సైనిక స్కూల్‌ ప్రవేశాలకు 2 వరకు గడువు | - | Sakshi
Sakshi News home page

సైనిక స్కూల్‌ ప్రవేశాలకు 2 వరకు గడువు

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

కడప ఎడ్యుకేషన్‌ : సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష 2027కు దరఖాస్తు కోసం డిసెంబర్‌ 2వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ గడువు ముగిశాక రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 3 నుంచి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. 2027 జనవరి 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, జనవరి 31న ఓఎంఆర్‌ (పెన్‌ అండ్‌ పేపర్‌) విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు

https://exams.nta.nic.in/sainik& school&society/, https://nta.ac.in వెబ్‌సైట్లను సందర్శించాలని డీఈఓ సూచించారు.

ఇంటికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

జమ్మలమడుగు రూరల్‌ : మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో బుధవారం రాత్రి వరలక్ష్మి అనే మహిళ ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల వివరాల ప్రకారం..

వరలక్ష్మికి ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడికి ఇటీవల వివాహమైంది. పెద్ద కుమారుడు సురేంద్ర తల్లితో కలిసి ఉంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వరలక్ష్మి కడపకు వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని అదను చూసి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పు అంటించారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా, వరలక్ష్మి వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement