గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌ | Aaryavir Sehwag joins Shubman Gill-With 5th-Highest Score-Youth ODIs | Sakshi
Sakshi News home page

గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌

Nov 10 2026 7:22 PM | Updated on Nov 10 2026 9:18 PM

Aaryavir Sehwag joins Shubman Gill-With 5th-Highest Score-Youth ODIs

Photo Credit: Twitter

అండ‌ర్‌-19 ఆసియా క‌ప్‌లో భార‌త బ్యాట‌ర్ ఆర్య‌వీర్ సెహ్వాగ్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. మంగ‌ళ‌వారం యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్య‌వీర్ భారీ శ‌త‌కంతో చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. 168 బంతుల్లో 160 ప‌రుగులు చేసిన ఆర్య‌వీర్ ఖాతాలో 17 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ఉన్నాయి. 

తాజాగా చేసిన సెంచ‌రీతో ఆర్య‌వీర్‌.. యూత్ వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోరు సాధించిన భార‌త క్రికెట‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ జాబితాలో అంబ‌టి రాయుడు (177 నాటౌట్‌) తొలి స్థానంలో ఉండ‌గా, వైభ‌వ్ సూర్య‌వంశీ (175) రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక రాజ్ బ‌వా (162 నాటౌట్‌) మూడో స్థానంలో ఉన్నాడు. 

ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో 160 ప‌రుగులు చేసిన ఆర్య‌వీర్‌.. మ‌యాంక్ అగ‌ర్వాల్ (160), గిల్ (160) సాధించిన ప‌రుగుల రికార్డును స‌మం చేశాడు. 2017లో వాంఖ‌డే వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన యూత్ వ‌న్డేలో గిల్ 160 ప‌రుగులు సాధించ‌గా, 2009లో హోబ‌ర్ట్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన యూత్ వ‌న్డేలో మ‌యాంక్ అగ‌ర్వాల్‌160 ప‌రుగులు సాధించాడు.

ఇక ఆర్య‌వీర్ శ‌త‌కానికి తోడు వీకే వినీత్ అర్థ‌సెంచ‌రీ చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 309 ప‌రుగులు చేసింది. యూఏఈఏ బౌల‌ర్ల‌లో నసీమ్ ఖాన్ 4 వికెట్లు తీయగా, హదయతుల్లా ఖాన్‌, నూరుల్లా అయోబి, అయాన్ మిస్బా త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. 310 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన యూఏఈ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 239 ప‌రుగుల‌కు ఆలౌటయ్యింది.

యూఏఈ బ్యాట‌ర్ల‌లో అహ్మ‌ద్ ఖుదాదాద్ (74) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, నూరుల్లా అయోబి (39), య‌యిన్ రాయ్ (29) ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో ఇషాన్ సూద్ 4 వికెట్లతో మెరిశాడు. ఈ విజ‌యంతో ఆసియా క‌ప్‌లో భార‌త్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

ఇదీ చదవండి: శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement