వేంపల్లె : డబ్బులు కోసం పోలీసులు దిగజారారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లెలోని నామినేషన్ కేంద్రంలోకి టీడీపీ అల్లరి మూకలు దూరి నామినేషన్ పత్రాలను చించే ప్రయత్నంలో ప్రింటర్లు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం చాలా దారుణం ఉన్నారు. అధికారులను కూడా బెదిరించి ఫర్నీచర్ను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. పోలీసులు పచ్చ గుండాలకు సహకరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ కేంద్రాల్లో విధ్వంసం చేస్తున్నారంటే వీళ్ల అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అందరికీ అర్థమవుతుందన్నారు. నామినేషన్లకు వెళ్లాలంటే నామినేషన్ కేంద్రం వద్ద మండల ఇన్ చార్జ్ అచ్చుగట్ట రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో వందల మంది పచ్చ గుండాలు అక్కడ గుమి కూడి ఉంటే పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్టు వివరిస్తూ ఉన్నారు. రఘునాథరెడ్డి పోలీసుల జీపు పైన ఇంటి అల్లుడు కూర్చొన్నట్లు నామినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటే పోలీసులు ఎంతకు అమ్ముడుబోయారో అర్థమవుతుందన్నారు. వైఎస్సార్సీపి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే పోలీసులు కంచ అడ్డువేసి అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా పోలీసులు కనీసం పరువునైన దక్కించుకోవాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎస్‌వీ సతీష్‌కుమార్ రెడ్డి


