అగ్నిప్రమాదం:రూ.7 లక్షల ఆస్తినష్టం | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదం:రూ.7 లక్షల ఆస్తినష్టం

Nov 20 2026 1:43 AM | Updated on Nov 20 2026 1:43 AM

బద్వేలు అర్బన్‌ : పట్టణంలోని నెల్లూరు రోడ్డులో శేఖర్‌ థియేటర్‌ ఎదురుగా గల పలు దుకాణాల్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు దుకాణాల్లో సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.7 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు స్థానిక నెల్లూరు రోడ్డులో గత కొన్నేళ్లుగా చల్లానరసింహులు విద్య ఫుట్‌వేర్‌ పేరుతో పాదరక్షల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం ముందరే టీ దుకాణం ఏర్పాటు చేశారు. అయితే గురువారం ఉదయం దుకాణంలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పక్కనే ఉన్న గాండ్లపద్మావతికి చెందిన కిరాణా దుకాణానికి, ఓబులేసుకు చెందిన బార్బర్‌షాపులోకి వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఫుట్‌వేర్‌ దుకాణంలోని పాదరక్షలు, ఇతర సామగ్రి, టీ దుకాణంలోని సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. అలాగే కిరాణా దుకాణంలో నిత్యావసర సరుకులు కాలిపోవడంతో రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు, బార్బర్‌షాపులో సామగ్రి దగ్ధం కావడంతో రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement