వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ బీసీ నేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ బీసీ నేత

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

నందలూరు : రాజంపేట నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లె సర్పంచి ఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు భోగాపతి శిరీషకు ప్రజా మద్దతు పెరుగుతోంది. కూటమి పాలనపై వ్యతిరేకతతో గురువారం నాగిరెడ్డిపల్లెకు చెందిన టీడీపీ బీసీ నేత బెస్త సుబ్రమణ్యం (మట్టిబాబు), మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచి భూమన శంకర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నాగిరెడ్డిపల్లె అర్బన్‌ పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆకేపాటి జగదీశ్వర్‌రెడ్డి, మైనార్టీ పెద్ద షాజహాన్‌, మాజీ కో–ఆప్షన్‌ సభ్యుడు కలీం, పాల్గొన్నారు.

తమ్ముళ్ల బాహాబాహీ

పులివెందుల రూరల్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల రెండో రోజు తుమ్మలపల్లె కేంద్రం వద్ద పచ్చ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న ఒక వర్గంపై ప్రత్యర్థి వర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు అసభ్య పదజాలంతో దూషణలకు దిగాయి. శ్రీనీవెంత అంటే నీవెంతశ్రీ అంటూ ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement