బీజేపీపై టీడీపీ మూకల దాడిని సహించం | - | Sakshi
Sakshi News home page

బీజేపీపై టీడీపీ మూకల దాడిని సహించం

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

కడప రూరల్‌ : బీజేపీ శ్రేణులపై తెలుగుదేశం పార్టీ మూకలు చేస్తున్న దాడిని సహించబోమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ ప్రెస్‌ క్లబ్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటని తెలిపారు. కూటమి ధర్మాన్ని బీజేపీ పాటిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడం హేయమైన చర్య అని విమర్శించారు. పెండ్లిమర్రి మండలం ఇసుకపల్లె గ్రామ సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన తమ పార్టీకి చెందిన లంకా చిన్నపరెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇదే తరహా దాడులు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరగడం కూటమి ధర్మాన్ని వమ్ము చేయడమేనని విమర్శించారు. బీజేపీ, జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, రామకష్ణ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement