మంత్రి.. పంచాఅతి | - | Sakshi
Sakshi News home page

మంత్రి.. పంచాఅతి

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

● మంత్రి హోదాలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన మండిపల్లి

● కోనంపేటలో నామినేషన్‌ పత్రాలు చించివేత

● శిబ్యాల, చిట్లూరులో బెదిరింపుల పర్వం

నామినేషన్ల వేళ..

సాక్షి ప్రతినిధి, కడప : స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలు హుందాగా వ్యవహరించాలి. స్థానికంగా తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నిక చేసుకునేందుకు ఓటర్లకు అవకాశం కల్పించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. అభివృద్ధిని అటకెక్కించడంతో కూటమి సర్కార్‌కు ఆ దమ్ము లేదు. సజావుగా ఎన్నికలు జరిగితే గెలుస్తామనే ధైర్యం లేదు. ఈ పరిస్థితుల్లో పచ్చ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జ న్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులచే అక్రమ నిర్భంధం చేయిస్తూ టీడీపీ నేతలు ఏకపక్ష పోలింగ్‌కు తెగబడుతున్నారు.

రాయచోటిలో ప్రత్యేక దౌర్జన్యం..

ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో ఇదివరకూ ఎన్నడూ లేని రీతిలో పచ్చనేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. సాక్షాత్తు మంత్రి హోదాలో మండిపల్లి రామప్రసాదరెడ్డి చేయని దౌర్జన్యమంటూ లేదు. పురపాలక ఎన్నికల్లో రాయచోటి కేంద్రంగా ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంలో ఉండగానే నిప్పు పెట్టారు. ఇంతటి దౌర్జన్యకర పరిస్థితి గడిచిన రెండు దశాబ్ధాలుగా ఎన్నడూ కన్పించలేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రాదేశిక సభ్యుల నామినేషన్లు కూడా అదే ధోరణి ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో చేయకుండా ఏకపక్షంగా చేసుకునేందుకు చేయని కుట్ర, కుతంత్రాలు, దౌర్జన్యమంటూ లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో మంత్రి ప్రత్యక్ష ప్రమేయం..

పార్టీ గుర్తులతో నిమిత్తం లేకుండా కొనసాగే సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా మంత్రి రామప్రసాదరెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లి ఏకంగా మహిళల చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలు చించేశారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వారిని బెదిరింపులకు పాల్పడ్డారు. సంబేపల్లె మండలంలో శిబ్యాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అక్కడికి చేరుకున్న మంత్రి సైతం బెదిరింపులకు దిగారు. స్వతంత్ర హోదా ఉన్న సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా ఇలాంటి దాడులు దౌర్జన్యాలకు దిగడం, అందులో మంత్రి హోదాలో రామప్రసాదరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొనడం ప్రజాస్వామ్యవాదులను నివ్వెరపరుస్తోంది.

యంత్రాంగం ఏకపక్షమే: మున్సిపల్‌ ఎన్నికలు, ప్రాదేశిక సభ్యుల ఎన్నికలు అధికార దుర్వినియోగం ఏస్థాయిలో చోటుచేసుకుందో ప్రజలకు తెలిసిందే. రెండు ఎన్నికల్లో విఫలమైన యంత్రాంగం సర్పంచ్‌ ఎన్నికలల్లోనైనా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ప్రజాస్వామ్యవాదులు భావించారు. కానీ పంచాయతీ ఎన్నికల్లోనూ పచ్చ మూకల.. ఖాకీల తీరు ఏం మారలేదు. రాయ చోటిలో మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌ రమేష్‌కుమార్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ నేత జెల్లా సుదర్శన్‌రెడ్డిలను పోలీసులు అక్రమంగా హౌస్‌ అరెస్టు చేశారు. మరోవైపు మంత్రి రామప్రసాదరెడ్డిని బందోబస్తు మధ్య దౌర్జన్యాలకు అవకాశం కల్పించారు. రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడంలో అధికారం యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది.

రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తానని చేసిన ప్రమాణాన్ని మరిచారు..

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాందిపోయి నిలువునా తూట్లు పొడిచారు.

బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తించారు.

మొన్న పురపాలక.. నిన్న ప్రాదేశిక.. నేడు పంచాయతీ.. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ దౌర్జన్యాలనే ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా మంట గలిపారు.

ఆయనే రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌ రెడ్డి. తాజాగా పంచాయతీ నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లి మహిళల నామినేషన్‌ పత్రాలు

చించేసి రౌడీయిజం ప్రదర్శించిన మంత్రిని చూసి జనం మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement