మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు సంస్కారమా? | - | Sakshi
Sakshi News home page

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు సంస్కారమా?

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

బద్వేలు అర్బన్‌ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్‌మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దారుణమని, తక్షణమే ఆ వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్‌జీవో కాలనీలోని ఆమె నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ వ్యక్తిగత విషయాలపై మాట్లాడవద్దని మా నాయకుడు వైఎస్‌జగన్‌ ఆదేశించి హుందాగా వ్యవహరిస్తే జనసేన పార్టీ సైకోలు మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని, దీనిపై పవన్‌కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఏనాడు రాజకీయాల్లోకి రాని భారతిపై సభ్యసమాజం సిగ్గుపడేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మహిళలను గౌరవించాలని పదేపదే ప్రకటనలు గుప్పించే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, నారాలోకేష్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్ళుగా ఐటీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాలు బూతులు మాట్లాడానికి వ్యక్తిత్వ హననానికి లైసెన్సులు తెచ్చుకున్నట్లు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా జగనన్న కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement