రెండో విడతకు సర్వం సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

రెండో విడతకు సర్వం సిద్ధం!

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

1,984 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం:

పోలింగ్‌ నిర్వహణ కోసం మొత్తం 1,984 బ్యాలెట్‌ బాక్సులను వినియోగించనున్నారు. వీటిలో 331 బ్యాలెట్‌ బాక్సులు ఇప్పటికే ఆయా ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకున్నాయి. మిగిలిన అవసరాలకు అనుగుణంగా 207 పెద్ద పరిమాణం, 784 మధ్యస్థ పరిమాణం, 662 చిన్న పరిమాణం కలిగిన బ్యాలెట్‌ బాక్సులను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement