వానరాల కడుపు నింపుతున్న ‘కార్తిక’ సేవ! | - | Sakshi
Sakshi News home page

వానరాల కడుపు నింపుతున్న ‘కార్తిక’ సేవ!

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

● శివాలయంలో మిగిలిన పండ్లతో మూగజీవాలకు ఆహారం

● 2016 నుంచి సొంత ఖర్చులతో రాపూరు ఘాట్‌లో చిరువ్యాపారుల పంపిణీ

రాజంపేట టౌన్‌ : కార్తీక మాసంలో రాజంపేట పట్టణంలోని పురాతన శివాలయానికి తరలివచ్చే భక్తులు స్వామివారికి వేల సంఖ్యలో అరటిపండ్లను ప్రసాదంగా సమర్పించి అక్కడే వదిలి వెళ్తుంటారు. ఈ పండ్లు వృథా కాకుండా మూగజీవులకు ఆహారంగా అందించాలని ఈడిగపాళెంకు చెందిన ఎలక్ట్రీషియన్‌ నరసింహ సంకల్పించారు. ఆయన ఆలోచనకు చిరువ్యాపారులు పబ్బతి వెంకటనరసయ్య, చిట్వేలి ఈశ్వరప్రసాద్‌, కాయల వెంకటరమణ, బి.సురేంద్ర, నీలి సుబ్రమణ్యం తోడవడంతో 2016 నుంచి ఈ సేవకు శ్రీకారం చుట్టారు.

ప్రతి ఏటా కార్తీక సోమవారాలు, పౌర్ణమి మరుసటి రోజు ఆలయంలో మిగిలిన పండ్లను సేకరించి సొంత ఖర్చులతో ఆటోలో రాపూరు ఘాట్‌కు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే కార్తీక పౌర్ణమి మరుసటి రోజైన బుధవారం వేల సంఖ్యలో అరటిపండ్లను సేకరించి దారిపొడవునా ఉన్న మూగజీవులకు, రాపూరు ఘాట్‌ వానరాలకు పంపిణీ చేశారు. తమ పనులు మానుకుని మరీ చేస్తున్న వీరి సేవపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement