ఆ ఎమ్మెల్యే నాలుక కోస్తే రూ.5 లక్షలిస్తా!

Congress Leader Announces Rs 5 Lakh For Cutting BJP MLA's Tongue - Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత 

ముంబై : ‘మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండి. ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చే పూచీ నాది’. అని అమ్మాయిల పట్ల అసహ్యంగా మాట్లాడిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే  రామ్‌ కదమ్‌ నాలుక కోస్తే రూ. 5 లక్షలిస్తానని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుబోధ్‌ సావ్‌జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఎమ్యెల్యే తీరును తప్పుబట్టిన ఆయన ఇలాంటి చెత్త మాటలు మాట్లాడిన ఆ నాలుకను కోసేయాలని మండిపడ్డారు. 

ముంబైలోని ఘట్కోవర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రామ్‌ కదమ్‌ శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా గత సోమవారం నిర్వహించిన సంప్రదాయ ‘దహీ హండీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యువకులంతా.. మీకు ఎలాంటి అవసరమున్నా సరే నన్ను కలవండి. 100 శాతం పక్కాగా సాయం చేస్తా. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులను వెంటబెట్టుకురండి. వారు అంగీకరిస్తే మీరు ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్‌ చేసి, మరి మీతో పెళ్లి చేయిస్తా’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తాయి. అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధై అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తానని బహిరంగంగా ప్రకటించడం ఏంటని మండిపడుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top