వెంకటలక్ష్మి, జయలక్ష్మి
విజయనగరం (రామభద్రపురం): మండలంలోని కోటశిర్లాంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. కోటశిర్లాం ఎంపీటీసీ స్థానాన్ని అన్ రిజర్వడ్ జనరల్‌కు కేటాయించారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లను ప్రధాన పారీ్టలు బరిలోకి దించాయి. వైఎస్సార్సీపీ నుంచి తల్లి వెంకటలక్ష్మి నామినేషన్ వేయగా ఆమె ప్రత్యర్థిగా టీడీపీ తరఫున కూతురు బప్పడాల జయలక్ష్మితో నామినేషన్ వేయించారు. వీరి మధ్య ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల బరిలో మాజీ గ్రామ వలంటీర్
రాజాం : మండలంలో బొద్దాం గ్రామానికి చెందిన మాజీ గ్రామ వలంటీర్ నక్క పార్వతి స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గ్రామ వాలంటీర్‌గా ఆమె గ్రామంలో ప్రజలకు విశేష సేవలు అందించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం వలంటీర్ వ్యవస్థ రద్దవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో బొద్దాం గ్రామ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సెగ్మెంట్‌కు బరిలో నిలిచి ప్రచారం చేస్తున్నారు. ఎంపీటీసీగా తాను గెలిచి జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.


