పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

కడప అర్బన్‌ : రాజీ మార్గమే రాజమార్గమని, పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జి. రామ గోపాల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు ఈ నెల 21న నిర్వహించనున్న ముందస్తు స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ ఏర్పాట్లపై ఉమ్మడి కడప జిల్లాలోని న్యాయమూర్తులతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 21న జరగనున్న ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో ప్రధానంగా ఎన్‌.ఐ. యాక్ట్‌ (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌) కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను ముందుగానే గుర్తించి, కక్షిదారులకు ముందస్తు నోటీసులు అందించాలని ఆదేశించారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో అత్యధిక కేసులు రాజీ కుదిరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, డిసెంబర్‌ 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం న్యాయమూర్తులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తమ వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్‌. శాంతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి ఎస్‌. బాబా ఫకృద్దీన్‌ పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement