
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశంలో ఏపీ సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ(రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో) కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ చర్చించారు. పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.
జగన్ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇక నుంచి ఈ విషయంలో రాజీ పడొద్దని పలువురు సభ్యులు ఆయన్ని కోరారు. అదే సమయంలో.. ఆయన కూటమి పాలనలో నడుస్తున్న కక్షపూరిత రాజకీయాలపైనా మాట్లాడారు.
