బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

కడప అర్బన్‌ : బాలల హక్కుల పరిరక్షణే మనందరి ధ్యేయమని జడ్జి ఎస్‌. బాబా ఫకృద్దీన్‌ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్‌ హోమ్‌లో కోలాటం, నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. బాబా ఫకృద్దీన్‌ మాట్లాడుతూ.. తప్పులను గుణపాఠంగా మలచుకుని, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించేవారే నిజమైన విజేతలన్నారు. ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవంతో కూడిన బాల్యం పొందే హక్కు ఉందని, వాటి పరిరక్షణ సమాజ బాధ్యతని తెలిపారు. పిల్లలు సవాళ్లను ఎదుర్కొని మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, వారికి డీఎల్‌ఎస్‌ఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి లీగల్‌ సర్వీసెస్‌ (15100), చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (1098), సైబర్‌ క్రైమ్‌ (1930) నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మొదటి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రేష్మా, డీఈఓ డా.ఎస్‌.షంషుద్దీన్‌, చిల్డ్రన్స్‌ హోమ్‌ సూపరింటెండెంట్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement