సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అరాచకాలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్యాణ దుర్గం పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దాడులు చేశారు. బౌన్సర్లతో దాడులు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్గీయుల దాష్టీకంపై వైఎస్సార్‌సీపీ నిరసనకు దిగింది. నిరసనలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ నేత జీకే కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కల్యాణదుర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీకి సిద్ధం కాగా, ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్‌సీపీ నేత సీనియర్ నేత జీకే కృష్ణమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: గెలుపు కాదు అరాచకం


