మోసపూరిత మాటలు నమ్మరాదు | - | Sakshi
Sakshi News home page

మోసపూరిత మాటలు నమ్మరాదు

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

కడప కార్పొరేషన్‌ : కొంతమంది వ్యక్తులు తాము విద్యుత్‌ శాఖ ఉద్యోగులమని తప్పుడు ప్రచారం చేస్తూ చేస్తున్న మోసపూరిత మాటలు నమ్మరాదని జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి సోమా శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ టవర్లు ఒకచోట కాకుండా వేరే చోట వేయిస్తామని, విద్యుత్‌ లైన్లు మారుస్తామని, కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇప్పిస్తామని, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తామని, ఇతర విద్యుత్‌ సంబంధిత పనులు చేయిస్తామని చెప్పి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై సంబంధిత వ్యక్తులపై పోలీసు శాఖకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విద్యుత్‌ శాఖలో అన్ని రకాల చెల్లింపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయన్నారు. విద్యుత్‌ శాఖ తరఫున ఎవరూ వ్యక్తిగతంగా నగదు రూపంలో డబ్బులు వసూలు చేయరని, శాఖకు చెల్లించాల్సిన రుసుము నిర్ణీత ఆన్‌లైన్‌ వేదికల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. అలాగే మేము విద్యుత్‌ శాఖ నుండి వచ్చాము, స్తంభాల స్థానాలు మారుస్తాము, విద్యుత్‌ లైన్లు మార్పు చేస్తాము, కొత్త కనెక్షన్‌ మంజూరు చేయిస్తాము, మీ పని త్వరగా పూర్తి చేయిస్తాము అంటూ ఎవరైనా డబ్బులు కోరిన పక్షంలో వారి మాటలను నమ్మవద్దని, వెంట నే సమీప విద్యుత్‌ శాఖ కార్యాలయంలో లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement