సన్న బియ్యం.. కష్టాల మయం! | - | Sakshi
Sakshi News home page

సన్న బియ్యం.. కష్టాల మయం!

Nov 17 2026 12:32 AM | Updated on Nov 17 2026 12:32 AM

● ఒక్కరోజుకే నిండుకున్న స్టాకు..

● కౌంటర్ల వద్ద పేదల పడిగాపులు

● పట్టించుకోని అధికారులు

పులివెందుల రూరల్‌ : పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సన్న బియ్యం కోసం లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. పులివెందులలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సన్నబియ్యం కౌంటర్‌ వద్ద సోమవారం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు.ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం ఎంతో అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే స్టాకు నిండుకోవడంతో పంపిణీ నిలిచిపోయింది. స్టాకు లేకపోవడంతో కౌంటర్‌ వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతూ, అసౌకర్యానికి లోనవుతున్నారు. బియ్యం ఎప్పుడు వస్తాయో, తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియక అయోమయంలో పడ్డారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే పేదలు సైతం తమ పనులను మానుకుని కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపిణీకి సంబంధించి సంబంధిత అధికారులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సన్నబియ్యం పంపిణీ వేళలపై ముందస్తు సమాచారం అందించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినంత స్టాకు అందుబాటులో ఉంచాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement