టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి

Nov 20 2026 1:31 AM | Updated on Nov 20 2026 1:31 AM

● పులివెందుల, పుంగనూరుపై

చంద్రబాబు, లోకేష్‌కు కక్ష

● మెజార్టీ ఉన్నా అడ్డంకులు సృష్టిస్తారా

● రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి ఆగ్రహం

సాక్షి, మదనపల్లె: ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న టీడీపీ విచ్చలవిడితనం కనిపిస్తోందని, ఈ పరిస్థితులు చూస్తుంటే ఇదివరలో ఉన్న ఆలోచనలు ఈరోజు మార్చుకునే పరిస్థితి వస్తోందని, ఇక సౌమ్యంగా ఉంటే కుదరదు..ఎవరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్‌ వారికి ఇచ్చే రోజులు దగ్గరపడ్డాయని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. గురువారం జరిగిన నిమ్మనపల్లె మండల ఎంపీపీ ఎన్నిక సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును గౌరవించే పరిస్థితుల్లో టీడీపీ లేదని, వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నా సమస్య సృష్టించి రాజకీయం చేయాలని చూస్తోందని అన్నారు. నిమ్మనపల్లిలో తమ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ సమస్యలు సృష్టించాలని ఫిర్యాదులు చేశారన్నారు. రాజకీయాల కోసం మహిళలను అడ్డుపెట్టుకొని నీచంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజా తీర్పును గౌరవించాలని టీడీపీ నేతలను కోరారు. రామసముద్రం జెడ్పీటీసీని వైఎస్‌ఆర్‌సీపీ 800 ఓట్ల మెజార్టీతో గెలిస్తే కౌంటింగ్‌లో గెలుపును తారుమారు చేశారన్నారు. రామసముద్రం ఎంపీటీసీని కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వీటిన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో అడ్డంకులు సృష్టించారన్నారు. పులివెందుల, పుంగనూరుపై చంద్రబాబు, లోకేష్‌ అక్కసుతో ఏదోరకంగా ఇబ్బంది పెట్టాలని ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. నామినేషన్‌ ఇచ్చినా కూడా అధికారులు తీసుకోలేదన్నారు. పుంగనూరులో నాపైన దాడి చేసి, నాపైనే అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. పులివెందులలో ఒక మండలంలో సవ్యంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్‌ఆర్‌సీపీకి భారీ మెజార్టీ వచ్చిందని, అదేవిధంగా పుంగనూరులోనూ సవ్యంగా ఎన్నికలు జరిగి ఉంటే భారీ మెజార్టీ వచ్చేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement