గ్రామ స్వరాజ్యానికి ‘చంద్ర’గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్యానికి ‘చంద్ర’గ్రహణం

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

పాల కేంద్రం ఉండింటే రైతులు బాగుపడేవారు

● వైఎస్సార్‌సీపీ హయాంలో...

సంక్షేమం పేదింటి గడపతొక్కింది.. అభివృద్ధి నలుదిక్కులా పరుగులు తీసింది..

ఊరూరా కొలువుదీరిన సచివాలయాలతో పల్లె ప్రగతి పట్టాలెక్కింది. సేవలన్నీ ఒకేచోట చేరి పాలన పండగలా సాగింది..

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమైంది...

● కూటమి పాలనలో..

అభివృద్ధి ఆగింది.. సంక్షేమం గాడి తప్పింది.. కొత్త పింఛన్‌ ఊసే లేకుండా పోయింది..

వలంటీర్ల సేవకు ‘చంద్ర’గ్రహణం పట్టింది.. ఫలితంగా ‘సచివాలయ సేవ’ విచ్ఛిన్నమైంది. వెరసి పల్లె సీమ అభివృద్ధికి దూరమై తల్లడిల్లుతోంది.

నంగనూరుపల్లెలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటైన జగనన్న పాలవెల్లువ మహిళా డైరీ సహకార సంఘం

గ్రామాల్లో వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమ రంగానికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జగనన్న పాల వెల్లువ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగనూరుపల్లెలో గ్రామీణ పాడి రైతుల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో 2024 ప్రారంభంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. కూటమి ప్రభు త్వం ఏర్పడ్డాక ఈ పాల కేంద్రం నిరుపయోగంగా మారింది.

ప్రొద్దుటూరు : జాతిపిత మహాత్మా గాంధీ కన్న గ్రామ స్వరాజ్య కలను సాకారం చేస్తూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పల్లె సీమల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ‘సచివాలయం’ అనే పదాన్ని ఏకంగా ప్రతి పల్లె గడపకు తీసుకొచ్చి, పాలనను ప్రజల ముంగిట నిలిపింది. అయితే, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కక్షసాధింపు ధోరణితో ఆ అద్భుత వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఫలితంగా, నాడు కళకళలాడిన పల్లెలు నేడు జీవచ్ఛవంలా తల్లడిల్లుతున్నాయి.

సేవలు ఇలా..

● ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బందిని నియమించి, 500కు పైగా ప్రభుత్వ సేవలను గ్రామంలోనే అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 600కు పైగా గ్రామ సచివాలయాలు నిర్మించడం విశేషం.

● ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి, గౌరవ వేతనం అందిస్తూ సంక్షేమ పథకాలను, పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేర్చారు. కరోనాలాంటి విపత్కర సమాయంలోనూ సేవలు ఆగలేదు.

● రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతకు అండగా నిలుస్తూ, ఎరువులు, పురుగుమందులు గ్రామంలోనే అందించారు.

● పల్లె ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తూ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, యువత కోసం డిజిటల్‌ లైబ్రరీలు, పాడి రైతుల కోసం పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలి రెండేళ్లు కరోనా విపత్తుతో పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పటికీ, మిగిలిన మూడేళ్లలోనే సచివాలయ వ్యవస్థ ద్వారా అద్భుతమైన ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. డిజిటల్‌ లైబ్రరీలు, పాల ఉత్పత్తి కేంద్రాలు నూతనంగా నెలకొల్పారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి గ్రామాల్లో వీటిని మంజూరు చేయడంతోపాటు నూతన భవన సముదాయాలను నిర్మించారు.

ఆరోగ్యానికి భరోసాగా... పల్లె ప్రజల ఆరోగ్యానికి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భరోసా కల్పించింది. వైద్యంతో పాటు కరోనా సంక్షోభ సమయాల్లోనూ విస్తృత సేవలందించి గ్రామీణుల గుండెల్లో నిలిచిపోయింది.

గ్రామంలో పాలకేంద్రం ఉంటే పాల ఉత్పత్తిదారులకు మేలు జరిగేది. ప్రభుత్వం పాలకు మంచి ధరను చెల్లించేది. ఇప్పుడు వ్యాపారులు అడిగిన ధరకు పాలు పోయాల్సి వస్తోంది. వ్యాపారులు గ్రామంలో పాలు సేకరించి పట్టణానికి తీసుకెళుతున్నారు.

– మొలకాని సౌజన్య, నంగనూరుపల్లె, ప్రొద్దుటూరు మండలం.

యూరియా బాగా దొరికేది

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వా రా కావాల్సినంత యూరియా దొరికేది. ఈ కూటమి ప్రభు త్వంలో సొంత భూములున్న రైతులకై నా, కౌలు రైతులకై నా యూరియా బస్తా దొరకాలంటే గగనంగా మారింది. సకాలంలో రైతుకు కావాల్సినంత యూరియా ను ప్రభుత్వాలు అందించలేకపోతే రైతు పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. యూరియా కొరతతో బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలు పెట్టి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. – ఎ.రాజశేఖర్‌, కౌలు రైతు,

చెంచుపల్లె గ్రామం, చాపాడు మండలం

ఉపయోగంలోకి రాని చిలంకూరులోని గ్రామ సచివాలయం, ఆర్‌బీకే

వైఎస్సార్‌సీపీ హయాంలో సచివాలయాల ద్వారా

ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు

వలంటీర్ల ద్వారా స్వచ్ఛంద సేవ

కూటమి రాకతో వలంటీర్ల తొలగింపు

ఆగిన ఇంటింటి సేవలు

ఇది కక్షకాదా !

కూటమి ప్రభుత్వం రైతులపై కక్షగట్టిందనడానికి ఈ చిత్రమే సాక్ష్యం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే చిలంకూరులో సచివాలయం, ఈ రైతు భరోసా కేంద్రం నిర్మాణం ప్రారంభించారు. చిన్న చిన్న మైనర్‌ పనులు తప్ప దాదాపు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వాటిని పూర్తిగా పక్కనబెట్టేసింది. నిధులున్నా ఉపయోగంలోకి తీసుకురాకుండా కక్షగట్టింది. ఫలితంగా రైతులకు సేవలందించాల్సిన గ్రామ సచివాలయం ఆర్‌బీకే ఇలా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై ఎంపీడీఓ వెంకటరమణయ్య వివరణ కోరాగా చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పూర్తి చేసి త్వరలోనే వినియోగంలోకి తీసుకుస్తామని పేర్కొన్నారు. – ఎర్రగుంట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement