నవజాత శిశువుల సంరక్షణపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

నవజాత శిశువుల సంరక్షణపై శ్రద్ధ వహించాలి

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

కడప రూరల్‌ : నవజాత శిశువుల సంరక్షణ పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ యుగంధర్‌ అన్నారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో జాతీయ నవజాత శిశువుల వారోత్సవాల సందర్భంగా ‘చిన్నారి శిశువులు.. అపార సంపద ’ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ వారోత్సవాలలో నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ, పోషణ, భవిష్యత్తు ఆరోగ్యాన్ని పరిరక్షించడం పై అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలనే అందించాలని తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. శిశువులకు తగినంత వెచ్చదనం, పరిశుభ్రత కల్పించి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించాలని తెలిపారు. తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే జన్మించిన శిశువులను గుర్తించి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పేర్కొన్నారు. శిశువుల్లో ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, డీపీఎంఓ డాక్టర్‌ మొహమ్మద్‌ తాహా, ఆర్‌ బి ఎస్‌ కే ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ అరిఫుల్లా, డాక్టర్‌ శ్రీదేవి, డెమో భారతి, కుమారి, ప్రసన్న లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement