
ఊసరవెల్లిని మించి పవన్ కల్యాణ్ రంగులు మార్చేస్తున్నారు. ‘‘జనసేనాని రూల్స్ మాట్లాడతారు.. కానీ పాటించరు.. నీతులు చెబుతారు.. కానీ ఆచరించరు. టిక్కెట్ రేట్లు పెంచుకుంటానికే డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్’’ అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అప్పుడు ‘పుష్ప’ సినిమా సమయంలో ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి టికెట్ల ధరలు పెంచుకోవాలన్న పవన్.. ఇప్పుడు తన ‘వీర మల్లు’కు మాత్రం.. నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచ్చేస్తారా?.. ఇదేనా మీరు చెప్పిన ‘‘నీకో చట్టం.. నాకో చట్టం" డైలాగ్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
మే 27న అధికారికంగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి అంటూ ఓ ట్వీట్ చేశారు. నా సినిమా అయిన సరే టికెట్ల ధరలు పెంపు కావాలంటే.. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధర పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా సంప్రదింపులు చేయాలని.. ఇందులో తన, మన బేధాలు పాటించవద్దని స్పష్టంగా చెప్పారు..
అయితే, ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. హరిహర వీరమల్లు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కేవలం మూవీ నిర్మాత రిక్వెస్ట్‌కు స్పందించిన చంద్రబాబు సర్కార్.. టికెట్ల రేటు పెంచుకోమంటూ పర్మిషన్ ఇచ్చేసింది. తన సినిమా రేట్లు పెంచుకుని డిప్యూటీ సీఎం సంతోష పడిపోయారు.
పుష్ప సినిమా అప్పుడు : ప్రతి ఒక్క నిర్మాత ప్రత్యక్షంగా వచ్చి కలిసి రేట్స్ పెంచుకోవాలి
మీ వీర మల్లు అప్పుడు : నిర్మాత రిక్వెస్ట్ పెట్టగానే హైక్ ఇచేస్తారా @PawanKalyan
ఇదేనా మీరు చెప్పిన " నీకో చట్టం నాకో చట్టం " డైలాగ్ 💦 pic.twitter.com/dAzZbDCouZ— Rohit_Ysrcp (@Rohit_Ysrcp) July 24, 2025
కాగా, గతంలో కూడా పవన్ కల్యాణ్ ఒక మాట అన్నారు.. ఒకరు కూడా వచ్చి చంద్రబాబును కలవలేదని.. లేఖ రాస్తూ.. ఇకపై సినిమా రేట్ల టికెట్లకు సంబంధించి ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు.. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ సెలవిచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఎంతమంది ప్రతినిధులు వచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.