కొండాపురం: మండల పరిధిలోని గండికోట జలాశయాన్ని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం ఆదివారం సందర్శించింది. విజయవాడ ఇంజినీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) నరసింహామూర్తి, కర్నూలు చీఫ్ ఇంజినీర్ (సీఈ) ఎస్. ఖబీర్ బాషా, కడప సీఈ బి. బాలచంద్రారెడ్డి జలాశయానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారని ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో పాటు గేట్ల పనితీరు, నిర్వహణ తదితర అంశాలను వారు పరిశీలించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి, డీఈ గంగాధర్ రెడ్డి, ఏఈ రమేష్ పాల్గొన్నారు.


