నాణ్యతకు సాటిలేనిది భారతి సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

నాణ్యతకు సాటిలేనిది భారతి సిమెంట్‌

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

ప్రొద్దుటూరు : నాణ్యతకు సాటిలేనిది భారతి సిమెంట్‌ అని ఆ కంపెనీ మార్కెటింగ్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి, స్టేట్‌ టెక్నికల్‌ డీజీఎం ఓబుళరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎస్‌కే గ్రాండ్‌లో ఇంజనీర్లతో, డీలర్లతో భారతి సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక రోబోటిక్‌ టెక్నాలజీతో భారతి సిమెంట్‌ తయారువుతుందని తెలిపారు. నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా రెండు రకాల బ్రాండ్లను అందిస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత, భద్రత, సరైన మిశ్రమ నిష్పత్తులు పాటించడం ముఖ్యమని ఇంజనీర్లుతో వివరించారు. కార్యక్రమంలో భారతి సిమెంట్‌ కంపెనీ సేల్స్‌ ఆఫీసర్‌ జయరామ్‌రెడ్డి, టెక్నికల్‌ ఇంజనీర్లు నాగేంద్ర, తులసిరెడ్డి, డీలర్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

మదనపల్లె టౌన్‌: అగ్ని ప్రమాదంలో గాయపడిన మదనపల్లె మున్సిపల్‌ పారిశుధ్య కార్మికురాలు గురువారం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాలూకా ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెలోని సత్యసాయి కాలనీకి చెందిన రాధమ్మ (50) మున్సిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తోంది. బుధవారం ఇంట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు దుస్తులకు అంటుకోవడంతో గాయపడింది. ఆమెను తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement