నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధం | nagoba jatara in keslapur | Sakshi
Sakshi News home page

నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధం

Jan 16 2018 8:37 AM | Updated on Aug 17 2018 2:56 PM

nagoba jatara in keslapur - Sakshi

సాక్షి, ఆదిలాబాద్: గిరిజనుల పండుగ నాగోబా మహాజాతరకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మంగళవారం) నాగోబా మహాజాతర మొదలుకానుంది. మర్రిచెట్ల నీడన మెస్రం వంశీయులు జాతర సందర్భంగా పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది.

అనంతరం రాత్రి పవిత్ర గంగా జలాలతో కేస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశస్థులు నాగోబాకు అభిషేకం చేయనున్నారు. నాగోబా మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు తరలిరానున్నారు.  దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement