి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయి ఉండేది. కానీ అప్పుడేమి బొంకారో గుర్తు చేసుకోండి. చంద్రబాబైతే.. తనకు సంపద సృష్టించడం తెలుసన్నాడు. సూపర్ సిక్స్ హామీలను, ఎన్నికల ప్రణాళికను అమలు చేసి చూపిస్తామని బల్లగుద్ది మరీ బుకాయించారు. బాబు గారి పుత్రరత్నం లోకేశ్ ఇంకో అడుగు ముందుకేసి.. అన్ని వాగ్దానాల అమలుకు పక్కా ప్లాన్ ఉందని, లెక్కలున్నాయని, తాము చేయలేకపోతే ప్రజలు చొక్కా కాలర్ పట్టుకోవచ్చు.. అని ఛాలెంజ్ కూడా చేశారాయె! ఇక జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మాటలు ఒకసారి గమనించండి.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక అమలుకు తనదీ గ్యారెంటీ అని గొప్పగా భరోసా ఇచ్చారు. అధికారం వచ్చింది.. ఏడాది గడిచింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా తమ మనసులోని మాటలు బయటపెట్టేసుకుంటున్నారు.... ప్రజలను మోసం చేయడానికే హామీలు ఇచ్చామన్నట్టుగా మాట్లాడేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన వాగ్ధానాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చాలా విస్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. తామిచ్చిన నవరత్నాల హామీ అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు అవుతోందని, దానిని భరించడానికే చాలా కష్టపడవలసి వస్తోందని, కూటమి ఇస్తున్న సూపర్ సిక్స్, తదితర హామీల అమలుకు రూ.1.5 లక్షల కోట్ల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఎలా తెస్తారు? అని! చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని పదే, పదే చెప్పేవారు. అయినా టీడీపీ, జనసేన నేతలు బుకాయించి, దబాయించి మరీ తమ సూపర్ సిక్స్ అమలు చేసి చూపిస్తామని అనేవారు. తమ వద్ద మంత్రదండం ఉందని చంద్రబాబు అనేవారు. ఇప్పుడేమో ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. వీటితోపాటు పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం అంటూ మరికొన్ని వాగ్దానాలు కూడా చేశారు. అందులో పరిశ్రమలు స్థాపించే ప్రతి వ్యక్తికి గరిష్టంగా రూ.పది లక్షల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అవన్ని అయిపు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ వీటిపై గట్టిగా నిలదీస్తుండడం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పదే, పదే కూటమి నేతల ఎన్నికల ప్రణాళికను గుర్తు చేస్తుండడంతో తప్పనిసరి స్థితిలో సుమారు 150 హామీలలో రెండు, మూడింటిని అరకొరగా అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. హమీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయేసరికి ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దానిని ఎలా అధిగమించాలా?అనే ఆలోచనతో రెడ్ బుక్ పాలన ద్వారా వైసీపీ వారిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టి మళ్లించాలని అనుకున్నారు. కేసులు పెట్టి కూటమికి మద్దతు ఇచ్చే మురికి మీడియాలో ఆ కేసుల వార్తలనే ప్రముఖంగా ప్రచారం చేయిస్తున్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. ఏదో గుట్టుగా మోసం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తుంటే, ఈయన రహస్యాన్ని బట్టబయలు చేశారని అనుకోవాలి.ఆడబిడ్డ నిధి పధకం కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని అచ్చెన్న ఓపెన్‌గానే చెప్పేశారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఎవరైనా విశ్లేషకులు చెబితే వారిమీద మండిపడేవారు. వైఎస్సార్సీపీ వాళ్లు ‘అదెలా సాధ్యం?’ అని అడిగితే విరుచుకుపడే వారు. చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసి చూపిస్తారని ప్రచారం చేసేవారు. చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా అత్యధికశాతం ‘మాట తప్పడమే’ అని జనానికి తెలిసినా, పవన్ కళ్యాణ్ కూడా జత కలవడం, బీజేపీ మద్దతు ఉండడంతో ఏమో ఈసారి ఏమైనా చేస్తారేమోలే అని ఆశ పడ్డవారు గణనీయంగానే ఉన్నారు. సూపర్ సిక్స్ ఎఫెక్ట్‌తో పాటు ఈవీఎంల మాయాజలం కలిసి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వృద్ధుల ఫించన్‌ను రూ. వెయ్యి పెంచారు. ఈ అదనపు పింఛన్ మొత్తాన్ని అందచేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ వేసుకువెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ 13 నెలల కాలంలో ఆ వ్యయం కోట్లు దాటిపోతుంది. ఇంకోపక్క ఫించన్‌దారులకు లక్షల సంఖ్యలో కోత పెడుతున్న వార్తలు వస్తున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్ బండలు ఉచితం అని చెప్పినప్పటికి అది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఒక గ్యాస్ బండ తాలూకూ డబ్బు మాత్రమే కొందరికి అందింది. మిగిలిన హామీలను ఒక ఏడాదిపాటు ఎగవేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. తల్లికి వందనం కింద చదువుకునే విద్యార్ధులకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఒక ఏడాదంతా ఇవ్వలేదు. జగన్ విమర్శల ప్రభావంతో ఆ స్కీములో రూ.రెండు వేలు కోతపెట్టి కొంతవరకు అమలు చేసినా, అది కూడా గందరగోళంగానే జరిగినట్లు చెబుతున్నారు. ఇక.. మిగిలిన హామీలేవీ నెరవేర్చక పోవడంతో జనం ఆగ్రహం చెందుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద మహిళలందరికి నెలకు1500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి సుమారు రూ.35వేల కోట్లు అవుతుందన్నది ఒక అంచనా. ఆ గణాంకాలను కొందరు నిపుణులు చెప్పకపోలేదు.కాని టీడీపీకి భజన చేసే మురికి మీడియా కూడా జనాన్ని మోసం చేయడానికి అదంతా సాధ్యమేనన్నట్లు ప్రచారం చేసింది. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఇంకోమాట మాట్లాడుతున్నారు. అంతేకాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామని వెల్లడించారు. అంటే దీని అర్థం చంద్రబాబు మోసం చేయబోతున్నారని తమకు తెలుసునని చెప్పడమే అవుతుంది కదా!. అయినా పథకాలన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అచ్చెన్న ముక్తాయించారు. అంటే గతంలో మాదిరి ఎన్నికల సంవత్సరం చివరిలో ఏదో చేసేశామని చెప్పి జనాన్ని మాయ చేసే అవకాశం ఉందని అనుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, ఫించన్లు ఇవ్వడానికే సరిపోతోందని కూడా అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. చిత్రం ఏమిటంటే ఎన్నికల ప్రణాళికలోని ఆడబిడ్డ నిధి స్కీము తప్ప అన్నిటిని అమలు చేసేశామని మంత్రి ప్రకటించడం. ఇది చంద్రబాబు చెబుతున్న తీరుగానే ఉంది. అది నిజమే అయితే ఎన్నికల మానిఫెస్టో చదువుతూ ఏ ఏ అంశాలు ఎలా అమలు చేస్తున్నది వివరించగలగాలి. కాని ఆ పని చేయరు.అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి బీసీలకు ఏభైఏళ్లకే పింఛన్ తదితర హామీల సంగతేమిటో మంత్రి చెప్పాల్సి ఉంటుంది. 2017లో జగన్ నవరత్నాల స్కీములను ప్రకటించినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసేది. అవి సాధ్యం కాదని అనేది. కాని జగన్ సీఎం అయి అమలు చేసి చూపించారు. అప్పుడు ఏపీ శ్రీలంక అయిపోతోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతోపాటు మురికి మీడియా విషం చిమ్మేది. కాని అదే సమయంలో టీడీపీ, జనసేన ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్సార్సీపీ ఇచ్చే సంక్షేమం కన్నా రెండు, మూడు రెట్లు అధికంగా ఇస్తామని నమ్మబలికేవారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కూడా సంక్షేమ స్కీముల గురించి పలుమార్లు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదేళ్ల పెన్షన్లకు అయ్యే వ్యయంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని చెబుతున్నారట. దీనిని బట్టి వారి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు విద్యార్థులు, మహిళలు ఎవరు కనిపించినా నీకు 15వేలు, నీకు 18 వేలు అంటూ సైకిల్ వేసుకుని వెళ్లి మరీ చెప్పిన నిమ్మల ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఈ మంత్రులు అచ్చం గురువుకు తగ్గ శిష్యులే అనిపించుకుంటున్నారా?. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.