వేంపల్లె : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ పీయూసీ విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల విజయవాడ, శ్రీకాకుళం వేదికలుగా జరిగిన ఈ పోటీల్లో వైఎస్సార్ జిల్లా తరఫున బరిలోకి దిగిన ఆర్‌కే వ్యాలీ విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో హ్యాండ్‌బాల్ విభాగంలో తంగరాజ్, అథ్లెటిక్స్‌లో సుమంత్ అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ విజయప్రకాష్, పరిపాలనాధికారి రత్నకుమారి విజేతలను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి క్యాంపస్‌కు, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల పీడీలు రమణారెడ్డి, బాల ఓబయ్య, షంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు.


