
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టయిన కాకాణిని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ జగన్‌ను చూసేందుకు జనం భారీగా వస్తారు. అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదు’ అని భూమన అన్నారు. పీ-4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని.. పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ భూమన దుయ్యబట్టారు.
పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు భయపడం
నెల్లూరు జిల్లా: ఆంక్షలతో జననేత వైఎస్ జగన్‌ను అడ్డుకోలేరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ‘‘వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ పర్యటనలో పాల్గొనకూడదు అంటున్నారు. 31న నెల్లూరు పర్యటన విజయవంతం చేసి తీరుతాం’ అని చంద్రశేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు. పోలీస్ ఆంక్షలు, అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరన్నారు.
