‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’ | YSRCP Leader Ravindranath Reddy Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

Nov 6 2026 7:29 PM | Updated on Nov 6 2026 7:47 PM

YSRCP Leader Ravindranath Reddy Slams Chandrababu Sarkar

వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారుకి నేరుగా గెలిచే దమ్ములేకే అరాచకాలు సృష్టించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు, అనుకున్న వారిని సెలక్షన్‌ చేసుకునే దానికి ఎలక్షన్లు అని పేరెందుకని ప్రశ్నించారు.  అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచి దానికి ప్రజాస్వామ్యం అనే ముసుగు ఎందుకని నిలదీశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేమని తెలుసు కాబట్టే ఇంతటి అరాచకానికి తెరలేపారని మండిపడ్డారు. 

‘మీరు అక్రమాలు, దాడులు చేయకపోతే మున్సిపాలిటీలు, పరిషత్‌ ఎన్నికల్లో ఇన్ని ఏకగ్రీవాలు ఎలా అయ్యాయి..?, లోకేష్‌ సారధ్యంలో పక్కా స్కెచ్‌తోనే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే ఇలాంటి దాష్టీకానికి దిగారు. వీరి అక్రమాలకు పోలీసు శాఖ, ఎన్నికల కమిషన్‌ పూర్తిగా ఏకపక్ష మద్దతు ఇచ్చింది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు...ప్రజలకు ఒక సమయం వస్తుంది...అప్పుడు అన్నిటికీ బదులు చెప్తారు’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అప్పట్లో ప్రతిపక్షానికి ఒక్కటే.. ఇప్పుడు 16..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement