శైవ క్షేత్రాలకుఆర్టీసీ ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

శైవ క్షేత్రాలకుఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

కడప కోటిరెడ్డిసర్కిల్‌: పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వివిధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీఓ) రమేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మాసంలో ప్రతి సోమవారంతో పాటు, ఈ నెల 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని శ్రీశైలం, మహానందితో పాటు జిల్లాలోని పొలతల, నిత్యపూజకోన, పుష్పగిరి, కన్యతీర్థం, అగస్తేశ్వరకోన, లంకమల తదితర శైవ క్షేత్రాలకు ఈ బస్సులు నడుస్తాయని వివరించారు.

ఉడవగండ్లలోపచ్చ గూండాల దాడి

తొండూరు: టీడీపీ నాయకుల అరాచకా లు పెచ్చుమీరాయి. పంచాయతీ నామినేషన్లు బుధవారం ప్రారంభం కానుండగా.. మంగళవారం రాత్రి తొండూరు మండలంలోని ఉడవగడ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శశికాంత్‌ రెడ్డి ఇంటిపై, అలాగే పుల్లారెడ్డి, మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇళ్లపై పచ్చ గూండాలు రాళ్లతో, కర్రలతో దాడులకు దిగారు. ఇళ్లలో మహిళలు ఉన్నా లెక్కచేయకుండా వారిపై రాళ్లు విసరడం రేపు నామినేషన్‌కి వస్తే మిమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తూ కేకలు వేసుకుంటూ గ్రామంలో భయబ్రాంతులకు గురి చేశారు. ఎస్సై శివనాగిరెడ్డిని వివరణ కోరగా ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శశికాంత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement