సాక్షి ఢిల్లీ: కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కి వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈమెయిల్ చేశారు. ప్రస్తుతం ఏపీలో విధ్యంసకర పరిస్థితులు నడుస్తున్నాయని ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేసారని ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేశారని రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారని తెలిపారు. ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారని పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రైక్షక పాత్ర వహించారని తెలిపారు. ఫలితంగా హింస ఇంకా కొనసాగుతోందన్నారు. దాడిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పౌరులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని కనుక కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకొని శాంతిభద్రతలను చక్కదిద్దాలని విన్నవించారు. పౌరుల ప్రాణాలను రక్షించేందుకు తగ్గిన చర్యలను తీసుకోవాలని పరిస్థితులు మరింత దిగజారకుండా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.


