ఆశా కార్యకర్తపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఆశా కార్యకర్తపై వేటు

Nov 26 2026 12:12 AM | Updated on Nov 26 2026 12:12 AM

వేంపల్లె : విధుల పట్ల నిర్లక్ష్యం, గ్రామస్తులతో దురుసు ప్రవర్తన ఆరోపణలపై వేంపల్లె మండలం అయ్యవారిపల్లె ఆశా కార్యకర్త కొడూరు మమత సేవలను తక్షణమే రద్దు చేస్తూ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి. యుగంధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పులివెందుల డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జరిపిన విచారణలో 90 శాతం మంది ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల గడువు ఇచ్చినా తీరు మారకపోవడంతో గ్రామ ఆరోగ్య కమిటీ తీర్మానం, కలెక్టర్‌ ఆమోదం మేరకు ఆమెను తొలగించి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తాళ్లపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారిని ఆదేశించారు.

అంతర్‌ యూనివర్సిటీ కబడ్డీకి ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థులు

ప్రొద్దుటూరు కల్చరల్‌ : సాయి రాజేశ్వరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) విద్యార్థులు కేజీ కళ్యాణ్‌కుమార్‌ (సివిల్‌), పి.రాజేశ్వరి (ఈసీఈ) అంతర్‌ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పాండురంగన్‌ రవి తెలిపారు. ఇటీవల కుప్పంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చాటిన వీరిద్దరూ డిసెంబర్‌లో మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ, మంగళూరు డీమ్డ్‌ యూనివర్సిటీల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులను కళాశాల చైర్మన్‌ బసిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, యాజమాన్య ప్రతినిధులు అభినందించారు.

పలు మండలాల్లో వర్షం

వల్లూరులో అత్యధికంగా

29.2 మి.మీ. నమోదు

కడప అగ్రికల్చర్‌ : ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కొనసాగుతోంది. అత్యధికంగా వల్లూరులో 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే కమలాపురంలో 24.2 మి.మీ., పెండ్లిమర్రిలో 18.4, మైదుకూరులో 16.6, ఆట్లూరులో 8.6, బి.మఠంలో 8.2, నందలూరులో 7.6, పోరుమామిళ్లలో 5.2, వీరబల్లిలో 3.2, గోపవరం, కాశినాయనలలో 3.0 చొప్పున, బద్వేల్‌లో 2.8, రాజంపేటలో 2.4, చాపాడులో 2.2, జమ్మలమడుగులో 1.4, ఎర్రగుంట్లలో 1.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.

సరసమైన ధరలకు

నాణ్యమైన సన్నబియ్యం

కడప అగ్రికల్చర్‌: పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు కడప నాగరాజపేట డీసీఎంఎస్‌ కాంప్లెక్స్‌ (షాపు నంబర్‌ 22)లో ప్రభుత్వ శ్రీధరణిశ్రీ బ్రాండ్‌ సన్నబియ్యం విక్రయాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె. రఘురాం బుధవారం ప్రారంభించారు.

వర్షాభావంతో వరి సాగు తగ్గి మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ, డీసీఎంఎస్‌ సంయుక్తంగా ఈ విక్రయాలు చేపట్టాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ ఖాదర్‌వల్లి, సివిల్‌ సప్లయిస్‌ డీఎం నాగసుధ, తహసీల్దార్‌ మహబూబ్‌చాంద్‌, డీటీ వహీదా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement