ఘనంగా పుష్పగిరి క్షేత్రం పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పుష్పగిరి క్షేత్రం పుస్తకావిష్కరణ

Nov 23 2026 5:36 AM | Updated on Nov 23 2026 5:36 AM

వల్లూరు : ‘పంచ నదీ సంగమం పుష్పగిరి క్షేత్రం’ అనే పుస్తకాన్ని పుష్పగిరి పీఠాఽధిపతి శ్రీ విద్యా శంకరభారతీస్వామి ఆవిష్కరించారు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరి గురించిన వివరాలతో పంచనదీ సంగమం పుష్పగిరి క్షేత్రం అనే పుస్తకాన్ని ప్రజలకు అందించాలనేది జిల్లా పర్యాటక పితామహులు, దివంగత సిద్దవటం సీతారామయ్య చిరకాల కోరిక, ఆకాంక్ష. ఈ మేరకు ఆయన శిష్యురాలైన కడప నెమలిదిన్నె నాగవేణి ఎంతో కాలంగా పరిశోధన చేసి పంచ నదీ క్షేత్రం పుష్పగిరి క్షేత్రం పుస్తకాన్ని రచించి రూపునిచ్చారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లో జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య కుమారులు సిద్దవటం శేషు, కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి చైర్మన్‌ డా.విశ్వనాథ్‌, పెమ్మసాని ప్రభాకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement