కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్‌ఎ క్రీడా మైదానంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల, దివ్యాంగుల దినోత్స వం సందర్భంగా వివిధ క్రీడాంశాలల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించినట్లు డీఎస్‌డీఓ గౌస్ బాషా తెలిపారు. గురువారం నిర్వహించిన ఈ ఎంపికల్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, తైక్వాండో, టేబుల్ టెన్నిస్, బ్లైండ్ గోల్‌బాల్, వీల్‌చైర్ ఫెన్సింగ్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఎంపికలను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు హుస్సేన్, సర్వశిక్ష అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ వెంకట సుబ్బ య్య, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ రమణమూర్తి, జిల్లా పారా స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
హుండీ ఆదాయం లెక్కింపు
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీ సొమ్మును గురువారం లెక్కించగా రూ. 4,64,948లు వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి, భక్తులు పాల్గొన్నారు.
22న జిల్లాస్థాయి
బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఈనెల 22న జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలి పారు. గతంలో అసోసియేషన్ అనుమతి లేకుండా బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఈ ఎంపికలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారుల ఒరిజినల్, జిరాక్స్ ఆధార్ కార్డులను తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28 వరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.
కచ్చితమైన సమాచారంతో జనగణన
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించడంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, ఖచ్చితమైన సమాచారం సేకరణతోనే దేశ అభివృద్ధికి అవసరమైన పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో జనగణన –2027లో భాగంగా రెండవ దశ జనాభా గణనకు సంబంధించి నిర్వహించిన ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనగణనలో చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా ప్రతి వివరాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని, ఎన్యుమరేట ర్లు, సూపర్‌వైజర్లకు విధులపై పూర్తి అవగాహన కల్పించేలా ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వాలని సూచించారు. జిల్లా జనగణన ఇన్‌చార్జి మోహన్ రమణ పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మల్లికార్జునుడు, నగరపాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్, సంబంధిత అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


