హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా. ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే తన పెళ్లి విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానాలను అందించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన నిశ్చితార్థ ఆహ్వానాన్ని అందించారు. ఈ మేరకు సీఎంని కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
అయితే తేజ సజ్జా వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని గతంలోనే స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యానని వెల్లడించారు. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లిని నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ తప్పులు.. ‘రామాయణం’ నేర్చుకున్న పాఠాలు?)
Actor Teja Sajja Meets CM Revanth Reddy! Actor Teja Sajja met Telangana Chief Minister Revanth Reddy at MCRHRD and invited him to his engagement ceremony. #TejaSajja #RevanthReddy #Telangana #EngagementCeremony #Tollywood https://t.co/WKH3fp9i0w
— Telangana Ahead (@telanganaahead) November 6, 2026


