
సాక్షి,అల్లూరి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుర్రాలపై నిరసన చేపట్టారు.
ఈ ఏడాది పవన్ ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన సమయంలో ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఇచ్చిన హామీ నీటిమీద రాతలు మిగిలాయి.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా.. రోడ్ల పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అసల వర్షా కాలం కావడంతో నానా అగచాట్లు పడుతున్న గిరిజనులు పవన్ తీరును ప్రశ్నించారు. నిరసనకు దిగారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రోడ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
